
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో మోస్ట్ వయోలెన్స్‌తో నాని కనిపించారు. సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందే ట్రైలర్ విడుదల చేసిన మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సూపర్ హిట్ అవుతుందని నాని ఫుల్ ధీమాగా ఉన్నారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ట్రైలర్‌లోనే ఓ రేంజ్‌లో వయోలెన్స్ చూపించడంతో సెన్సార్ ఏ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మార్పులు చేయాలని సూచించింది. అలాగే అభ్యంతరకర పదాలు మ్యూట్ చేయాలని ఆదేశించింది. రక్తం కనిపించే సన్నివేశాల్లో రెడ్ కలర్‌ను డార్క్ చేయాలని సూచించింది. కాగా.. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు రెండుగంటల 37 నిమిషాలుగా ఉండనుంది. అలా మార్పులు చేయడంతోనే సెన్సార్ బోర్ట్ ఓకే టెప్పింది.
కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.