Chahal Trolls Aakash Chopra: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కొట్టిన 5 సిక్సర్లలో ఒకటి 108 మీటర్ల దూరం ప్రయాణించి ప్రస్తుత సీజన్‌లో భారీ సిక్సర్‌గా రికార్డైంది.
Three dot balls should be 1 wicket bhaiya 👀👀
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 3, 2022
ఈ సిక్సర్ నేపథ్యంలో ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్వీట్ చేస్తూ.. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులు ఇవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులిస్తే.. వరుసగా మూడు డాట్ బాల్స్ వేస్తే వికెట్ ఇవ్వాలంటూ రిప్లై ఇచ్చాడు. చహల్- ఆకాశ్ చోప్రా మధ్య జరిగిన ఈ సరదా సంభాషణపై మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా "హాహాహా" అంటూ స్పందించాడు.
𝗛. 𝗨. 𝗠. 𝗢. 𝗡. 𝗚. 𝗢. 𝗨. 𝗦! 🔥 🔥
— IndianPremierLeague (@IPL) April 3, 2022
1⃣0⃣8⃣ metres: That massive @liaml4893 SIX had a lot of air time, surely! 💪 💪 #TATAIPL | #CSKvPBKS | @PunjabKingsIPL
Watch 🎥 🔽
ఇదిలా ఉంటే, సీఎస్‌కేతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(60, 2/25) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్ మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లివింగ్‌స్టోన్ బంతితోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ చాహర్ (3/25), వైభవ్ అరోరా (2/21), రబాడ (1/28), అర్షదీప్ సింగ్ (1/13), ఓడియన్ స్మిత్ (1/14) బంతితో తమ పాత్రను న్యాయం చేశారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు.
చదవండి: ఆహా ఏమా షాట్.. ! ఐపీఎల్ 2022లో భారీ సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్
Comments
Please login to add a commentAdd a comment