HIT3 X Review: ‘హిట్‌ 3’ ట్విటర్‌ రివ్యూ | HIT3: The Third Case Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

HIT3 Movie Twitter Review: నాని ‘హిట్‌ 3’ సినిమాకి ఊహించని టాక్‌.. అదే మైనస్‌ అట!

Published Thu, May 1 2025 6:10 AM | Last Updated on Thu, May 1 2025 8:01 AM

HIT3: The Third Case Twitter Review And Public Talk In Telugu

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్‌ క్రియేట్‌ అయింది. 

భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్‌ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.

ఎక్స్‌లో హిట్‌ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్‌  సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్‌లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్‌లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు.
 

 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌.కొన్ని సీన్స్‌ భాగా వర్కౌట్‌ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్‌ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.

 హిట్‌ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయితే.. వయెలెన్స్‌ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్‌ పాయింట్స్‌ అని మరో నెటిజన్‌ అభిప్రాయ పడ్డాడు

 ఇది నాని షో. గ్రిస్పింగ్‌ యాక్షన్‌ప్యాక్‌ థ్రిల్లర్‌. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఓవరాల్‌గా హిట్‌3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement