మాక్స్‌వెల్‌తో కోహ్లి (PC: BCCI)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. తాను కోహ్లిని వెక్కిరించిన కారణంగా అతడు తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని.. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో చేరిన తర్వాత తమ మధ్య స్నేహం కుదిరిందని తెలిపాడు. కాగా మైదానంలో టీమిండియా- ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య సంవాదాలు, దూషణలు, వ్యంగ్య వ్యాఖ్యలు కొత్త కాదు.
ఇక 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు కూడా కోహ్లి, మ్యాక్స్‌వెల్ మధ్య అలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే, ఆర్సీబీలో చేరిన తర్వాత ఒక రోజు కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మ్యాక్సీ ఫాలో అయ్యేందుకు ప్రయత్నించగా...అది సాధ్యం కాలేదు.
నువ్వు నన్ను బ్లాక్ చేశావా?
దాంతో సందేహం వచ్చిన మ్యాక్స్‌వెల్ ‘నువ్వు నన్ను బ్లాక్ చేశావా’ అని కోహ్లిని అడిగాడు. వెంటనే కోహ్లి...‘అవును...నాలుగేళ్ల క్రితం నువ్వు నన్ను వెక్కిరించిన తర్వాత ఆ పని చేశాను’ అని బదులిచ్చాడు.
కాగా 2017 సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లి గాయపడ్డాడు. నొప్పిని భరించలేక కోహ్లి తన భుజంపై చేతిని ఉంచి ఇబ్బందిగా నడిచాడు. అదే టెస్టులో దీనిని మ్యాక్స్‌వెల్ అనుకరించి చూపించాడు. అదే ఇది కోహ్లికి ఆగ్రహం తెప్పించింది!
అయితే, 2021లో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుతో చేరిన తర్వాత కోహ్లితో స్నేహం బలపడింది. మైదానంలోనూ, మైదానం బయట కూడా వీరిద్దరు ఎంతో సరదాగా ఉండేవారు.
మాక్సీ ఆర్సీబీలో చేరడంలో కోహ్లిదే కీలక పాత్ర
నిజానికి ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవాలని కోహ్లి ఫ్రాంఛైజీకి సూచించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కోసం రూ. 14.25 కోట్లు ఆర్సీబీ ఖర్చు పెట్టింది.
అతడి రాకతో బ్యాటింగ్ యూనిట్ విధ్వంసకరంగా మారింది. 2021, 2022, 2023 సీజన్లలో మాక్సీ వరుసగా 513, 310. 400 పరుగులు చేశాడు. అయితే, ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2025 RCB Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?
Comments
Please login to add a commentAdd a comment