అవుటైన తర్వాత పెవిలియన్ బాట పట్టిన డీకాక్
డర్బన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(16), డీ కాక్(34) వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 15 ఓవర్‌లో డీకాక్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత స్పిన్నర యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో డీ కాక్ ఎల్బీగా అవుటయ్యాడు. అంతకుముందు హషీమ్ ఆమ్లా సైతం ఎల్బీగానే పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ వికెట్లు ముందు దొరికిపోవడం గమనార్హం. బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఆమ్లా ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఆపై మరో ఏడు ఓవర్ల వ్యవధిలో డీ కాక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. దాంతో సఫారీలు 83 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయారు. ఇక మర్‌క్రామ్(9) మూడో వికెట్‌గా అవుటయ్యాడు. జట్టు స్కోరు 103 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో హార్దక్ పాండ్యా క్యాచ్ ఇచ్చిన మర్‌క్రామ్ పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. తొలి మూడు వన్డేలకు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతని స్థానంలో తొలి వన్డేలో మర్‌క్రామ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment