మ్యాక్సీ రివర్స్‌ స్వీప్‌ అదుర్స్‌.. | IPL 2021: Maxwell Takes Chahal With Reverse Sweeps And Switch Shots In RCB Nets | Sakshi
Sakshi News home page

మ్యాక్సీ రివర్స్‌ స్వీప్‌ అదుర్స్‌..

Published Tue, Apr 6 2021 10:01 PM | Last Updated on Tue, Apr 6 2021 10:01 PM

IPL 2021: Maxwell Takes Chahal With Reverse Sweeps And Switch Shots In RCB Nets - Sakshi

యల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మంగళవారం తన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో సూపర్‌ టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మాక్సీ.. రివర్స్‌ స్వీప్‌ షాట్లతో అలరించాడు. పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించేశాడు.

చెన్నై: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మంగళవారం తన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇటీవలే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌ నేపథ్యంలో సాధన మొదలుపెట్టాడు. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో సూపర్‌ టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మాక్సీ.. రివర్స్‌ స్వీప్‌ షాట్లతో అలరించాడు. పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించేశాడు.

కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నట్టు కనిపించిన అతను.. అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్‌ చహల్‌ వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడుతూ భారీ సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. అలాగే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌, సహచర క్రికెటర్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన బంతిని కూడా మ్యాక్సీ..అద్భుతమైన రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడాడు. అతని బ్యాటింగ్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ ట్విటర్లో పోస్ట్‌ చేయగా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

కాగా, మిడిలార్డర్‌ బలోపేతం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మాక్సీని బెంగళూరు రూ.14.25కోట్లకు కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున గత సీజన్‌లో ఘోరంగా విఫలమైనా మ్యాక్సీ.. బెంగళూరు తలరాతను మార్చగలడేమో చూడాలి. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 9న ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొం‍టుంది.
చదవండి: వారి నుంచి వచ్చిన సందేశాలు ఎన్నటికీ మరువలేనివి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement