యశవంతపుర: తన భార్య వేధిస్తోందంటూ కన్నడ నటి శశికళపై భర్త, సినీ దర్శకుడు టీజీ హర్షవర్ధన్ బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2021లో ఓ సినిమా షూటింగ్‌లో శశికళ, హర్షవర్దన్‌కు పరిచయమైంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించారు.
కొన్నిరోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, తమ ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాగరభావిలోని ఆఫీసుకు వచ్చి కారంపొడి చల్లి దాడి చేసింది. 2022లో ఆమె ఫిర్యాదు చేయగా అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. సినిమా రంగంలో లేకుండా చేస్తానని బెదిరించిందన్నారు.
చివరకు 2022 మార్చిలో శశికళను వివాహం చేసుకున్నాను. కొద్ది రోజులకు కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు మా ఇంటికి వచ్చేవారు. అదేమని ప్రశ్నించినందుకు నన్ను బయటకు పంపి, రెండు గంటల తరువాత మళ్లీ ఇంటిలోకి రానిచ్చేది. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు శశికళతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment