Dhanashree Verma: సరిగ్గా అదే టైంకి ధన శ్రీ పాట రిలీజ్ | Dhanashree Verma New Song And Divorce Details | Sakshi
Sakshi News home page

Dhanashree Verma: సరిగ్గా అదే టైంకి ధన శ్రీ పాట రిలీజ్

Published Fri, Mar 21 2025 4:01 PM | Last Updated on Fri, Mar 21 2025 4:16 PM

Dhanashree Verma New Song And Divorce Details

యూట్యూబర్ ధనశ్రీ వర్మ ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణం విడాకులు. టీమిండియా క్రికెటర్ చాహల్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. గత కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. తాజాగా కోర్ట్ వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కానీ ఇదే టైంలో ధనశ్రీ.. గృహహింసపై చేసిన ఓ పాట రిలీజ్ కావడం చర్చనీయాంశమైంది.

2020 డిసెంబరులో చాహల్- ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. ఐపీఎల్ తన భర్త ఆడే ప్రతి మ్యాచ్ కి ధనశ్రీ వచ్చేది. మరి ఏమైందో ఏమో కొన్నాళ్ల క్రితం వీళ్లిద్దరూ ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అదే టైంలో ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్ల ఇస్తారనే రూమర్స్ వినిపించాయి. వీటిని ధనశ్రీ కుటుంబం ఖండింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి కొత్త సినిమా)

మరోవైపు చాహల్.. ఆర్జే మహ్ వశ్ అనే అమ్మాయితో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఇవన్నీ పక్కనబెడితే తాజాగా న్యాయస్థానం చాహల్-ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది. భరణంగా రూ.4.75 కోట్లు ఇస్తాడని తేలింది. ఇదంతా గురువారం జరగ్గా.. అదే టైంలో ధనశ్రీ నటించిన ఓ ఆల్బమ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

'దేఖా జీ దేఖా మైనే' అని సాగే ఈ పాటంతా గృహహింస నేపథ్యంగా తీశారు. ధనశ్రీ.. గృహహింస బాధితురాలు, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించింది. భర్తను ఎంతగానో ప్రేమించినప్పటికీ.. అతడు వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండటం.. అడిగినందుకు దాడి చేయడం, చివరకు విడాకులు తీసుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే చాహల్ పై ప్రతీకారంగా ధనశ్రీ ఈ పాట తీసిందా అనే సందేహం వచ్చింది.

(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్‌: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్‌..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement