HIT 3 Movie
-
పాకిస్తాన్‌కు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు: హీరో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మే 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన మాట్లాడారు.హీరో నాని మాట్లాడుతూ..'ప్రస్తుతం పాక్‌తో యుద్ధం వల్ల పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా మా టీమ్‌తో మాట్లాడా. అవతలి వాళ్లు మనకు ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా తిరిగి ఇచ్చేసింది. అంటే వాళ్ల వల్ల మనదేశంలో ఒక సినిమా ఈవెంట్ కూడా రద్దు అయిందన్న సంతోషం కూడా పాకిస్తాన్‌కు ఇవ్వకూడదు. అందుకే ఈరోజు సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్నా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌కు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు' అని తెలిపారు.అనంతరం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. 'ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు -
ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడంతా యువ దర్శకులదే హవా. ఒకప్పుడు వెలుగువెలిగి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన చాలామంది డైరెక్టర్స్.. ఇప్పుడు సీనియర్లు అయిపోయారు. కెరీర్ పరంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా హిట్ 3 సినిమా సక్సెస్ అయిన సందర్భంగా యంగ్ డైరెక్టర్స్ అంతా ఒక్క చోటకు చేరారు.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు ట్వీట్ పెట్టడంతో తెలుగు యంగ్ డైరెక్టర్స్ మధ్య ఎంత బాండింగ్ ఉందో బయటపడింది. తామంతా ఎప్పుడు పార్టీ చేసుకుంటామని, ఒకరి సినిమా గురించి మరొకరం డిస్కస్ చేసుకుంటామని, కాకపోతే ఇలా ఇన్నాళ్లకు బయటపడిందని శైలేష్ చెప్పుకొచ్చాడు.శైలేష్ పోస్ట్ చేసిన ఫొటోలో ఏకంగా 19 మంది యంగ్ డైరక్టర్స్ ఉన్నారు. వీళ్లలో శైలేష్ తో పాటు పవన్ సాధినేని, రాహుల్ సంక్రిత్యాన్, మున్నా, అనుదీప్, బుచ్చిబాబు, సాయి రాజేశ్, శివ నిర్వాణ, శ్రీరామ్ ఆదిత్య, చందు మొండేటి, సందీప్ రాజ్, హసిత్ గోలి, వశిష్ఠ, వెంకీ కుడుముల, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సాగర్ కె చంద్ర, ఆర్ఎస్ జే స్వరూప్, భరత్ కమ్మ ఉన్నారు.(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..) We have been wanting to catch up for a long time now and what better way than to share the success of my movie with this bunch of people who stood by me in the toughest of times. You may not know this but this group of directors in TFI keep in touch, check on each other and make… pic.twitter.com/k7zYQlsvXY— Sailesh Kolanu (@KolanuSailesh) May 11, 2025 -
ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదు: నాని
‘‘హిట్ 3’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. కానీ... ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’.యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో నాని మాట్లాడుతూ– ‘‘శైలేష్‌తో నేను చేయబోయే తర్వాతి సినిమా మంచి వినోదాత్మక చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ ఆలోచన చెప్పాడు... చాలా బాగుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌ని ఆదరిస్తారని ‘హిట్ 3’తో ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు వారందరికీ «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు.‘‘హిట్ 3’లో నేను చేసిన అతిథిపాత్రకి ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్. ‘‘నాని ఎప్పటి కప్పుడు తనని కొత్తగా మలుచుకుంటున్నందుకు గర్వంగా ఉంది’’ అని నిర్మాత దీప్తి చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మృదులపాత్రకి నన్ను ఎంచుకున్నందుకు శైలేష్‌కి ధన్యవాదాలు’’ అని శ్రీనిధీ శెట్టి చెప్పారు. -
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్‌లో జీరో...
ఎర్రచందనం స్మగ్లింగ్.. నీకేం తెలుసు? అని పుష్ప సినిమా చూసిన ప్రేక్షకుడ్ని అడిగితే?.. కల్కి సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే ఆ సినిమా చూసిన వారిలో ఎంతమంది ప్రేక్షకులు ఠక్కున చెప్పగలరు? ఆర్ఆర్ఆర్ సినిమా సన్నివేశాలకు మన ఇంటి చుట్టుపక్కల పరిస్థితులకు ఏమన్నా సంబంధం ఉందా? దేవర మూవీలో హీరోని చూస్తూ అతనితో మనకు తెలిసిన వారిని ఎవరినైనా పోల్చుకోగలమా? హిట్ 3లో చూపించిన డార్క్ వెబ్ గురించి తెలియడం అటుంటి అసలు ఆ పదం మనలో ఎందరు విని ఉంటాం?ఛత్..ఇవన్నీ ఎందుకు బాస్... ఆ సినిమాలన్నీ జనం జేబులు కొల్లగొట్టి మనకు కలెక్షన్ల మూటలు కొట్టుకొచ్చాయి కదా. అది చాలు అంటోంది టాలీవుడ్. పాన్ ఇండియా పేరుతో ప్రజలకు పరిచయం లేని సంబంధం లేని అక్కర్లేని, రంగుల హంగుల విచిత్రాల్ని కళ్ల ముందుకు తెస్తోంది. అయితేనేం అవి హిట్ అవడం లేదా అంటే అవుతున్నాయి. బ్రహ్మాండంగా కలెక్షన్లు తెస్తున్నాయి. కానీ అదొక్కటే చాలా? ఏమీ అర్ధం కాకపోయినా జురాసిక్ పార్క్, అవతార్..వగైరా చిత్రాలు మన దగ్గర కూడా భారీ కలెక్షన్లు కురిపించాయి. అంతమాత్రాన అలాంటివే మనమూ తీయాలని అనుకుంటామా? విదేశీ చిత్రాలకు ఇక్కడ మనుషులతో, ఇక్కడి మనస్తత్వాలతో, ఇక్కడి పరిస్థితులతో పనిలేదు.. అవసరం లేదు. కానీ ఇక్కడి సినిమాలు ఇక్కడి మనుషులతో పెనవేసుకున్నాయి. ఇక్కడి ప్రజల కష్టంతో తయారవుతున్నాయి. వారి కష్టంతోనే దర్జాగా బ్రతుకుతున్నాయి. కాబట్టి జనం చూస్తున్నారు మేం తీస్తున్నాం అనేది ప్రాంతీయ సినిమాల వరకూ సరైన విధానం కాదు.(చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)పెద్ద ఎన్టీయార్ తరం చూస్తే నాటి హీరోలు ఎన్ని రకాల సినిమాలు చూపించారు? దైవ భక్తి నుంచి దేశభక్తి దాకా బోధించేవి...అవినీతి అరికట్టమని అన్యాయాన్ని ఎదరించమని రక్త సంబంధాలకు విలువీయమని...రాజకీయాలను బాగు చేయమని...సందేశాలిచ్చేవి ఇలా సామాజిక అంశాలతో ముడిపడిన సినిమాలు ఎన్నో వచ్చాయి... మంచి చెడు రెండింటినీ జనానికి విడమరిచాయి. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి సినిమాలు సృష్టించాడు కాబట్టే ఎన్టీయార్ అనే వ్యక్తిని జనం తమ అన్నగా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. పార్టీ పెట్టిన ఆర్నెళ్లలోనే సిఎంని చేసి నెత్తిన పెట్టుకున్నారు.(చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!)ఆ తర్వాత డ్యాన్సులు, ఫైట్లకు పెద్ద పీట వేసిన చిరంజీవి తరం కూడా జనరంజక సినిమాలనే అది కూడా జనజీవన స్రవంతికి దూరం కాకుండానే అందించింది. తొలిదశలో చేసిన అభిలాష, స్వయంకృషి, ఛాలెంజ్‌ల నుంచి రాజకీయాలకు ముందు చేసిన ఠాగూర్,స్టాలిన్... దాకా మన సమాజంతో ముడిపడిన కధాంశాలతో చేశాడు కాబట్టే చిరంజీవి ఒక పార్టీ పెట్టి 19 సీట్లు, 70లక్షల ఓట్లు దక్కించుకోగలిగాడు. అయితే ఇక్కడ సినిమా నటులు అందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ విషయాలు చెప్పడం లేదు. వారి వృత్తికి, ఎంచుకున్న రంగానికి, చేసే పనికి ప్రజలతో మమేకమైతే అది ఎంతగా ప్రజల్లో వారిపై ఆదరణ పెంచుతుందో సోదాహరణగా చెప్పడమే ఉద్ధేశ్యం. ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తి సినిమాలకి ఉంది అనడం నిస్సందేహం. అలాంటి సినిమాలను ప్రజల దైనందిన జీవితాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించడం అంటే వారి జేబులు కొల్లగొట్టడం తో తప్ప వారి కష్టనష్టాలతో తమకేమీ సంబంధం లేదని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే.(చదవండి : ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక)అంటే జనం కోసం సినిమా తీసి మమ్మల్ని డబ్బులు పోగొట్టుకోమంటావా? అని నిర్మాతలు, ఫ్లాప్ సినిమాలతో ఫ్యాన్స్‌ని దూరం చేసుకోమంటావా? అని ప్రశ్నించే హీరోలు ఉంటారు. అయితే సందేశాత్మక చిత్రాలకు కలెక్షన్లు రావనేది అర్ధసత్యం మాత్రమే. వాటిలోనూ హిట్స్, ఫ్లాప్స్ అవుతుంటాయి. గేమ్ ఛేంజర్ లాగా అవాస్తవిక చిత్రణతో తీస్తే ఫ్లాప్‌లు అదే ‘కోర్ట్’ లాగా వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే కలెక్షన్లు వస్తాయని తెలుస్తూనే ఉంది. అలాగని భారీ చిత్రాలు కాల్పనిక కధాంశాలు వద్దనడం లేదు అవి కూడా తీయవచ్చు, సదరు గ్రాఫిక్ ఆధారిత చిత్రాలతో అంతర్జాతీయంగా మన సినిమాల పేరు ప్రతిష్టలు పెంచవచ్చు. కానీ అవి మాత్రమే తీయాలని అనుకోకూడదు. ప్రజలతో సంబంధం ఉన్నవి కూడా తీయాలి. వారి కష్టనష్టాలకు ఊరటనిచ్చేవి, వారి రేపటికి బాటలు పరిచేవి, వారి బాగుకి దిక్సూచిగా నిలిచేవి కూడా చేయాలి. కనీసం రెండేళ్లకు ఒకటైనా లో బడ్జెట్లో అయినా సామాజిక అంశాలతో సినిమా చేస్తామని పెద్ద హీరోలు తమకు తాము మాట ఇచ్చుకోవాలి. తమకెన్నో ఇచ్చిన సమాజం రుణం తీర్చుకోవాలి. అలా కాదు..అవన్నీ చిన్న హీరోలకు వదిలేస్తాం...మేం మాత్రం ఇలాగే వీడియో గేమ్స్ తరహా చిత్రాలు చేసుకుంటూ ప్రజల కళ్లు విప్పార్చుకునేలా చేస్తూ డబ్బు చేసుకుంటాం...అంటే..ఖచ్చితంగా అది అన్యాయమే, సామాజిక బాధ్యత లేకపోవడమే.. అప్పుడు పెద్ద హీరోల దగ్గర డబ్బులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు..కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. అలా లేనప్పుడు పేరుకి పెద్ద హీరో అయినా చివరకు జీరోగానే మిగులుతాడు. -
HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ హిట్-3 సినిమాతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యాడు. హిందీలో ఆయన సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, హిట్-3లో విలన్‌గా ఆల్ఫా పాత్రలో మంచి గుర్తింపు పొందాడు. సికందర్, దర్భార్, భాగీ2 వంటి చిత్రాల్లో కూడా ప్రతీక్ మెప్పించాడు. అయితే, ప్రతీక్ బాబర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు అని చాలామందికి తెలియదు. మహానటి అనే పేరుకు అసలైన ఐకాన్‌గా ఒకప్పుడు ఆమె పేరు పొందింది.పద్మశ్రీతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్ ఏకైక కుమారుడే ప్రతీక్ బాబర్.. 80కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ కాకముందే ఆమె డైరెక్టర్స్‌కు కండీషన్స్ పెట్టేది. అగ్లీ డ్రెస్సులు అంటే నో చెప్పేది. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే.. డబ్బు ఎంత ఇచ్చినా సరే డోన్ట్ కేర్ అనేది. ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నదే పదేళ్లు.. అయినా సరే భారీగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్లీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది. కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది. ఇదొక మచ్చుతునక మాత్రమేనని చెప్పవచ్చు.1955లో జన్మించిన ఆమె దశాబ్దకాలంలోనే 80కి పైగా సినిమాల్లో నటించింది. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2013లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్మితా పాటిల్ ప్రతీక్ బబ్బర్‌ను కన్న తరువాత రెండు వారాలకు చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది. తల్లి మీద ప్రేమతో హిట్-3 నటుడు తన పేరును 'ప్రతీక్ స్మితా పాటిల్'గా మార్చుకున్నాడు. -
నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అనుభూతికి లోనవుతారు. 'హిట్ 3' దర్శకుడు శైలేష్ కొలను కూడా ఇప్పుడు అలాంటి అనుభూతికి లోనయ్యాడు. ఈసారి దర్శనం మాత్రం జీవితంలో మర్చిపోలేనని, అదొక అనిర్వచనీయమైనది అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం) 'నా జీవితంలోనే ఈ రోజు (మే 08) స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. థ్యాంక్స్ టూ అభయ్(కొడుకు). నిన్న రాత్రి స్వాతి(భార్య)-నేను మా రూంలో నిద్రపోతుంటే.. అభయ్ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు అనిపించి వచ్చి చూశాం. చేతిలో స్వామి కీ చైన్ పట్టుకుని దేవుడితో మాట్లాడుతూ కనిపించాడు. తనతో పాటు ఇంటికి వచ్చేయమని వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాడు. ఇదంతా చూసి నాకు చాలా ముద్దుగా అనిపించింది. ఈ రోజు ఉదయం దర్శనం ముగిసిన తర్వాత బయటకొచ్చేస్తుంటే అయ్యగారు(దేవుడు) నుంచి మరోసారి పిలుపు వచ్చింది. దాదాపు 10 నిమిషాల పాటు గర్భగుడిలో కూర్చున్నాం. ఇదంతా అనిర్వచనీయమైన అనుభూతి. అభయ్ కి దేవుడి ఇచ్చిన బహుమతిలా అనిపించింది. నమో వెంకటేశాయ' అని శైలేష్ కొలను రాసుకొచ్చాడు.స్వతహాగా డాక్టర్ అయిన శైలేష్ కొలను.. ఆస్ట్రేలియాలో జాబ్ చేశాడు. కానీ సినిమాలపై ఆసక్తితో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. 2020లో 'హిట్' మూవీతో సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత హిట్ 3, సైంధవ్, తాజాగా హిట్ 3 చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాడు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించనున్నాడు.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) Had the best darshan of my life at Tirumala today. Thanks to Abhay. Swathi and I were in our room last night and suddenly heard Abhay talking something. We were surprised to see him hold a swamy keychain in his hand and talking to it asking the lord to come home with him and live… pic.twitter.com/6grOp80qvy— Sailesh Kolanu (@KolanuSailesh) May 8, 2025 -
ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు.. డిప్రెషన్లోకి వెళ్లా: శ్రీనిధి శెట్టి
తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన నటి శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty ). యష్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత శ్రీనిధికి వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళంలో విక్రమ్‌తో ‘కోబ్రా’ చిత్రంలో నటించగా, నాని నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’(HIT3)తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదగడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది. ఎన్నో బాధలను అదిగమించి ఈ స్థాయికి చేరుకుంది. చిన్నతనంలోనే ఆమె అమ్మను కోల్పోయింది. కొన్నాళ్ల పాటు డిప్రెషన్లోకి కూడా వెళ్లిందట. బెంగళూరికి వచ్చిన తర్వాతే తన జీవితం మారిపోయిందంటోంది శ్రీనిధి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది.‘నేను పదో తరగతి చదువుతున్న సమయంలో మా అమ్మ చనిపోయింది. ఆ షాక్‌ను నేను తట్టుకోలేకపోయాను. కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్లాను. ఆ ఇంట్లోనే ఉండాలనిపించలేదు. గతాన్ని మర్చిపోయేందుకు బెంగళూరుకు వెళ్లిపోయాను. అయినా, అమ్మను మర్చిపోలేకపోయాను. చాలా రోజులు ఆమెను తలుచుకుంటూ ఏడ్చాను. ఈ ఘటన నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. బెంగళూరుకు వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. జైన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, కొంతకాలం అక్సెంచర్‌లో ఉద్యోగం చేశా. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాను. 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్ గెలవడం.. అక్కడ సినిమాల్లోకి రావడం.. పాన్ ఇండియా సినిమాల్లో నటించడం.. ఇవన్నీ ఓ కలలా అనిస్తున్నాయి’ అని శ్రినిధి చెప్పుకొచ్చింది. ఇక తండ్రి గురించి మాట్లాడుతూ.. నాన్నతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఆయన నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు’ అని చెప్పింది.శ్రినిధి సినీ కెరీర్ విషయానికొస్తే.. ‘హిట్: ది థర్డ్ కేస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమెకు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’, కిచ్చా సుదీప్తో ‘కిచ్చా 47’ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటీవల నితేష్ తివారీ రామాయణంలో సీత పాత్ర కోసం ఆమెకు అవకాశం రాగా, ‘కేజీఎఫ్’లో యష్‌తో జంటగా నటించిన కారణంగా ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. -
హిట్3 కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన అర్జున్ సర్కార్
'హిట్3: ది థర్డ్ కేస్' వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. కేవలం నాలుగురోజుల్లోనే ఈ రికార్డ్‌ను సాధించడంతో నాని ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాతి రోజుల్లో కూడా జోరు పెంచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ సందడి చేస్తున్నాడు. హిట్3 వంద కోట్ల క్లబ్లో చేరిందని తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు.హిట్3 సినిమా కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు. నాని కెరీర్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దసరా (రూ.120 కోట్లు) ఉంది. మరో వారంలోపే ఆ రికార్డ్‌ను సులువుగా హిట్3 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నాని కెరీర్లో వంద కోట్ల క్లబ్లో ఉన్న సరిపోదా శనివారం రూ.101 కోట్లు, ఈగ రూ. 100 కోట్లు చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు హిట్3 నాలుగో చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.హిట్3 విడుదల సమయంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఏదీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్లో నాని జాయిన్ అవుతాడు. ఆ తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. SARKAAR'S CENTURY 💥💥💥101+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 4 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jItA massive first weekend for the action crime thriller 🔥#BoxOfficeKaSarkaar pic.twitter.com/QJgST28de0— Wall Poster Cinema (@walpostercinema) May 5, 2025 -
రికార్డ్స్ బద్దలు కొడుతున్న నాని హిట్ - 3
-
'హిట్3' కలెక్షన్స్ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని
'హిట్3: ది థర్డ్ కేస్' సినిమా మూడురోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ రెండోరోజు కూడా సత్తా చాటింది. అయితే, తాజాగా మూడోరోజు కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు.హిట్3 సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ డే రూ. 43 కోట్లు, సెకండ్ డే రూ. 19 కోట్లు రాబడితే.. మూడోరోజు రూ. 20 కోట్లు రాబట్టింది. నేడు ఆదివారం సెలవు కాబట్టి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. గత రెండు రోజులుగా థియేటర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. నానీని అర్జున్ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. చిత్ర యూనిట్ అంచనాలకు మించి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందనను చూసి దర్శకుడు, నిర్మాతలు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు.చాగంటి కోటేశ్వరరావుగారికి నచ్చి వాయిస్ ఇచ్చారు: శైలేష్ కొలను‘హిట్: ది థర్డ్ కేస్’లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్ సర్కార్ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్ ఓవర్ ఇచ్చారు. డార్క్ వెబ్ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్ వెబ్ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. 82+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 3 days ❤🔥It's SARKAAR SHOW at the box office 💥💥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jItA sensational Sunday loading with massive bookings all over. #BoxOfficeKaSarkaar pic.twitter.com/dsRvH3lpFG— Wall Poster Cinema (@walpostercinema) May 4, 2025 -
కుటుంబ ప్రేక్షకులు రావడం మాకు ఆశ్చర్యం: శైలేష్ కొలను
‘‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాకి ఒక వర్గం ప్రేక్షకులే వస్తారనుకున్నాం. గత రెండు రోజులుగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాం. చాలామంది మహిళలు రావడం గమనించాం. నానీగారిని అర్జున్ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి ఎగ్జైట్మెంట్తో వస్తున్నారనిపించింది. మా అంచనాలను దాటి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందన సర్ప్రైజింగ్గా అనిపించింది’’ అని శైలేష్ కొలను చెప్పారు. నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల1న విడుదలైంది. ఈ సందర్భంగా శైలేష్ కొలను చెప్పిన విశేషాలు...∙‘హిట్: ది థర్డ్ కేస్’లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్ సర్కార్ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్ ఓవర్ ఇచ్చారు. డార్క్ వెబ్ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్ వెబ్ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. ∙‘హిట్ 3’ క్లైమాక్స్‌లో అడివి శేష్ కనిపిస్తారు. విశ్వక్ సేన్‌ని ఇంకా బిగ్గర్ కాన్వాస్‌లో చూపించాలనే ఈ మూవీలో చేయించలేదు. ‘హిట్ 6’ లేదా ‘హిట్ 7’లో అందరి హీరోల్ని ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాలని ఉంది.∙‘హిట్ 4’లో హీరో కార్తీగారు నటిస్తారు. ఆ పాత్ర రూడ్‌గా, ఫన్‌గా ఉంటుంది. ఇక నాలో ఉన్న వినోదాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చేలా ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ రాయాలని ఉంది. -
నాని నీకు హ్యాట్సాఫ్.. 'హిట్ 3'పై రామ్ చరణ్ ట్వీట్
నాని లేటెస్ట్ మూవీ హిట్ 3.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మరీ సూపర్ అని అనట్లేదు గానీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా రెండు రోజుల్లో రూ.62 కోట్లకు పైనే వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి హ్యాట్సాఫ్ కూడా చెప్పాడు. 'హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు' అని చరణ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ') అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడీ స్థాయికి చేరిన నాని.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది. అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని 'ద ప్యారడైజ్', మార్చి 27న చరణ్ 'పెద్ది' సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని అధికారికంగానే ప్రకటించారు. ఇప్పుడు హిట్ 3 కోసం చరణ్ ట్వీట్ పెట్టడం చూస్తుంటే చరణ్ కి పోటీగా వస్తాడా? తప్పుకొంటాడా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) -
కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే
హీరో నాని నుంచి లేటెస్ట్ గా 'హిట్ 3' సినిమా వచ్చింది. మే 01న రిలీజైన ఈ చిత్రానిక రెండు రోజుల్లోనే రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూవీపై కొందరికి నచ్చనప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నాని రెండు సరికొత్త రికార్డ్స్ సృష్టించాడు.గత కొన్నాళ్ల నుంచి తన ప్రతి సినిమాతో ఆకట్టుకుంటున్న నాని.. ఓవర్సీస్ అంటే విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. హిట్ 3తో వరసగా 11వ సారి మిలియన్ మార్క్ వసూళ్లు సాధించాడు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సరసన చేరాడు. ఇంతకు ముందు మహేశ్ ఈ ఘనత సాధించాడు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) మరోవైపు 5 కంటే ఎక్కువగా 1.5 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన హీరోగానూ నాని నిలిచాడు. ఈ లిస్టులో ఇంతకు ముందు మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు నాని కూడా వాళ్లతో చేరిపోయాడు. నాని అందరూ మీడియం రేంజ్ హీరో అంటున్నారు గానీ ఓవర్సీస్ లో వసూళ్లు చూస్తుంటే స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గట్లేదని అనిపిస్తుంది.హిట్ 3 విషయానికొస్తే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే వయలెన్స్ ఎక్కువుందనే టాక్ వస్తోంది. నాని కూడా ఈ విషయం ముందే చెప్పాడు. కాబట్టి ఈ తరహా రక్తపాతం సినిమాలు నచ్చేవాళ్లు హిట్ 3కి వెళ్తున్నారు. దీని తర్వాత అంటే త్వరలో 'ద ప్యారడైజ్' సెట్స్ లో నాని అడుగుపెట్టబోతున్నాడు. అనంతరం డైరెక్టర్ సుజీత్ తో ఓ మూవీ చేస్తాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
హిట్3 బ్రేక్ ఈవెన్ మార్క్.. రెండురోజుల్లోనే భారీ కెలెక్షన్స్
'హిట్3: ది థర్డ్ కేస్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రెండోరోజు కూడా హిట్3 మూవీ షాకింగ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు.హిట్3 సినిమా కేవలం రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే రూ. 43 కోట్లు, సెకండ్ డే రూ. 19 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం వీకెండ్ సెలవలు ఉన్నాయి కాబట్టి ఆదివారం పూర్తి అయ్యే సరికి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. దానిని నిజం చేస్తూ.. ఈరోజు, రేపటికి ముందస్తు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఓవర్సీస్లో కూడా 1.5 మిలియన్ల డాలర్స్ దాటింది. ఇప్పటి వరకు నాని నటించిన 11 సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ సినిమా వారంలోపే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి తెలుగు సినిమా చరిత్రలో అత్యంత వేగంగా లాభాలను ఆర్జించిన వాటిలో హిట్3 ఒకటి.It is SARKAAR'S HUNT at the box office 💥💥#HIT3 grosses 62+ CRORES WORLDWIDE in 2 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar#AbkiBaarArjunSarkaar pic.twitter.com/YVf89blt27— Wall Poster Cinema (@walpostercinema) May 3, 2025 -
నాని ‘హిట్ 3’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?
సాధారణంగా హీరోయిన్లు వరసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ హిట్ కొట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్లతో పోలిస్తే కాస్త భిన్నమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. చేసింది తక్కువ సినిమాలే అయినా కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు 'హిట్ 3'తో మరోసారి సక్సెస్ అందుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడిత ఇంతకీ శ్రీనిధి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)ఈమె పూర్తి పేరు శ్రీనిధి రమేశ్ శెట్టి. మంగళూరులో పుట్టి పెరిగిన ఈమె తుళువ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. యాక్సెంచర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇందులో జాబ్ చేస్తూనే మోడల్ గానూ పనిచేసింది. అలా 2016 మిస్ సూపర్ నేషనల్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ అవార్డ్ గెలిచిన రెండో దక్షిణాది అమ్మాయిగా రికార్డ్ కూడా సృష్టించింది.ఇలా మోడల్ గా చాలా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. అనుకోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టిలో పడింది. అలా కేజీఎఫ్ ఫ్రాంచైజీలో ఈమెని హీరోయిన్ గా తీసుకున్నాడు. స్వతహాగా ఇది హీరో సెంట్రిక్ సినిమా అయినప్పటికీ రీనా దేశాయ్ అనే పాత్రలో శ్రీనిధి నటన ఆకట్టుకుంది. అలా ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.కేజీఎఫ్ 2 రిలీజైన కొన్నాళ్లకు తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమా చేసింది. ఇది తెలుగులో ఆడలేదు గానీ తమిళంలో మాత్రం మోస్తరు హిట్ గా నిలిచింది. 2022లో కోబ్రా చేసిన శ్రీనిధి.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి 'హిట్ 3'తో పరిచయమైంది.(ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)హిట్ 3 కూడా హీరో సెంట్రిక్ యాక్షన్ మూవీ కావడంతో శ్రీనిధి శెట్టికి ఏమంత ప్రాధాన్య ఉండదులే అని చాలామంది అనుకున్నారు. స్టోరీకి అవసరమయ్యే పాత్ర ఈమెకు దక్కడం, మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీనిధి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది.లెక్క ప్రకారం హిట్ 3 ఈమెకు మొదటి తెలుగు సినిమా కాదు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కోసం ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని.. శ్రీనిధిని చూసి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో అసలు కంటే ఈ సినిమా ముందొచ్చింది. హిట్ కొట్టేసింది.మరోవైపు హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ్'లోనూ శ్రీనిధినే సీతగా ఎంపిక చేశారు. కానీ రావణుడి పాత్ర కోసం యష్ వచ్చేసరికి.. ఈమెకి దక్కిన అవకాశం చేజారిపోయింది. సీత పాత్రలోకి సాయిపల్లవి వచ్చింది. ఏదేమైనా నిదానంగా సినిమాలు చేస్తున్న శ్రీనిధి శెట్టి.. చేసిన ప్రతి మూవీతోనూ హిట్ అందుకోవడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?) -
Hit 3: ఈ సినిమా వాళ్లకు నచ్చదు..
-
నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!
టాలీవుడ్‌ని పైరసీ బూతం కుదుపేస్తోంది. సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో లీక్ అవుతున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. తాజాగా, నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.(చదవండి: హిట్ 3 మూవీ రివ్యూ)మే 1న థియేటర్స్‌లో రిలీజైన హిట్ 3 చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. నాని ఊరమాస్ యాక్షన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా హిట్-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా హిట్ 3 రికార్డ్ క్రియేట్ చేసింది. (చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)సినిమాకు హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రం హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టడం టాలీవుడ్లో కలకలం రేపుతోంది. పైరసీ వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పైరసీ బూతం టాలీవుడ్ పెద్ద సినిమాలను వదలడం లేదు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనూ హెచ్డీ ప్రింట్ అన్లైన్లో అందుబాటులోకి రావడంతో నిర్మాత దిల్ రాజు షాక్‌కు గురయ్యారు.అదే విధంగా, తండేల్ సినిమా కూడా పైరసీ బారిన పడింది. దీని లీక్‌ను అడ్డుకునేందుకు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించినప్పటికీ, అది విరుద్ధ ఫలితాన్ని ఇచ్చిందని, లీక్ గురించి ఎక్కువ మందికి తెలిసిపోయిందని నిర్మాత బన్నీ వాస్ విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నిర్మాతలు ఈ పైరసీ సమస్యను ఎదుర్కోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. విదేశాల నుంచి సెన్సార్ ప్రింట్ల ద్వారా లీక్‌లు జరుగుతున్నాయని గుర్తించిన నిర్మాత నాగవంశీ, దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మాతలతో కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతోంది.పైరసీ కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాక, సినిమా నిర్మాణంలో పాల్గొన్న వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషిని దెబ్బతీస్తోంది. ఈ పైరసీ బూతానికి అడ్డుకట్ట వేయాలంటే.. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. -
హిట్-3 క్లైమాక్స్ లో కార్తి ఎంట్రీ దుమ్మురేపింది..
-
'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా హిట్-3 రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా హిట్-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. సులువుగా రూ. 150 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్లోనూ అర్జున్ సర్కార్ దుమ్మురేపుతున్నాడు. ఓవర్సీస్లో తొలిరోజే 1.2 మిలియన్ డాలర్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. ఆపై ‘బుక్‌మై షో’లోనూ ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేసింది. 24గంటల్లోనే 2.70 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. నాని కెరీర్లో ఇంతమొత్తంలో టికెట్స్ సేల్ కావడం ఇదే తొలిసారి.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.SARKAAR'S BOX OFFICE MAYHEM collects a whopping 43+ CRORES GROSS WORLDWIDE on DAY 1 💥💥Natural Star @NameisNani's HIGHEST DAY 1 GROSSER 🔥#HIT3 is the #1 INDIAN FILM WORLDWIDE YESTERDAY ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar… pic.twitter.com/IEuNsxZ5Sn— Wall Poster Cinema (@walpostercinema) May 2, 2025 -
హిట్ 3తో ప్రేక్షకులు మళ్లీ ఎనర్జీ ఇచ్చారు: నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో మా ఆశలన్నీ ‘హిట్ 3’ సినిమాపైనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ చూసి, జనాలు థియేటర్స్‌కు వస్తున్నారని హ్యాపీ ఫీలయ్యాను. ‘హిట్ 3’ సినిమా విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్లయింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’.ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా ‘దసరా’ ఉంది.ఈ సినిమాను ‘హిట్ 3’ క్రాస్ చేసింది. అలాగే తెలంగాణలో కూడా మేం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘చాలా రిలీజ్లు చూశాను. కానీ ఈ రిలీజ్ వైబ్, సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. ‘హిట్ 3’ సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్’’ అని నాని అన్నారు. ‘‘నానీగారి నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను’’ అని తెలిపారు శైలేష్ కొలను. కెమెరామేన్ షాన్ వర్గీస్ మాట్లాడారు. -
‘హిట్ 3’లోని వయెలెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు: నాని
‘‘హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్’ రెండూ కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. ‘హిట్: 3’లో యాక్షన్, వయొలెన్స్ కథ డిమాండ్‌ని బట్టి వచ్చాయి. ఇది రెగ్యులర్ సినిమాల్లా ఉండదు. సహజంగా కుదిరిన కొన్ని అంశాలు విజిల్స్ వేయించేలా ఉంటాయి’’ అని హీరో నాని చెప్పారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.‘హిట్ 3’ షూటింగ్ కోసం దేశమంతా తిరిగాం. అలాగే ప్రమోషన్స్ కోసం కూడా దేశం మొత్తం తిరిగాం... ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ‘హిట్ 3’ చూడాలని వారు ఫిక్స్ అయిపోయారు. సినిమా విడుదల కాక ముందే అలాంటి ఒక ΄పాజిటివ్ వైబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలోని వయొలెన్స్ డిస్ట్రబ్ చేసేలా ఉండదు. ‘సలార్’ సినిమాలోని యాక్షన్‌ని ఎంజాయ్ చేసినట్లు ‘హిట్ 3’ యాక్షన్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దనే ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. నా కొడుక్కి కూడా ఈ మూవీ చూపించను. ఈ సినిమా నేనే చేయడానికి కారణం ఏంటి? అనేది సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకే అర్థం అవుతుందని భావిస్తున్నాను.వయొలెంట్ సినిమాలు చేయడాన్ని నేను ట్రాన్స్‌ఫర్మేషన్‌గా చూడటం లేదు. ప్రతి సినిమానీ కొత్త జానర్లో చేయాలని ప్రయత్నం చేస్తాను. ‘జెర్సీ, హాయ్ నాన్న, దసరా’... ఇప్పుడు ‘హిట్ 3’... ఇవన్నీ వైవిధ్యమైన జానర్లలో చేసిన సినిమాలే. ‘హిట్ 3’ వైవిధ్యమైన జానర్ సినిమా. అన్ని వర్గాలు అని కాకుండా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించినా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను నా పనిని చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే నాకు రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం కష్టంగా అనిపించదు. శైలేష్ కొలను ‘హిట్’ లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు కానీ, తన మాటల్లోనే జోకులు పేలిపోతుంటాయి. తనకి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్పాను. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం లేదని తరచుగా వింటున్నాం. ఆ మాట తప్పు. వారిని థియేటర్లకు రప్పించే కంటెంట్‌తో సినిమాలు తీయడం మేకర్స్ బాధ్యత. ‘హిట్ 3’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మన సినిమా మాత్రమే హిట్ కావాలనుకోవడం తప్పు. అన్ని సినిమాలు బాగా ఆడితేనే మన సినిమా ఇంకా బాగా ఆడుతుంది. ఇండస్ట్రీలోని వారందరూ అన్ని సినిమాలూ హిట్టవ్వాలని కోరుకోవాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక చిరంజీవిగారి అభిమాని అయిన నేను ఆయనతో సినిమా నిర్మించనున్నానంటే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా (నవ్వుతూ).. ఇదొక ప్రౌడ్ మూమెంట్. శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ చిరంజీవిగారికి నచ్చడంతో ఆయన చేసేందుకు ఒప్పుకున్నారు. నా తర్వాతి సినిమా ‘ప్యారడైజ్’ కూడా సరికొత్త కథాంశంతో ఉంటుంది. -
హిట్ 3 మూవీ రివ్యూ
-
నాని 'హిట్ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..
హీరో నాని (Nani) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్: ద థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిట్ 3కి పాజిటివ్ టాక్మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హిట్ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్ చూస్తుంటే నాని బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ ఓటీటీలో అంటే?ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్ మొదటివారంలో హిట్ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.హిట్ 3 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హిట్ 3 తో బ్లాక్ బస్టర్ కొడతాడా ?
-
‘హిట్ 3’ మూవీ రివ్యూ
హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్ 3’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్’, హిట్ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్ ఫ్రాంచైజీలలో క్రైమ్ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. సైకో గ్యాంగ్ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటి ఉన్నాయి. యానిమల్, మార్కో, కిల్ సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. (చదవండి: హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ)కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో యాక్షన్ థ్రిల్లర్.. కాస్త లవ్ ఎంటర్టైనర్లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్ ఉందన్న విషయాన్ని అర్జున్ కనుక్కునే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్ సర్కార్ చేసే యుద్ధమే ఉంటుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు హిట్ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ప్రతీక్ బబ్బర్ విలనిజం అంతగా పండించలేకపోయినా..ఉన్నంతలో బాగానే నటించాడు. అర్జున్ సర్కార్ టీమ్ సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ
'హిట్ 3'లో అర్జున్ సర్కార్ పాత్రతో స్టార్ హీరో నాని నేడు థియేటర్స్‌లోకి వచ్చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్‌గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో హిట్ 3 (HIT 3)పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతి సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ హీరోను దర్శకుడు రివీల్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే హిట్ ఫోర్త్ కేస్‌ను హీరో కార్తీ పూర్తి చేస్తాడని క్లూ ఇచ్చేశారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో కార్తీ పేరు వైరల్ అవుతుంది.ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఛార్జ్ తీసుకున్నారని హిట్-3లో ప్రకటించారు. దీంతో హిట్-4లో కార్తీ ఫైనల్ అయినట్లు తెలిసిపోయింది. రానున్న సీక్వెల్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా గతంలో పలు సినిమాల్లో కార్తీ దుమ్మురేపాడు. ‘హిట్ 4’లో కార్తీ హీరో అని కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కార్తీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారని వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అదే నిజం అయిందని చెప్పవచ్చు.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.Karthi’s cameo as Rathnavel Pandian in #HIT3 was a total show-stealer! 👮♂️🔥 That powerful entry has us hyped for what’s next. Bring on #HIT4! 💥 #Nani #SrinidhiShetty #SaileshKolanu#HIT3TheThirdCase #HIT3 pic.twitter.com/GvThz38uBf— Movie Munch (@dailyaffairs12) May 1, 2025 -
HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్ క్రియేట్ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.కొన్ని సీన్స్ భాగా వర్కౌట్ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే.. వయెలెన్స్ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్ యాక్షన్‌ప్యాక్ థ్రిల్లర్. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా హిట్3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025 -
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
నాని(Nani) హీరోగా నటించిన హిట్ 3(HIT 3 ) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ హీరోగా నటించారు. ఇక మూడో భాగంలో అర్జున్ సర్కార్‌గా నాని అలరించబోతున్నాడు. అయితే మొదటి రెండు భాగాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. హిట్ 3 మాత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో రక్తపాతం అధికంగా ఉండబోతుందట. అందుకే సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కొన్ని మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించింది. ఈ లెక్కన సినిమా వయోలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హీరో నాని కూడా వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు పిల్లలు ఎవరూ ఈ సినిమా చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. ‘హిట్ 3లో వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. నా పిల్లలకు ఈ చిత్రం చూపించను. టీజర్, ట్రైలర్ కూడా చూపించలేదు. వాళ్లకు హిట్ 3 అనే ఒక సినిమా వస్తుందని తప్పా..అందులో నేను ఎలా నటించాననే విషయం తెలియదు. మీరు(ప్రేక్షకులు) కూడా మీ పిల్లలకు ఈ సినిమా చూపించకండి. 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమాకి రండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని నాని చెప్పారు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. -
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
హీరోహీరోయిన్లు సినిమా కోసం ఎంతైతే కష్టపడుతున్నారో ప్రమోషన్ల కోసం కూడా అంతే కష్టపడుతున్నారు. నాని (Nani), శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ 3: ది థర్డ్ కేస్. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నాని దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తున్నాడు. ఇటీవల ముంబైలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని తన భయాన్ని బయటపెట్టాడు.మారిపోతానేమోనని భయంనాని మాట్లాడుతూ.. పాపులారిటీ పెరిగితే నేనేమైనా మారిపోతానేమో, నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం ఉండేది. నా ఆలోచనల్లో, నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అన్న అనుమానం కలిగేది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న కొందరు నిజంగానే వారి స్థాయి పెరిగేకొద్దీ మారిపోయారు. అయితే ఏళ్లు గడిచేకొద్దీ.. ఫేమ్ వచ్చినంతమాత్రాన మనలో మార్పు రాదని తెలుసుకున్నాను. అసలు పాపులారిటీకి, మన వ్యక్తిత్వానికి సంబంధమే లేదని అర్థమైంది. రానురానూ అర్థమైందిమనం ఆ క్రేజ్‌ను ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొందరేమంటారంటే.. మొన్నటివరకు బాగుండేవాడు, ఇప్పుడు ఫేమస్ అవగానే మంచిగా ఉన్నట్లు నటిస్తున్నాడంతే.. అని కామెంట్లు చేస్తుంటారు. నిజానికి పాపులారిటీ మనల్ని మార్చదు. మనమే మారిపోతుంటాం. ఆ ఒక్క విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకే నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చాడు.సినిమాహిట్ 3 సినిమా విషయానికి వస్తే.. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ పోలీస్‌గా నటించగా ఇప్పుడు మూడో పార్ట్‌లో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి ఈ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.చదవండి: విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని చెప్పానా? -
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు అంటూ నానితో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెగ తిరిగేశారు. వరస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ చాలా కష్టపడ్డారు. ఫలితం ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) హిట్ 3 సినిమాలో హీరోగా చేసిన నానినే.. నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడికి చెందిన వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బడ్జెట్ గురించి రకరకాల నంబర్స్ వినిపించాయి. రూ.60 కోట్లు అని రూ.80 కోట్లు అని కూడా అన్నారు. దీని గురించే ఓ ఇంటర్వ్యూలో నానిని అడగ్గా.. ఈ మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టాననేది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.నిర్మాణ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ టీమ్ ఉందని, వాళ్లు అడిగిన దానికోసం ఖర్చు పెట్టడం తప్పితే బడ్జెట్ గురించి తనకు అస్సలు తెలియదని నాని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'హిట్' ఫ్రాంచైజీలో వచ్చిన గత రెండు చిత్రాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. ఈసారి విపరీతమైన యాక్షన్ జోడించారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తెలుగులో హిట్ 3 తప్పితే వేరే సినిమాలేం రిలీజ్ కావట్లేదు. మరోవైపు తమిళంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనేది చూడాలి?హిట్ 3 విడుదలకు సిద్ధం చేసిన నాని.. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇది అయిన తర్వాత సుజీత్ తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.(ఇదీ చదవండి: పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!) #Nani Said I’m the PRODUCER Of #HIT3 Film But I Don’t Know the BUDGET of the Film. pic.twitter.com/GfhSLToShQ— GetsCinema (@GetsCinema) April 30, 2025 -
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
‘దక్షిణాది అభిమానులు మాపై(బాలీవుడ్ హీరోలు) చూపిస్తున్న ప్రేమను థియేటర్ వరకు తీసుకెళ్లరు’ అని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాని(Nani) స్పందిస్తూ..బాలీవుడ్ చిత్రాలను దక్షిణాది ప్రేక్షకులు తరతరాలుగా ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ వారంతా నిజంగానే ఆదరించరనేదే నిజమైతే వాళ్లు(బాలీవుడ్ హీరోలు) సూపర్ స్టార్స్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. ‘దక్షిణాది చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. కానీ అంతకంటే ముందు హిందీ చిత్రాలను అందరూ ఆదరించారు. ఎన్నో దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ బాలీవుడ్ సినిమాలపై ఆదరాభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ హీరోలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అమితాబ్ నటించిన ఎన్నో చిత్రాలు సౌత్‌లో సూపర్ హిట్‌గా నిలిచాయి. సల్మాన్ ఖాన్‌కు ఇక్కడ(సౌత్) చాలా మంది అభిమానులు ఉన్నారు.‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘దీదీ తేరా దీవానా’ పాట ఇక్కడి పెళ్లిళ్లలో ఎన్నోసార్లు విన్నాం. ఆయన నటించిన చిత్రాలెన్నో ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి. అందరూ ఆదరించారు కాబట్టే వాళ్లు సూపర్ స్టార్స్ అయ్యారు. బహుశా సల్మాన్ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో. బాలీవుడ్ సినిమాలకు సౌత్‌లో మంచి ఆదరణ ఉంటుంది’ అని నాని చెప్పుకొచ్చారు. కాగా, సికిందర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్లో మంచి విజయం సాధిస్తున్నాయి. రజనీకాంత్, చిరంజీవి, సూర్య, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు అక్కడ(బాలీవుడ్) మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఎందుకంటే వారి సినిమాను మేమంతా థియేటర్స్‌కి వెళ్లి చూస్తాం. కానీ వారి అభిమానులు మాత్రం మా(హిందీ )సినిమాలు చూడడానికి అంతగా ఆసక్తి చూపించరు. నేను రోడ్లపై కనిపిస్తే..‘భాయ్..భాయ్’ అంటూ ప్రేమను చూపిస్తారు కానీ..అదే ప్రేమతో థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడరు’ అని అన్నారు. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’(HIT 3) మే 1న విడుదల కాబోతుంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూడో సినిమా ఇది. శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. -
‘హిట్ 3’ ప్రీ రిలీజ్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్ (ఫొటోలు)
-
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
నేచురల్ స్టార్ నాని (Nani) యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3: థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్ 1 హీరో అడివి శేష్, హిట్ 2 హీరో విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చారు.ప్రేమగా హగ్ ఇచ్చారంటే..ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్ పడింది.సొంత సినిమాలా ప్రమోషన్స్..ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్‌పోర్ట్ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్‌స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్ కూడా ఒక్కటీ మిస్ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.హిట్ 3 నచ్చకపోతే..కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే! మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్ మాస్టర్ సతీశ్.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ సీన్ కూడా ఉందన్న విషయాన్ని లీక్ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. చదవండి: కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి -
నాని ‘హిట్ 3: థర్డ్ కేస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Exclusive visuals of @NameisNani , @SrinidhiShetty7 reaching at Tirumala Tirupati Devasthanam on foot #HIT3 #NaturalStarNani pic.twitter.com/eqztW8zfit— Telugu Film Producers Council (@tfpcin) April 26, 2025 -
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్‌కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు. -
'హిట్ 3' కోసం అనిరుధ్.. వీడియో సాంగ్ రిలీజ్
నాని(Nani) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హిట్ 3(HIT 3 Movie). మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ముంబయి, కేరళ అంటూ నాని తెగ తిరిగేస్తున్నాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా నుంచి ఇప్పుడో పాట రిలీజ్ చేశారు. దీన్ని అనిరుధ్ పాడటం విశేషం.హిట్ 3 మూవీ నుంచి ఇదివరకే ప్రేమ వెల్లువ, అభీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు 'తను..' అంటే సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్ లో ఉన్న నాని.. హీరోయిన్ కోసం పాడే సాంగ్ ఇదని అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పాడాడు. స్వతహాగా సినిమాలకు కంపోజ్ చేసే అనిరుధ్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ పాడటానికి మాత్రం రూపాయి కూడా తీసుకోడు. గతంలో అతడే ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు కూడా నాని కోసమే అనిరుధ్ ఈ పాట పాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. నెక్స్ట్ రాబోయే 'ప్యారడైజ్' కూడా ఇతడే సంగీతమందించబోతున్నాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా హిట్ 3లో అనిరుధ్ పాట పాడినట్లున్నాడు.(ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్) -
నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్
-
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో మోస్ట్ వయోలెన్స్‌తో నాని కనిపించారు. సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందే ట్రైలర్ విడుదల చేసిన మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సూపర్ హిట్ అవుతుందని నాని ఫుల్ ధీమాగా ఉన్నారు.తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ట్రైలర్లోనే ఓ రేంజ్లో వయోలెన్స్ చూపించడంతో సెన్సార్ ఏ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మార్పులు చేయాలని సూచించింది. అలాగే అభ్యంతరకర పదాలు మ్యూట్ చేయాలని ఆదేశించింది. రక్తం కనిపించే సన్నివేశాల్లో రెడ్ కలర్‌ను డార్క్ చేయాలని సూచించింది. కాగా.. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు రెండుగంటల 37 నిమిషాలుగా ఉండనుంది. అలా మార్పులు చేయడంతోనే సెన్సార్ బోర్ట్ ఓకే టెప్పింది. కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నాని కి గట్టి పోటీ ఇవ్వనున్న రెట్రో & రైడ్ 2
-
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
హీరో నాని నుంచి కొత్త సినిమా రాబోతుంది. అదే 'హిట్ 3'. గతంలో వచ్చిన రెండు చిత్రాలకు కొనసాగింపుగా దీన్ని తీశారు. మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న నాని.. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మిగతా వాటి సంగతేమో గానీ దర్శకుడికి ఓసారి క్లాస్ పీకిన సందర్భం గురించి బయటపెట్టాడు.'శైలేష్ ఫస్ట్ షెడ్యూల్ లో మొహమాట పడేవాడు. అన్నింటికీ నన్ను మెంటార్ లా చూసి అన్నీ నన్ను అడిగేవాడు. నన్నేం అడగకు అని ఒక్కసారి గట్టిగా క్లాస్ పీకాను. నీకు మంచి సినిమా సెన్స్ ఉందని చెప్పా. అప్పటి నుంచి రెచ్చిపోయాడు' అని నాని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్)నాని ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. దీనికి తోడు ఈ మూవీతో హిట్ కొడతానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నాని నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది.హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే ఇప్పుడు రాబోతున్న హిట్ 3 మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు, సున్నిత మసస్కులు తన సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ ఇచ్చేశాడు కూడా.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్-3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హిట్-3 ట్రైలర్ విడుదల కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఇంతకుముందెన్నడు కనిపించని వయోలెన్స్ పాత్రలో నాని కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నాని. ఈ సందర్భంగా మూవీ రివ్యూల అంశంపై ఆయన స్పందించారు. విడుదల రోజే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాని కామెంట్స్‌పై ఈ అంశంపై హీరో నాని మాట్లాడుతూ....' రివ్యూలపై ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపాలి.. ఎవర్ని ఆపాలి... ఎలా ఆపాలి... ఇప్పుడు ఎవరినీ ఆపలేరు? నాకు నచ్చలేదు అనండి ఓకే. కానీ ఈ సినిమా ఆడదు అని చెప్పకండి. ఈ మూవీ డిజాస్టర్ అని ఒక్కరోజులో ఎలా చెప్తారు. సినిమా విడుదలైనా పది రోజులైనా ఎవరూ చూడకపోతే అప్పుడు పెట్టండి డిజాస్టర్ అని. ఫస్డ్ డే మార్నింగ్ షోకే ఎలా డిసైడ్ చేస్తారు. వ్యక్తిగతంగా సినిమాపై అభిప్రాయం ఎలా వ్యక్తం చేసినా ఓకే. కానీ మీడియా ప్రొఫెషనల్స్ అలా చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్‌లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. పుష్పరాజ్‌గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్‌లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్‌గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్‌తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్‌తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌మీట్‌కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా! -
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. నిన్న(ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ 24 గంటలు గడిచేసరికి మాత్రం రాజమౌళి మూవీస్ రికార్డ్స్ దాటిపోయింది. ఇది మాత్రం ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు.హిట్ సిరీస్ లో తొలి రెండు సినిమాల్ని థ్రిల్లర్స్ గా మలిచారు. కానీ మూడో భాగాన్ని మాత్రం నరుక్కోవడం, రక్తం ఏరులై పారడం అనేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు తమ సినిమాని చూడొద్దని నాని చెప్పడం కూడా సినిమాపై ఓ రకంగా బజ్ పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)అలా రిలీజైన 24 గంటల్లో హిట్ 3 ట్రైలర్ కి 23.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా బాహుబలి 2 (21.81 మిలియన్), ఆర్ఆర్ఆర్ (20.45 మిలియన్), కేజీఎఫ్ 2 (19.38 మిలియన్) రికార్డ్స్ దాటేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా తెలుగు వెర్షన్ వరకు మాత్రమే.మే 1న థియేటర్లలోకి రాబోతున్న హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. మరి బ్లడ్ బాత్ అనేలా ఉన్న ఈ మూవీ ఫలితం ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాగంటి ప్రవచనాలు ట్రైలర్లో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.మూవీ రిలీజ్ తేదీ ఇంకా రెండు వారాలు పైగా సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో.. ఇక టైర్- 1 జాబితాలో చేరినట్టేనా? అని ఒకరు ప్రశ్నించగా.. దానిపై నాని స్పందించారు.నాని మాట్లాడుతూ.. 'అది మన డిక్షనరీలో ఉన్నది కాదు. కేవలం మనం క్రియేట్ చేసుకున్న పదమే. నటుడికి తగినట్లుగానే సినిమాలు తెరకెక్కిస్తారు. వారిని ఆ పేర్లతో ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారోగానీ.. మనమంతా దానినే పెంచి పోషిస్తున్నాం. ఇకపై ఆ వేరియేషన్ ఆపితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం' అని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించింది. -
'అలా జరగకపోతే నన్ను నమ్మకండి'.. నాని ఆసక్తికర కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్-3. ఈ సిరీస్‌లో శైలేశ్ కొలను డైరెక్షన్లో వస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే నాని గతంలో ఎన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా హిట్-3 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూశాక నాని వయొలెన్స్ ఓ రేంజ్లో ఉండనుందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనికి హాజరైన హీరో నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కోర్ట్ మూవీ హిట్ కాకపోతే హిట్-3 చూడొద్దని చెప్పారు కదా? మరీ ఈ సినిమాకు ఏం చెబుతారని నానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు.(ఇది చదవండి: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్-3' ట్రైలర్.. మార్కోను మించిపోయిన 'నాని')నాని మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఆ డైలాగ్ వాడితే నెక్ట్స్ సినిమాకు నేను నిర్మాతను కాదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను.. వాళ్ల ఎవరినో ఎందుకు పెడతాను. హిట్-3 లాంటి జోనర్ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మే 1న ఫుల్ మీల్స్ పక్కా. కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇది కనక తప్పని మీకు అనిపిస్తే నెక్ట్స్ టైమ్ నానిని నమ్మకండి' అంటూ సరదా నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'Next time Nani ni nammakandi, anthe'A BOLD STATEMENT by Natural Star @NameisNani.Betting big on himself and #HIT3.#HIT3Trailer TRENDING #1 on YouTube 💥💥▶️ https://t.co/BU8cVg4IJD#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.#AbkiBaarArjunSarkaarNatural Star… pic.twitter.com/ZWZlwKDwhu— Wall Poster Cinema (@walpostercinema) April 14, 2025 -
'హిట్-3' ట్రైలర్ రిలీజ్
-
మోస్ట్ వైలెంట్‌గా 'హిట్-3' ట్రైలర్.. మార్కోను మించిపోయిన 'నాని'
హిట్3 సినిమాలో అర్జున్ సర్కార్‌గా పోలీస్ పాత్రలో దుమ్మురేపేందుకు నాని సిద్ధం అయ్యాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మలయాళంలో గతేడాది వచ్చిన 'మార్కో' సినిమాకు మించిన వయలెన్స్ హిట్-3లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గతంలో చెప్పిన వ్యాఖ్యలను హిట్3 నాని పాత్రకు కలుపుతూ ఎలివేషన్స్ ఇచ్చారు. ఇదీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు. హిట్ 3 సినిమా రన్‌టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండనుంది. ఈ కామెంట్‌తో వెండితెరపై రక్తపాతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇప్పటికే హిట్ 3(Hit 3 Movie) గురించి నాని ఇలా హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే సినిమాలో ఏ రేంజ్లో వయలెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా భారీ బడ్జెట్‌తో వాల్‌పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై నానినే ఈ చిత్రాన్ని నిర్మించారు. -
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
నాని(Nani) అంటే కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు నచ్చే హీరో. కానీ గత కొన్నాళ్ల నుంచి ట్రెండ్ కి తగ్గట్లు తను కూడా మారుతున్నాడు. యాక్షన్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి తాజాగా సెన్సార్ జరగ్గా.. పిల్లలు, సున్నిత మనస్కులకు నో ఎంట్రీ అనే టాక్ వినిపిస్తోంది.చాన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. హిట్ 3(Hit 3 Movie) గురించి హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) మరోవైపు గతకొన్నాళ్ల క్రితం రిలీజై టీజర్(Hit 3 Teaser) కూడా రక్తపాతం అనేలా ఉంది. దీంతో మూవీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే సినిమాలోనూ అలాంటి సీన్లు చాలానే ఉన్నాయని, సెన్సార్ వాటిని బ్లర్ చేయమని ఆదేశించిందని తెలుస్తోంది. బూతులు కూడా ఉన్నాయని అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది.నాని పోలీస్ గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మే 1న థియేట్రికల్ రిలీజ్. కానీ మూడు వారాల ముందే సెన్సార్ చేయించేశారు. సోమవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అలా ప్రమోషన్స్ షురూ చేస్తారనమాట.(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?) -
అబ్కీ బార్.. అర్జున్ సర్కార్ అంటోన్న నాని.. హిట్-3 సాంగ్ వచ్చేసింది!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్-3. శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ మూడో చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన హిట్, హిట్-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి అబ్కీ బార్.. అర్జున్ సర్కార్..అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు మిక్కీ జె మేయర్ సంగీతమందించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన మెలోడి సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.Lil something to start the heat. Fireworks on 14th. All hell breaks loose on May 1st. #AbKiBaarArjunSarkaar full song is here. https://t.co/6URUQmtchs #HIT3 pic.twitter.com/z104cXigpE— Nani (@NameisNani) April 9, 2025 -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి.