
ధనశ్రీ వర్మ పేరు దాదాపు అందరికీ సుపరిచితమైన పేరు. ఇటీవలే భారత క్రికెటర్ చాహల్‌తో విడాకులు తీసుకుంది. 2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. అయితే కెరియర్ పరంగా ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూసేద్దాం.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే ధనశ్రీ వర్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. ఈ సినిమాలో చాహల్ మాజీ భార్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ముంబయిలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్‌గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. నృత్యంపై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ధనశ్రీ డిసెంబర్ 22, 2020న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు.