Chahal
-
ఓరీతో చహల్, పృథ్వీ షా.. ఫొటోలు వైరల్
-
IND VS SA 3rd ODI: సంజూ సెంచరీ.. బట్లర్ ఏం చేశాడో చూడండి..!
ఇంగ్లండ్ పరిమత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తన ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సారధి సంజూ శాంసన్‌పై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న మూడో వన్డేలో సంజూ సెంచరీ (108) సాధించగా.. బట్లర్ తన కెప్టెన్ సాధించిన ఘనతను, అలాగే మరో రాయల్ (చహల్) కెప్టెన్‌ను అభినందిస్తున్న దృశ్యాన్ని తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేశాడు. బట్లర్ ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. Jos Buttler's Instagram story for Sanju Samson. pic.twitter.com/uSBAcKKCTZ — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 బట్లర్.. తన ఐపీఎల్ సహచరుడు సాధించిన ఘనతను సెలబ్రేట్ చేసుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజూతో సమానంగా బట్లర్‌ను కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాయల్స్‌కు తమ కెప్టెన్‌పై ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి ఫిదా అవుతున్నారు. The hundred moment of Sanju Samson. 🔥pic.twitter.com/WjWODyjF3p — Johns. (@CricCrazyJohns) December 21, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. సిరీస్ డిసైడర్‌లో క్లిష్టమైన పిచ్‌పై జట్టు కషాల్లో (49/2) ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్‌ను అందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా సంజూ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. Celebration by Sanju Samson after completing his maiden International hundred. 💪🫡 pic.twitter.com/fuHEwz0RPw — Johns. (@CricCrazyJohns) December 21, 2023 The way Yuzi Chahal celebrated the hundred of Sanju Samson. 👏 pic.twitter.com/XrC4hNxgXK — Johns. (@CricCrazyJohns) December 21, 2023 -
Asia Cup 2023: ఆశావహులతో భారత జట్టు.. కెప్టెన్‌గా ధవన్..!
ఆసియా కప్-2023 కోసం సెలెక్టర్లు నిన్న (ఆగస్ట్ 21) 17 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో చోటు కోసం ధవన్, చహల్, శాంసన్, యశస్వి లాంటి ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ.. వీరికి నిరాశే మిగిలింది. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. ట్రావెలింగ్ రిజర్వ్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. ఈ ఎంపిక నామమాత్రమే. ఇదిలా ఉంటే, ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఓ నమూనా భారత జట్టు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ జట్టు ఆసియా కప్‌ను ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్‌గా ఉంటే.. చహల్, శాంసన్ లాంటి ఆసియా కప్ ఆశావహులు మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ధవన్, రుతురాజ్ ఉండగా.. వన్‌డౌన్‌లో యశస్వి జైస్వాల్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఆతర్వాత రింకూ సింగ్, శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, పేసర్ల కోటాలో దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఈ జట్టును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధవన్ నేతృత్వంలోని ఈ జట్టు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్లను సునాయాసంగా ఓడిస్తుందని, ఈ జట్టు టీమిండియాకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టుతో పోలిస్తే ఈ జట్టు చాలా సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ సభ్య దేశాలైన చాలా జట్లకంటే ఈ జట్టు మెరుగ్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జట్టు సోషల్‌మీడియాలో నెటిజన్లకు మాంచి టాపిక్‌గా మారింది. ఆసియాకప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ట్రావెలింగ్ రిజర్వ్: సంజూ శాంసన్ ఆసియా కప్ ఆశావహుల భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ -
స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండర్లే.. ధవన్, శాంసన్‌లను ఎంపిక చేసి ఉండాల్సింది..!
ఆసియా కప్-2023 కోసం 17 మంది సభ్యుల భారత జట్టును సెలెక్టర్లు ఇవాళ (ఆగస్ట్ 21) ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికలో ఎలాంటి సంచనాలకు తావివ్వని సెలెక్టర్లు, ఒకరిద్దరికి మొండిచెయ్యి చూపించారన్నది కాదనలేని సత్యం. ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లే.. చహల్‌ను తీసుకోవాల్సింది..! స్పిన్నర్ల ఎంపికలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఎంపిక చేసిన స్పెషలిస్ట్ స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్లే (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) కావడం చర్చనీయంశంగా మారింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేయాల్సిందని మెజార్టీ శాతం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శిఖర్ ధవన్‌కు ఆఖరి ఛాన్స్ ఇవ్వాల్సింది.. ఆసియా కప్‌కు ప్రకటించిన భారత జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్‌కు అవకాశం ఇవ్వాల్సిందని సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ధవన్‌కు ఆసియా కప్‌లో (వన్డే) ఘనమైన ట్రాక్ రికార్డు (9 మ్యాచ్‌ల్లో 59.33 సగటున 91.43 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 534 పరుగులు) ఉండటం ఇందుకు ఓ కారణమైతే, వయసు పైబడిన రిత్యా అతనికి ప్రూవ్ చేసుకునేందుకు చివరి అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. ధవన్‌ను ఎంపిక చేసుంటే రోహిత్‌తో పాటు లైఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా వర్కవుట్ అయ్యుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ధవన్ భారత్ తరఫున 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2015 వన్డే వరల్డ్‌కప్, 2018 ఆసియా కప్‌లలో భారత లీడింగ్ రన్ స్కోరర్ అని గుర్తు చేస్తున్నారు. వన్డే ఫార్మాట్లో ధవన్ దిగ్గజమని, అతన్ని గౌరవించాల్సిన బాధ్యత సెలెక్టర్లపైన ఉండిందని అంటున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కేవలం ఇద్దరు మాత్రమే (ఇషాన్, తిలక్) ఉన్నారని, యువకులైన వారిద్దరిలో ఒకరి ప్రత్యామ్నాయంగా ధవన్ పేరును పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సంజూ వర్సెస్ సూర్యకుమార్.. ఆసియా కప్ భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. స్కైకి బదులు సంజూ శాంసన్‌ను 17 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక చేసి ఉండాల్సిందని అంటున్నారు. జట్టులో ఇద్దరు వికెట్‌కీపింగ్ బ్యాటర్లను పెట్టుకుని సంజూని ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేయడం కేవలం కంటి తుడుపు ఎంపిక మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. గడిచిన కొన్ని వన్డేల్లో సంజూ ప్రదర్శన స్కైతో పోలిస్తే చాలా రెట్లు మెరుగ్గా ఉందని, సంజూకు వికెట్‌కీపర్‌గానూ మంచి రికార్డు ఉంది కాబట్టి, అతన్ని స్కై స్థానంలో ఎంపిక చేసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. సంజూని ఎంపిక చేయడం వల్ల కేఎల్ రాహుల్‌పై భారం కాస్త తగ్గుతుందని, శాంసన్ ఎలాగూ స్కై లాగే విధ్వంసకర ఆటగాడు కాబట్టి, శాంసన్, రాహుల్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. యశస్విని తీసుకుని ఉండాల్సింది.. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య చాలా తక్కువగా (ఇషాన్, తిలక్) ఉందని, ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఎవరైనా రైట్ హ్యాండ్ బ్యాటర్ స్థానంలో సూపర్ ఫామ్‌లో యశస్వి జైస్వాల్‌ను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. -
LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్ (140 మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఒక్క వికెట్‌తో ముగ్గురిని అధిగమించిన మిశ్రా.. ఐపీఎల్లో టాప్-3 బౌలర్ స్థానానికి చేరుకునే క్రమంలో అమిత్ మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు. మరో వికెట్ కూడా.. ఈ మ్యాచ్‌లో మిశ్రా ఖాతాలో మరో వికెట్ కూడా పడింది. దీంతో అతని వికెట్ల సంఖ్య 172కు చేరింది. రెండో స్థానంలో ఉన్న చహల్‌కు మిశ్రాకు కేవలం 6 వికెట్ల తేడా మాత్రమే ఉంది. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ తర్వాత మిశ్రా.. కీలకమైన డుప్లెసిస్ వికెట్ తీశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 115/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (15), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. పంజాబ్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
నిర్ణయాత్మక మూడో టీ20.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. చహల్ ఔట్
3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్ డప్ఫీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్ జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. టీమిండియా: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, బ్లెయిర్ టిక్నర్ -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాలో మూడు మార్పులు..?
IND VS NZ 3rd T20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే జట్టుతో (చహల్ మినహాయించి) బరిలోకి దిగిన భారత్.. మూడో టీ20 కోసం మూడు మార్పులు చేయనుందని సమాచారం. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పాటు బౌలింగ్ విభాగంలో మరో కీలక మార్పు చేయాలన్నది జట్టు యాజమాన్యం యోచనగా తెలుస్తోంది. శుభ్‌మన్, ఇషాన్‌ల స్థానాల్లో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మ.. అలాగే చహల్ లేదా కుల్దీప్ స్థానాల్లో ముకేశ్ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తొలుత బ్యాటింగ్‌కు, ఆతర్వాత పేసర్లకు సహకరించే అస్కారం ఉండటంతో స్పిన్నర్ స్థానంలో అదనపు పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ముకేశ్ కుమార్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో మూడో టీ20లో తప్పక ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే గిల్, ఇషాన్‌లు వరుసగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మలకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మరోవైపు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో మేనేజ్మెంట్ పెద్దగా ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చన్న టాక్ కూడా నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ తుది జట్టులో ఎవరెవరు ఉంటారో తేలాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి (తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి) సిరీస్‌లో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో హిట్ అయిన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఫట్ అయ్యాడు. -
శ్రీలంకతో రెండో వన్డే.. టాస్ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్ మ్యాచ్ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత -
ఐసీయూలో ప్రముఖ బుల్లితెర నటి.. ఎనిమిది రోజులుగా నరకం..!
బాలీవుడ్ బుల్లితెర నటి, నాగిని-6 ఫేమ్ మహేక్ చాహల్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నట్లు సమాచారం. శ్వాస తీసుకోలేకపోయా: నటి ఆవేదన మహేక్ చాహల్ మాట్లాడుతూ.. 'నాకు న్యుమోనియా వచ్చింది. అది ఛాతీలో ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. దీంతో ఒక్కసారి కూడా శ్వాస తీసుకోలేకపోయా. జనవరి 2 నుంచి ఆసుపత్రిలో ఉన్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉంది. నేను దగ్గిన ప్రతిసారీ చాలా బాధగా ఉంది. చాలా భయానికి గురయ్యా.నేను ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది'. అని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న చాహల్ తల్లి రెండు రోజుల తర్వాత నార్వే నుంచి వచ్చింది. మహేక్ చాహల్ ఒక నార్వేకు చెందిన నటి, మోడల్. ఆమె హిందీ సినిమాలు, టెలివిజన్‌లో నటిస్తోంది. ఆమె 2002లో తెలుగు చిత్రం నీతో మూవీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత 2003లో నయీ పదోసన్తో హిందీలోకి ప్రవేశించింది. ఆమె హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ చిత్రాల్లో అనేక సాంగ్స్‌లో కనిపించింది. -
లంకతో సమరం.. పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 4) పాకిస్తాన్‌తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీమిండియా ఆటగాళ్లు చేజేతులా జారవిడిచి ప్రత్యర్ధికి చేతికి అప్పగించారు. తొలుత బ్యాటింగ్‌లో అత్యుత్సాహం (పంత్, హార్ధిక్ చెత్త షాట్ సెలెక్షన్), అనంతరం బౌలింగ్ (భువీ, హార్ధిక్, చహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం), ఫీల్డింగ్‌లో (కీలక సమయంలో అర్షదీప్ క్యాచ్ జారవిడచడం) అనవసర తప్పిదాలు టీమిండియా పుట్టి ముంచాయి. పాక్ చేతిలో ఈ ఊహించని పరాభవం నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సూపర్-4 దశలో తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్ చహల్లపై వేటు వేయడం ఉత్తమమని టీమిండియా యాజమాన్యాన్ని సూచిస్తున్నారు. రేపు (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పంత్, చహల్‌లను పక్కకు పెట్టి వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్‌లను ఆడించాలని కోరుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ కోటాలో ఎంపిక చేసిన పంత్.. రైట్ హ్యాండర్లా షాట్ ఆడేందుకు ప్రయత్నించి (రివర్స్ స్వీప్) వికెట్ పారేసుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చహల్ సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడని మండిపడుతున్నారు. వీరిద్దరిని తీసేసి డీకే, అక్షర్‌లకు అవకాశం ఇస్తే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! లేదంటే మనం ఇంటికే! -
ఐపీఎల్ 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా
IPL 2022 RR Vs KKR- ముంబై: ఐపీఎల్ పుట్టిన రోజున ఇంతకంటే ఆసక్తికర పోరును ఆశించలేమేమో! లీగ్ తొలి చాంపియన్, మెరుపు బ్యాటింగ్‌తో తొలి రోజును వెలిగించిన జట్ల మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగి అభిమానులను అలరించింది. బట్లర్ సూపర్ సెంచరీకి తోడు యజువేంద్ర చహల్ ‘హ్యాట్రిక్’ ప్రదర్శన రాజస్తాన్‌ను గెలిపించాయి. చేతిలో 6 వికెట్లతో 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దిశగా సాగిన కోల్‌కతా... 17వ ఓవర్లో చహల్‌కు నాలుగు వికెట్లు సమర్పించుకొని ఓటమికి బాటలు వేసుకుంది. చివరకు 7 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (61 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ సీజన్లో రెండో సెంచరీ సాధించగా, సంజు సామ్సన్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లో 210 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 85; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆరోన్ ఫించ్ (28 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ ‘హ్యాట్రిక్’సహా ఐదు వికెట్లు తీశాడు. 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో వరుసగా శ్రేయస్ అయ్యర్, శివమ్ మావి, కమిన్స్‌లను అవుట్ చేసి చహల్ హ్యాట్రిక్ సాధించాడు. బట్లర్ మరో సెంచరీ... రాజస్తాన్‌ను నియంత్రించడంలో ఒక్క నరైన్ మినహా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. ఎప్పటిలాగే బట్లర్ తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా... ఈసారి దేవదత్ పడిక్కల్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిని కనబర్చాడు. వరుణ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన బట్లర్, మావి ఓవర్లోనూ వరుసగా 4, 6 బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఆ తర్వాత 29 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 97 పరుగుల (59 బంతుల్లో) భాగస్వామ్యం తర్వాత పడిక్కల్‌ను అవుట్ చేయడంతో కోల్‌కతాకు తొలి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత బట్లర్ జోరు కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన సామ్సన్ కూడా వేగంగా దూసుకుపోయాడు. ఉమేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను రసెల్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన ఫుల్‌టాస్‌ను లాంగాన్ మీదుగా సిక్స్‌గా మలచి 59 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న బట్లర్... అదే ఓవర్లో అవుటయ్యాడు. అయితే చివర్లో హెట్‌మైర్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు రాయల్స్‌కు భారీ స్కోరును అందించాయి. రసెల్ వేసిన 20వ ఓవర్లోనే అతను 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. శతక భాగస్వామ్యం... తొలి బంతికే నరైన్ (0) రనౌట్‌తో కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత ఫించ్, శ్రేయస్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. శ్రేయస్ తొలి రెండు ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు కొట్టగా, ఐపీఎల్లో చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ కూడా బౌల్ట్ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. చహల్ ఓవర్లోనూ మూడు ఫోర్లు, ఆపై మెక్కాయ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఫించ్ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 107 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత ఫించ్ వెనుదిరగ్గా, 32 బంతుల్లో శ్రేయస్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ధాటిగా ఆడాల్సిన తరుణంలో మరో ఎండ్‌లో రాణా (18), రసెల్ (0) విఫలం కావడంతో గెలిపించాల్సిన బాధ్యత శ్రేయస్‌పై పడింది. అయితే ఉమేశ్ (9 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా చివరకు కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) వరుణ్ (బి) కమిన్స్ 103; పడిక్కల్ (బి) నరైన్ 24; సామ్సన్ (సి) మావి (బి) రసెల్ 38; హెట్‌మైర్ (నాటౌట్) 26; పరాగ్ (సి) మావి (బి) నరైన్ 5; నాయర్ (సి) కమిన్స్ (బి) మావి 3; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–97, 2–164, 3–183, 4–189, 5–198. బౌలింగ్: ఉమేశ్ 4–0–44–0, మావి 4–0–34–1, వరుణ్ 2–0–30–0, కమిన్స్ 4–0–50–1, నరైన్ 4–0–21–2, రసెల్ 2–0–29–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) నాయర్ (బి) ప్రసిధ్ 58; నరైన్ (రనౌట్) 0; శ్రేయస్ (ఎల్బీ) (బి) చహల్ 85; రాణా (సి) బట్లర్ (బి) చహల్ 18; రసెల్ (బి) అశ్విన్ 0; వెంకటేశ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 6; జాక్సన్ (సి) ప్రసిధ్ (బి) మెక్కాయ్ 8; మావి (సి) పరాగ్ (బి) చహల్ 0; కమిన్స్ (సి) సామ్సన్ (బి) చహల్ 0; ఉమేశ్ (బి) మెక్కాయ్ 21; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–148, 4–149, 5–178, 6–180, 7–180, 8–180, 9–209, 10–210. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–0, ప్రసిధ్ 4–0–43–1, మెక్కాయ్ 3.4–0–41–2, అశ్విన్ 4–0–38–1, చహల్ 4–0–40–5. 21:ఐపీఎల్లో నమోదైన మొత్తం హ్యాట్రిక్‌లు. ఇందులో 12 మంది భారత బౌలర్లు హ్యాట్రిక్ తీయగా... అమిత్ మిశ్రా మూడుసార్లు, యువరాజ్ సింగ్ రెండుసార్లు చొప్పున హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఐపీఎల్లో నేడు బెంగళూరు X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 -
IPL 2022: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్..!
Chahal Trolls Aakash Chopra: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కొట్టిన 5 సిక్సర్లలో ఒకటి 108 మీటర్ల దూరం ప్రయాణించి ప్రస్తుత సీజన్లో భారీ సిక్సర్‌గా రికార్డైంది. Three dot balls should be 1 wicket bhaiya 👀👀— Yuzvendra Chahal (@yuzi_chahal) April 3, 2022 ఈ సిక్సర్ నేపథ్యంలో ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్వీట్ చేస్తూ.. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులు ఇవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులిస్తే.. వరుసగా మూడు డాట్ బాల్స్ వేస్తే వికెట్ ఇవ్వాలంటూ రిప్లై ఇచ్చాడు. చహల్- ఆకాశ్ చోప్రా మధ్య జరిగిన ఈ సరదా సంభాషణపై మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా "హాహాహా" అంటూ స్పందించాడు. 𝗛. 𝗨. 𝗠. 𝗢. 𝗡. 𝗚. 𝗢. 𝗨. 𝗦! 🔥 🔥1⃣0⃣8⃣ metres: That massive @liaml4893 SIX had a lot of air time, surely! 💪 💪 #TATAIPL | #CSKvPBKS | @PunjabKingsIPL Watch 🎥 🔽— IndianPremierLeague (@IPL) April 3, 2022 ఇదిలా ఉంటే, సీఎస్కేతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(60, 2/25) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్ మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లివింగ్‌స్టోన్ బంతితోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ చాహర్ (3/25), వైభవ్ అరోరా (2/21), రబాడ (1/28), అర్షదీప్ సింగ్ (1/13), ఓడియన్ స్మిత్ (1/14) బంతితో తమ పాత్రను న్యాయం చేశారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. చదవండి: ఆహా ఏమా షాట్.. ! ఐపీఎల్ 2022లో భారీ సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్ -
IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..!
Rajasthan Royals: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, శుక్రవారం జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు శివాలెత్తారు. టీమ్ పింక్, టీమ్ బ్లూ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ పింక్.. పడిక్కల్ (51 బంతుల్లో 67), రియాన్ పరాగ్ (27 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. Our first practice game went something like... 👀💗#RoyalsFamily | #दिलसेरॉयल | #TATAIPL2022 pic.twitter.com/GQGwGKkAA5 — Rajasthan Royals (@rajasthanroyals) March 25, 2022 అనంతరం ఛేదనలో షిమ్రోన్ హెట్‌మైర్ (37 బంతుల్లో 70 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో టీమ్ బ్లూ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టులో కొత్తగా చేరిన పడిక్కల్, హెట్‌మైర్, చహల్ (2/30) రాణించడంతో ఆర్ఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మెగా వేలంలో ఆర్ఆర్ యాజమాన్యం హెట్మైర్ను రూ. 8 కోట్ల 50 లక్షలకు, దేవదత్ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు, చహల్‌ను రూ. 6.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ నేటి (మార్చి 26) నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో తాజా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. చదవండి: IPL 2022 Auction: ప్రసిధ్ కృష్ణకు జాక్‌పాట్.. రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లిన ఆటగాళ్లు -
IND VS SL: తగ్గేదేలేదంటున్న ఆ ముగ్గరు టీమిండియా క్రికెటర్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ "పుష్ప" కేవలం సినిమా ప్రపంచాన్నే కాకుండా యావత్ జగత్తును ఉర్రూతలూగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ విడుదలై నెలలు గడుస్తున్నా దీనికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప మత్తులోనే ఉన్నారు. టీమిండియా క్రికెటర్లనైతే పుష్ప ఫోబియా వదలనంటుంది. ముఖ్యంగా ఇందులోనే 'తగ్గేదేలే' డైలాగ్‌ను భారత క్రికెటర్లు ఇంకా జపిస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సహచర క్రికెటర్లైన నవ్‌దీప్ సైనీ, హర్‌ప్రీత్ బ్రార్‌తో కలిసి బస్సుల్లో ప్రయాణిస్తూ తగ్గేదేలా హిందీ డైలాగ్‌కు రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తగ్గేదేలే డైలాగ్‌కు క్రికెటర్ల హావభావాలు అభిమానలును తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చహల్ ఇన్‌స్టా పోస్ట్ చేయగా లైక్‌లు , కామెంట్ల వర్షం కురుస్తుంది. శ్రీలంకతో సిరీస్‌లోనూ ఏ మత్రం తగ్గొద్దంటూ అభిమానులు కామెంట్ల ద్వారా క్రికెటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, లంకతో టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లక్నో వేదికగా తొలి టీ20, ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరు వేదికగా రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది. చదవండి: Ind Vs SL: జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది: టీమిండియా ఆల్‌రౌండర్ -
క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..
Cricketer Yuvraj Singh Arrested: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వెంటనే అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్లో పాల్గొన్న యువరాజ్.. తోటి క్రికెటర్ చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం -
"ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..!
BCCI Did Not Consult Kohli About Appointing Dhoni As Mentor: ప్రపంచకప్ తర్వాత టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ విరాట్ కోహ్లి బాంబు పేల్చిన నేపథ్యంలో అతని నిర్ణయం వెనుక గల అసలు కారణాలపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఇదే విషయపై తాజాగా మరో వార్త నెట్టింట షికార్లు చేస్తుంది. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఆ రెండు నిర్ణయాలే కారణమన్నది ఆ వార్త సారాంశం. ఆ రెండు నిర్ణయాల్లో మొదటిది.. టీమిండియా మెంటార్‌గా ధోని నియామకం కాగా, రెండోది టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్ ఎంపిక. వివరాల్లోకి వెళితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో టీమిండియా ఓడిన నాటి నుంచి కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. దీంతో కోహ్లిని సంప్రదించకుండానే ధోనిని టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మెంటార్‌గా నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, టీ20 ప్రపంచకప్ జట్టులో చహల్ ఉండాలని కోహ్లి పట్టుబట్టినప్పటికీ.. రోహిత్ సలహా మేరకు సెలెక్షన్ కమిటీ అశ్విన్‌ను ఎంపిక చేసింది. తన ప్రమేయం లేకుండా బీసీసీఐ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను జీర్ణించుకోలేకపోయిన కోహ్లి.. పొట్టి క్రికెట్ పగ్గాలు వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కోహ్లిని టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు అశ్విన్ ప్రధాన కారణం అని మరో వాదన వినిపిస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి.. అశ్విన్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని.. ఇది బీసీసీఐకి అస్సలు నచ్చలేదని.. దీంతో కోహ్లి విషయంలో పొమ్మనలేక పొగ పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అశ్విన్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. కోహ్లి అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఈ విషయమై కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మధ్య కూడా వాదన జరిగినట్లు సమాచారం. చదవండి: ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి -
చాహల్‌ను అందుకే తీసుకోలేదు.. ఇక వరుణ్ విషయానికి వస్తే..
ముంబై: వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ స్పిన్ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌కు జట్టులో స్థానం దక్కకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించారు. జట్టు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్విక్‌గా బౌలింగ్ చేసే స్పిన్నర్లు మా ప్రాధాన్యత, అందుకే మేము చాహల్ స్థానంలో రాహుల్ చాహర్‌ను జట్టులో తీసుకున్నామని ఆయన తెలిపారు. ఐపీఎల్ ప్రదర్శన ‘మిస్టరీ ఆఫ్ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తికి చాన్స్ ఇప్పించిందని ఆయన అన్నారు. కాగా నాలుగేళ్ల తర్వాత అశ్విన్ మళ్లీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మెంటార్‌గా ఉండబోతున్నాడు. ఇక 2019 నుంచి చూస్తే చహల్ బౌలింగ్‌లో పదును తగ్గింది. శ్రీలంక పర్యటనలోనూ చహల్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతున్న రాహుల్ చహర్ వరల్డ్‌కప్ అవకాశం దక్కించుకున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనుండగా.. అక్టోబరు 24న తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో భారత్ జట్టు ఢీకొట్టనుంది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ ఎంపికైనారు. చదవండి: T20 World Cup Team India Squad 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని -
అలా చేస్తానని సవాల్ చేశాడు.. అన్నంత పనీ చేశాడు
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నయా సెన్సేషన్ ఇషాన్ కిషన్ అర్ధశతకంతో(42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ఝార్ఖండ్ కుర్రాడు.. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదుతానని మ్యాచ్‌కు ముందు సహచరులకు సవాల్ విసిరానని, బంతి ఎక్కడ పడినా.. ఖచ్చితంగా మైదానం దాటిస్తానని చెప్పిమరీ బరిలోకి దిగానని చహల్‌తో చేసిన చిట్‌చాట్ సందర్భంగా ఇషాన్ స్వయంగా వెల్లడించాడు. Chahal TV returns - Ishan Kishan reveals the secret behind his first ball SIX and more 👌 👌 Some fun & cricket talks as @yuzi_chahal chats up with ODI debutant @ishankishan51 😎😎 - by @ameyatilak & @28anand Full video 🎥 👇 #TeamIndia #SLvIND https://t.co/BWQJMur8zx pic.twitter.com/HtFGNyoHeI — BCCI (@BCCI) July 19, 2021 చెప్పినట్టుగానే తాను ఎదుర్కొన్న తొలి బంతిని మైదానం బయటకు పంపిన ఇషాన్.. రెండో బంతిని సైతం బౌండరీకి తరలించాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను.. చివరకు సందకన్ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, అరంగేట్రం వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ .. టీ20 అరంగేట్రంలోనూ అర్ధశతకాన్ని బాదాడు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ పొట్టి ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలపాత్ర పోషించాడు. అలాగే ఆడిన తొలి టీ20లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మరోవైపు నిన్నటి మ్యాచ్‌లో సైతం అద్భుతమై అర్ధసెంచరీతో రాణించిన ఇషాన్.. భారత విజయంలో తన వంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముకుమ్మడిగా రాణించడంతో ఆతిధ్య శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. -
రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే
ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే తాను ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చానని టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. రోహిత్ శర్మతో బంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2013 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన నేను.. రోహిత్ భాయ్ చొరవ వల్లే ఐపీఎల్ అరంగేట్రం చేసానని వ్యాఖ్యానించాడు. రోహిత్ భాయ్ నా రూమ్‌లోకి వచ్చి 'నువ్వు తర్వాతి మ్యాచ్‌లు ఆడబోతున్నావ్' అని చెప్పిన మాటలు తానెప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఇందుకు గాను తాను రోహిత్ భాయ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. కాగా, అదే సీజన్లో తొలిసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హిట్‌మ్యాన్.. సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా జట్టులో ఉన్నా.. చహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి చహల్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాతి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుని టీమిండియాలో స్థానం సంపాదించాడు. చహల్ .. ప్రస్తుతం టీమిండియా రెగ్యులర్ సబ్యుడిగానే కాకుండా తన ఐపీఎల్ జట్టైన ఆర్సీబీకి కీలక బౌలర్‌గా ఉన్నాడు. కాగా, చహల్‌కు రోహిత్‌తో ఎంత అనుబంధముందో తన కెప్టెన్ విరాట్‌తో కూడా అంతే అనుబంధం ఉంది. చదవండి: వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది.. -
బాగా బౌలింగ్ చేసినప్పుడు వికెట్ దక్కకపోతే ఆ బాధే వేరు..
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో(ముంబై, హైదరాబాద్) వికెట్లు దక్కకపోవడంపై ఆర్సీబీ స్పిన్నర్ చహల్ భావోధ్వేగానికి లోనయ్యాడు. బాగా బౌలింగ్ చేసినప్పుడు ఫలితం దక్కకపోతే ఆ బాధ వేరుగా ఉంటుందని వాపోయాడు. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్ తొలి వికెట్ దక్కించుకున్న చహల్.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకుని 2 కీలకమైన వికెట్లు సాధించి, ఆర్సీబీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరుమీదున్నప్పటికీ.. చహల్‌కు మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం విశేషం. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడిన ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందినప్పటికీ.. ఆ మ్యాచ్‌లో చహల్‌కు ఫలితం దక్కకపోగా(4 ఓవర్లలో 0/41) 10కిపైగా ఎకానమీతో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో సైతం చహల్‌కు వికెట్లు దక్కలేదు. అయితే ఈ మ్యాచ్‌లో(4 ఓవర్లలో 0/29) అతను 7.2 ఎకానమీతో కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌ను అందుకున్న చహల్.. కీలమైన నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్‌ల వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో(ఇన్నింగ్స్ 3వ ఓవర్) బౌలింగ్ చేసిన అతను.. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్‌వెల్(78), డివిలియర్స్(76 నాటౌట్) మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ను సాధించగా, అనంతరం జేమీసన్(3/41), చహల్(2/34), హర్షల్ పటేల్(2/17), సుందర్(1/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ 38 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ ఏప్రిల్ 22న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబై వేదిక కానుంది. చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు గ్రీన్‌సిగ్నల్ -
నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్, జడ్డూలను తీసుకుంటా..
లండన్: ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినైతే టీ20 ప్రపంచకప్ జట్టులోకి చహల్, కుల్దీప్ యాదవ్‌లను అస్సలు తీసుకోనని, వారి స్థానాల్లో సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లకు అవకాశం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై చహల్-కుల్దీప్ల కంటే అనుభవజ్ఞులైన జడేజా-అశ్విన్‌లవైపు మొగ్గుచూపడమే భారత్‌కు మంచిదని, ఈ ఇద్దరు స్పిన్నర్లు ఆల్‌రౌండర్లనే విషయం మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుత భారత్ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్నర్ల విభాగమే కాస్త కలవరపెడుతోందని ఆయన తెలిపాడు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్, చహల్ కొనసాగుతున్నారని, ఈ ఫార్మట్‌లో వీరి ప్రదర్శన అంత మెరుగ్గా లేకపోవడం వల్లనే తాను ఈ తరహా వ్యాఖ్యలు చేశానని పనేసర్ వెల్లడించాడు. గత 10 మ్యాచ్‌ల్లో చహల్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగా, కుల్దీప్ ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయాడన్నాడు. ఈ నేపథ్యంలోనే అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్కు ఆయన సూచించాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ చహల్, కుల్దీప్కు అగ్ని పరీక్షలాంటిదని, ఇందులో విఫలమైతే వారి టీ20 ప్రపంచకప్ బెర్త్‌లపై సందిగ్ధత నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేకపోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
మ్యాక్సీ రివర్స్ స్వీప్ అదుర్స్..
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మంగళవారం తన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 సీజన్ నేపథ్యంలో సాధన మొదలుపెట్టాడు. తొలి ప్రాక్టీస్ సెషన్లో సూపర్ టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మాక్సీ.. రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించేశాడు. Glenn Maxwell’s Day Out @Gmaxi_32 came. Maxwell reverse swept. And Maxwell had fun. Watch The Big Show and Kyle Jamieson at their first practice session for #RCB ahead of #IPL2021.#PlayBold #WeAreChallengers pic.twitter.com/naMXQcAROQ — Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2021 కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నట్టు కనిపించిన అతను.. అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ చహల్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ భారీ సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. అలాగే ఆసీస్ ఆల్‌రౌండర్, సహచర క్రికెటర్ డేనియల్ క్రిస్టియన్ వేసిన బంతిని కూడా మ్యాక్సీ..అద్భుతమైన రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విటర్లో పోస్ట్ చేయగా నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, మిడిలార్డర్ బలోపేతం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మాక్సీని బెంగళూరు రూ.14.25కోట్లకు కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తరఫున గత సీజన్లో ఘోరంగా విఫలమైనా మ్యాక్సీ.. బెంగళూరు తలరాతను మార్చగలడేమో చూడాలి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. చదవండి: వారి నుంచి వచ్చిన సందేశాలు ఎన్నటికీ మరువలేనివి.. -
రెండో టీ20: భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు!
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు(ఆదివారం) ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని లెగ్ స్పిన్నర్ చాహల్, పేసర్ శార్థూల్ ఠాగూర్ల స్థానాల్లో లెగ్ బ్రేక్ బౌలర్ రాహుల్ చాహర్, మీడియం పేస్ బౌలర్ దీపక్ చాహర్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి: హార్దిక్ షాట్‌కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి? కాగా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను రొటేషన్ పేరుతో తప్పించి.. టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్‌లో చేస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ రీ ఎంట్రీ, రాహుల్, దీపక్ చాహర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం చూసినా రోహిత్, రాహుల్‌ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్‌ను కనబర్చిన రాహుల్ చాహర్‌ను, తొలి మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్ స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక్కడ చదవండి: ఆ రూల్ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ -
బుమ్రా రికార్డ్‌ను బద్దలు కొట్టిన చాహల్
అహ్మదాబాద్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భారత్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో చాహల్ ఈ ఘనతను సాధించాడు. పొట్టి ఫార్మాట్లో పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా(50 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును చాహల్ ఈ మ్యాచ్‌లో అధిగమించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జోస్ బట్లర్‌ను ఔట్ చేసిన చాహల్.. పొట్టి ఫార్మాట్లో 60వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాహల్ ఈ ఘనతను కేవలం 46వ మ్యాచ్‌లోనే సాధించాడు. ఓవరాల్‌గా చాహల్‌కు ఇది భారత్ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.