de Kock
-
CSK Vs LSG Photos: ధోని మెరుపులు వృథా.. లక్నో ‘సూపర్’ విజయం (ఫొటోలు)
-
కోహ్లి, రోహిత్‌ల ర్యాంకులు పదిలం.. దూసుకొచ్చిన డికాక్, డస్సెన్
Kohli Retains 2nd Spot In ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి(2వ ర్యాంక్), రోహిత్ శర్మ(3)లు తమ ర్యాంకులను పదిలంగా కాపాడుకున్నారు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో కోహ్లి రెండు హాఫ్ సెంచరీలు బాది రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకోగా, రోహిత్.. ఈ సిరీస్ ఆడనప్పటికీ తన ర్యాంక్‌కు కాపాడుకోగలిగాడు. 🔹 Quinton de Kock continues his rise 🔼 🔹 Massive gains for Rassie van der Dussen 🔥 🔹 England players move up in the T20I charts 📈 Here’s how things stand after the latest update to the @MRFWorldwide ICC Men’s Player Rankings 📝 Details 👉 https://t.co/Jxktm5FBsr pic.twitter.com/HBGUPKNHsT — ICC (@ICC) January 26, 2022 మరోవైపు ఇదే సిరీస్‌లో సెంచరీలతో రాణించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డికాక్(5), వాన్‌డర్ డస్సెన్(10)లు టాప్-10లోకి దూసుకురాగా.. పాక్ సారధి బాబర్ ఆజమ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో రాణించిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(3 వన్డేల్లో 153 పరుగులు).. ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 59వ స్పాట్‌కు చేరుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రొటీస్ బౌలర్ ఎంగిడి నాలుగు ప్లేస్‌లు మెరుగుపర్చుకుని 20 స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Rohit Sharma: హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్.. స్లిమ్‌గా, ఫిట్‌గా..! -
గర్జించిన సఫారీ ఓపెనర్లు.. పసికూనపై భారీ స్కోర్ నమోదు
డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సఫారీ బ్యాట్స్‌మెన్ గర్జించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పసికూన చేతిలో ఎదురైన పరాభవంతో సఫారీలు అలర్ట్ అయ్యారు. పరువు పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), జన్నెమన్ మలాన్ (177 బంతుల్లో 169 నాటౌట్; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మలాన్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ వాన్ డర్ డుసెన్(28 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 2, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్ తలో వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలందేసరికి ఐర్లాండ్ 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 12 పరుగులు సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, రెండో వన్డేలో ఆతిధ్య ఐర్లాండ్ సఫారీలపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్లో ఐర్లాండ్‌కు సఫారీలపై ఇదే తొలి విజయం కావడం విశేషం. -
MI vs RR: ముంబై అలవోకగా..
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ రెండు వరుస పరాజయాల తర్వాత కోలుకుంది...ప్రత్యర్థి రాజస్తాన్ రాయల్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. సరిగ్గా చెప్పాలంటే అదృష్టం కలిసొచ్చి దక్కిన తమ గత రెండు విజయాలతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో మాత్రం తమ స్థాయికి తగిన ఆటతీరును రోహిత్ సేన ప్రదర్శించింది. ముంబై పదునైన బౌలింగ్‌పై ఎదురు దాడి చేయలేక రాజస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా దూకుడు ప్రదర్శించలేకపోయాడు. అనంతరం ముంబై ఆడుతూ పాడుతూ సునాయాసంగా లక్ష్యాన్ని చేరింది. క్వింటన్ డి కాక్ కీలక అర్ధ సెంచరీతో ముందు నిలిచి జట్టును గెలిపించాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో మరో ఏకపక్ష మ్యాచ్...ఎలాంటి పోరాటం లేకుండా, ఎటువంటి మెరుపు ఇన్నింగ్స్‌లు కనిపించకుండా మ్యాచ్ ముగిసింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (27 బంతుల్లో 42; 5 ఫోర్లు), జోస్ బట్లర్ (32 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శివమ్ దూబే (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సి క్సర్లు) చెప్పుకోదగ్గ పరుగులు సాధించారు. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డి కాక్ (50 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స ర్లు) అర్ధ సెంచరీ చేయగా, కృనాల్ పాండ్యా (26 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాణించిన టాప్–4... ఓపెనర్లు బట్లర్, యశస్వి కొన్ని చక్కటి షాట్లతో రాజస్తాన్‌కు సరైన ఆరంభాన్ని అందించారు. జయంత్ ఓవర్లో బట్లర్ వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టగా...కూల్టర్ నైల్ వేసిన తర్వాతి ఓవర్లో యశస్వి 4, 6 బాదాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 47 పరుగులకు చేరింది. ఇదే జోరులో రాహుల్ చహర్ వేసిన బంతిని భారీ సిక్స్‌గా మలచిన బట్లర్ తర్వాతి బంతిని ముందుకు దూసుకొచ్చి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కృనాల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించిన సామ్సన్ దానిని కొనసాగించాడు. చహర్ తర్వాతి ఓవర్లో యశస్వి కూడా ఒక సిక్స్ కొట్టి అదే ఓవర్లో బౌలర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్...బౌల్ట్ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డయ్యాడు. మరో ఎండ్‌లో దూబే కూడా ధాటిగా ఆడటంతో రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేయగలిగిన రాయల్స్ ఈ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చేతిలో వికెట్లు ఉండి కూడా మరో 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ కీలక ఇన్నింగ్స్... ఛేదనలో ముంబైకి పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. యువ బౌలర్ చేతన్ సకరియా (0/18) మినహా ఇతర బౌలర్లెవరూ ముంబై కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన డి కాక్ ఈ సారి తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ముస్తఫిజుర్ ఓవర్లో వరుస బంతుల్లో అతను 4, 6 కొట్టాడు. మరో వైపు రోహిత్ శర్మ (14) ఎక్కువ సేపు నిలబడలేకయాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ (16)ను కూడా మోరిస్ తక్కువ వ్యవధిలో అవుట్ చేశాడు. ఉనాద్కట్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డి కాక్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డి కాక్‌తో జత కలిసిన కృనాల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడి ముంబై పనిని సులువు చేశాడు. తెవాటియా, ముస్తఫిజుర్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అతను...ముస్తఫిజుర్ ఓవర్లోనే క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 46 బంతుల్లో 63 పరుగులు జోడించింది. 20 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన ఈ దశలో కీరన్ పొలార్డ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చకచకా పరుగులు సాధించి మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (స్టంప్డ్) డి కాక్ (బి) చహర్ 41, యశస్వి (సి) అండ్ (బి) చహర్ 32, సామ్సన్ (బి) బౌల్ట్ 42, దూబే (సి) అండ్ (బి) బుమ్రా 35, మిల్లర్ (నాటౌట్) 7, పరాగ్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–66, 2–99, 3–148, 4–158. బౌలింగ్: బౌల్ట్ 4–0–37–1, బుమ్రా 4–0–15–1, జయంత్ 3–0–37–0, కూల్టర్ నైల్ 4–0–35–0, రాహుల్ చహర్ 4–0–33–2, కృనాల్ 1–0–12–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సకరియా (బి) మోరిస్ 14, డి కాక్ (నాటౌట్) 70, సూర్యకుమార్ (సి) బట్లర్ (బి) మోరిస్ 16, కృనాల్ (బి) ముస్తఫిజుర్ 39, పొలార్డ్ (నాటౌట్) 16, ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–49, 2–83, 3–146. బౌలింగ్: సకరియా 3–0–18–0, ఉనాద్కట్ 4–0–33–0, ముస్తఫిజుర్ 3.3–0–37–1, మోరిస్ 4–0–33–2, తెవాటియా 3–0–30–0, దూబే 1–0–6–0. -
డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) డైరెక్టర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన రోజే గ్రేమ్ స్మిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా తాత్కాలిక టెస్టు కెప్టెన్‌గా ఉన్న క్వింటాన్ డీకాక్‌ను తప్పించాడు. గత డిసెంబరులో సీఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితుడైన స్మిత్.. తాజాగా పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 2022, మార్చి 20 వరకూ స్మిత్ ఈ పదవిలో కొనసాగుతాడు.. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా డీకాక్‌ను తొలగిస్తున్నట్లు తెలిపాడు. డుప్లెసిస్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక కెప్టెన్‌గా డీకాక్‌ను నియమించారు. ఇప్పుడు డీకాక్‌ను తప్పిస్తూ స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కాగా, ఇంకా ఎవరిని నియమిస్తారన్న చర్చ మాత్రం తనకు సవాలుగా నిలిచిందన్నాడు. (గ్రేమ్ స్మిత్.. మరో రెండేళ్లు!) ‘వన్డే జట్టు కెప్టెన్‌గా, కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా డీకాక్‌పై పెద్ద బాధ్యతలున్నాయి. అందువల్ల డికాక్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం లేదు. డీకాక్ నుంచి ఇంకా స్థిరమైన ప్రదర్శన కోరుకుంటున్నాము. టెస్టులకు కూడా కెప్టెన్ ఉంటే అతనిపై ఒత్తిడి పెరుగుతుంది. అది జట్టుకు ప్రయోజనకరం కాదు’ అని స్మిత్ తెలిపాడు. కాగా, మరి టెస్టు కెప్టెన్ ఎవరు అనే దానిపై స్మిత్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉందని స్మిత్ తెలిపాడు. తాను ఇచ్చే కచ్చితమైన సమాధానం ఏదైనా ఉందంటే అది డీకాక్‌ను తప్పించడమే కానీ, ఆ స్థానం ఎవరిది అనే దానిపై ఇప్పుడే చెప్పలేనన్నాడు. కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మాత్రమే డీకాక్ ఉంటాడని, టెస్టు ఫార్మాట్‌కు కాదన్నాడు. త్వరలో వెస్టిండీస్ సిరీస్ ఉన్న తరుణంలో అది జరుగుతుందా.. లేదా అనే విషయం కూడా ఇప్పుడే చెప్పలేనన్నాడు. కరోనా వైరస్ కారణంగా విండీస్‌తో సిరీస్‌పై పూర్తిస్థాయి స్పష్టత లేదన్నాడు. -
డి కాక్ చెలరేగిపోగలడు!
కొత్త కెప్టెన్ డి కాక్ సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం మళ్లీ వచ్చింది. దక్షిణాఫ్రికాలో 3–0తో ఆస్ట్రేలియాను చిత్తు చేసి వస్తుండటం వల్ల జట్టులో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది. డి కాక్ తొలి రెండు వన్డేల్లో విఫలమయ్యాడు. రెండు సార్లు స్టార్క్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తన భార్య అలీసా హీలీ ప్రపంచ కప్ మ్యాచ్ చూసేందుకు స్టార్క్ స్వదేశం వెళ్లిన తర్వాత జరిగిన మూడో వన్డేలోనే అతను పరుగులు చేయగలిగాడు. అయితే దీని వల్ల అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ఎందుకంటే భారత్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న డి కాక్ అలవోకగా సెంచరీలు బాదేశాడు. భారత్‌లో పరాభవంనుంచి కోలుకున్న తర్వాత డు ప్లెసిస్ కూడా ఇప్పుడు కోలుకొని ఉంటాడు. అతనిలోని అసలైన బ్యాట్స్‌మన్ బయటకు వస్తే మంచిది. అతనిపై కెప్టెన్సీ భారం లేదు కాబట్టి కొన్నాళ్ల క్రితం సారథిగా కనిపించిన బేలతనం ఇకపై కనిపించకపోవచ్చు. కొందరు కొత్త ఆటగాళ్లతో జట్టు కూడా కొత్తగా కనిపిస్తోంది. ఆసీస్‌పై సెంచరీ చేసిన మలాన్‌తో పాటు గతంలో భారత్‌లో ఆడినా పెద్దగా అవకాశాలు రాని క్లాసెన్ ఆట కూడా కీలకం కానుంది. రబడ లేకుండా బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... ఇక్కడ టెస్టులు ఆడలేకపోయిన ఇన్‌గిడి ఇటీవల ఆస్ట్రేలియాపై చెలరేగాడు. అతను ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. -
సఫారీల పోరాటం
దక్షిణాఫ్రికా తేలిగ్గా తలవంచలేదు. ముందు రోజే మూడు వికెట్లు కోల్పోయినా పట్టుదలగా నిలబడిన బ్యాట్స్‌మెన్ భారత బౌలింగ్‌ను నిరోధించారు. ఎల్గర్, డి కాక్ సెంచరీలతో సత్తా చాటి తమ జట్టును తక్షణ ప్రమాదం నుంచి తప్పించారు. వీరితో పాటు కెపె్టన్ డు ప్లెసిస్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడగా... సఫారీ జట్టు ఆలౌట్ కాకుండా రోజంతా నిలబడింది. ఆధిక్యానికి అవకాశం లేకపోయినా తొలిఇన్నింగ్స్ స్కోరు అంతరాన్ని మాత్రం బాగా తగ్గించింది. పేసర్లు పెద్దగా ప్రభావం చూపని చోట ఎప్పటిలాగే సొంతగడ్డపై నమ్ముకున్న స్పిన్నర్లే టీమిండియాను నడిపించారు. అశి్వన్ మరోసారి ఐదు వికెట్లతో మెరవడం, జడేజా 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడం భారత కోణంలో శుక్రవారం ఆటలో చెప్పుకోదగ్గ విశేషాలు. అనూహ్య బౌన్స్‌తో పిచ్ ఇప్పటికే భిన్నంగా స్పందించడం మొదలైన నేపథ్యంలో నాలుగో రోజు సఫారీలు మరెన్ని పరుగులు జోడిస్తారో, ఆ తర్వాత భారత్ ఎలా ఆడుతుందో అనేది ఆసక్తికరం. విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు గట్టి పోరాటపటిమ ప్రదర్శించింది. శుక్రవారం 98 ఓవర్లు ఆడినా కేవలం 5 వికెట్లు మాత్రమే చేజార్చుకొని మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 160; 18 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ (163 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించగా... కెపె్టన్ డు ప్లెసిస్ (103 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎల్గర్ ఐదో వికెట్‌కు ప్లెసిస్‌తో 115 పరుగులు, ఆరో వికెట్‌కు డి కాక్‌తో 164 పరుగులు జోడించాడు. ఒకే రోజు దక్షిణాఫ్రికా 346 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 117 పరుగులు వెనుకబడి ఉంది. తొలి సెషన్: తడబడి... నిలబడి... ఓవర్‌నైట్ స్కోరు 39/3 నుంచి తడబడుతూనే దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆట మొదలైన కొద్దిసేపటికి బవుమా (18)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇషాంత్ మూడో రోజు మొదటి దెబ్బ వేశాడు. కానీ మొదటి సెషన్ ముగిసేసరికి ఆ ఆనందం భారత ఆటగాళ్ల నుంచి దూరమైంది. ఎల్గర్, డు ప్లెసిస్ కలిసి ప్రశాంతంగా, చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోవడం కూడా వారికి కలిసొచి్చంది. ఐదు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి ప్లెసిస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వేగంగా ఆడిన ఈ జోడీని విడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఓవర్లు: 30, పరుగులు: 114, వికెట్లు: 1 రెండో సెషన్: డి కాక్ దూకుడు లంచ్ తర్వాత కొద్ది సేపటికే 91 బంతుల్లో డు ప్లెసిస్ అర్ధసెంచరీ పూర్తవడంతో పాటు ఎల్గర్‌తో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. భారత శిబిరంలో అసహనం పెరిగిపోతున్న దశలో ఎట్టకేలకు అశి్వన్ బ్రేక్ ఇచ్చాడు. వ్యూహాత్మకంగా లెగ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచి బంతిని వేయగా డు ప్లెసిస్ నేరుగా అక్కడే ఉన్న పుజారా చేతుల్లోకి కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన డి కాక్ కూడా ఎల్గర్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కీపర్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. అశి్వన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను, జడేజా వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదడం విశేషం. భాగస్వామ్యాన్ని పడగొట్టే ప్రయత్నంలో విహారి, రోహిత్‌లతో బౌలింగ్ వేయించినా లాభం లేకపోయింది. అశి్వన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 79 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న డి కాక్... విహారి వేసిన తర్వాతి ఓవర్లోనూ మరో రెండు బౌండరీలు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. టీ విరామానికి అర గంట ముందే చీకటిగా మారడంతో ఫ్లడ్‌లైట్లలో మ్యాచ్‌ను కొనసాగించారు. అందుకే భారత్ కొత్త బంతిని తీసుకున్నా అంపైర్ల సూచన మేరకు వెంటనే పేసర్లతో బౌలింగ్ చేయించలేదు. ఓవర్లు: 37, పరుగులు: 139, వికెట్లు: 1 మూడో సెషన్: అశ్విన్ మెరిసె... విరామం తర్వాత కూడా ఎల్గర్, డి కాక్ల జోరు కొనసాగింది. వీరిద్దరు భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. కొత్త బంతితో ఇషాంత్, షమీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో రెండు వైపుల నుంచి అశ్విన్, జడేజాలే భారం మోశారు. ఎల్గర్‌ను అవుట్ చేసి భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 బాదిన డి కాక్ 149 బంతుల్లో కెరీర్లో ఐదో సెంచరీని సాధించాడు. అయితే డి కాక్‌ను అవుట్ చేసి అశ్విన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఫిలాండర్ (0)ను వెనక్కి పంపి అశి్వన్ ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 31, పరుగులు: 93, వికెట్లు: 3 ఆ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే... మూడో రోజు భారత జట్టు మైదానంలో బాగా తడబడింది. రెండు క్యాచ్‌లు చేజారడం మ్యాచ్ గతిని మార్చేశాయి. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఎల్గర్ ఇచి్చన క్యాచ్‌ను సాహా వదిలేశాడు. ఆ తర్వాత ఎల్గర్ మరో 86 పరుగులు జోడించాడు. విహారి బౌలింగ్‌లో 7 పరుగుల వద్ద డి కాక్ ఇచి్చన క్యాచ్‌ను సిల్లీ పాయింట్లో రోహిత్ అందుకోవడంలో విఫలమయ్యాడు. సరైన సమయంలో కిందకు వంగడంలో రోహిత్ విఫలమయ్యాడు. ఇది మరో 104 పరుగులు నష్టాన్ని కలిగించింది. ఇద్దరూ సిక్సర్లతోనే... దక్షిణాఫ్రికా జట్టులో సెంచరీ సాధించిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా సిక్సర్లతోనే వాటిని పూర్తి చేయడం విశేషం. అశి్వన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో ఎల్గర్ శతకం చేరగా... అశ్విన్ బౌలింగ్‌లోనే కవర్స్ మీదుగా సిక్సర్ బాది డి కాక్ ఆ మైలురాయిని అందుకున్నాడు. 2002లో పాకిస్తాన్‌పై పాంటింగ్, స్టీవ్ వా మాత్రమే ఇదే తరహాలో ఒకే ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించారు. సూపర్ ఇన్నింగ్స్... భారత గడ్డపై ఒక విదేశీ బ్యాట్స్‌మన్ టెస్టుల్లో సాధికారికంగా బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో గడపడం, స్పిన్నర్ల పరీక్షకు ఎదురుగా నిలవడం అంత సులువు కాదు. అయితే దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ తన కెరీర్లోనే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో జట్టు కుప్పకూలిపోకుండా కాపాడాడు. 2015లో 0–3తో చిత్తుగా ఓడిన బృందంలో ఎల్గర్ కూడా సభ్యుడే. ఆ సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 137 పరుగుల పేలవ ప్రదర్శనతో అతను వెనుదిరగ్గా... ఈ సారి తొలి ఇన్నింగ్స్‌లో అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చి మూడు సందర్భాల్లో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉన్న ఎల్గర్ అసలు సమయంలో తన సత్తాను ప్రదర్శించగలిగాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు ఏ దశలోనూ తడబడకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడటం ఎల్గర్ ఇన్నింగ్స్‌లో కనిపించింది. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. మ్యాచ్ రెండో రోజు అవతలి ఎండ్‌లో మూడు వికెట్లు పడ్డా, ఎల్గర్ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. జడేజా బౌలింగ్‌లో అతను బాదిన సిక్సరే అందుకు నిదర్శనం. శుక్రవారం రెండు సెంచరీ భాగస్వామ్యాల్లో కీలక పాత్రతో ఎల్గర్ జట్టును నడిపించాడు. 112 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత జడేజా వేసిన ఓవర్లో దూకుడు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఈ ఓవర్లో ఎల్గర్ 2 భారీ సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టడం విశేషం. షమీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90ల్లోకి చేరుకున్న ఎల్గర్‌కు కెరీర్లో 12వ సెంచరీ సాధించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. సెంచరీ తర్వాత కూడా జోరు తగ్గించని ఎల్గర్ మరికొన్ని షాట్లతో అలరించాడు. ఏడు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు కొట్టి 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే తన అత్యధిక స్కోరు 199ను అధిగమించి తొలి డబుల్ సెంచరీ మాత్రం నమోదు చేయలేకపోయాడు. జడేజా బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించగా బౌండరీ నుంచి వేగంగా దూసుకొచ్చిన పుజారా చక్కటి క్యాచ్ పట్టడంతో ఎల్గర్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పుజారా (బి) జడేజా 160; మార్క్రమ్ (బి) అశి్వన్ 5; బ్రూయిన్ (సి) సాహా (బి) అశి్వన్ 4; పీట్ (బి) జడేజా 0; బవుమా (ఎల్బీ) (బి) ఇషాంత్ 18; డు ప్లెసిస్ (సి) పుజారా (బి) అశ్విన్ 55; డి కాక్ (బి) అశ్విన్ 111; ముత్తుసామి (బ్యాటింగ్) 12; ఫిలాండర్ (బి) అశి్వన్ 0; మహరాజ్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (118 ఓవర్లలో 8 వికెట్లకు) 385 వికెట్ల పతనం: 1–14, 2–31, 3–34, 4–63, 5–178, 6–342, 7–370, 8–376. బౌలింగ్: ఇషాంత్ శర్మ 14–2–44–1, షమీ 15–3–40–0, అశి్వన్ 41–11–128–5, జడేజా 37–4–116–2, విహారి 9–1–38–0, రోహిత్ 2–1–7–0. ►200 జడేజా టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 44వ టెస్టులో ఈ ఘనత సాధించిన అతను అందరికంటే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న లెఫ్టార్మ్ బౌలర్‌గా రంగన హెరాత్ (47) రికార్డును సవరించాడు. ఓవరాల్‌గా భారత బౌలర్లలో 37 టెస్టుల్లోనే 200 వికెట్లు తీసిన అశి్వన్ మొదటి స్థానంలో ఉన్నారు. ►27 అశి్వన్ కెరీర్లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 27వ సారి. అతను అండర్సన్, బోథమ్ (27)లతో సమంగా నిలిచాడు. ఓవరాల్‌గా మరో ఆరుగురు మాత్రమే అశ్విన్‌కంటే ముందున్నారు. -
అనూహ్యంగా విజృంభించిన దక్షిణాఫ్రికా
అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి... మూడో టి20లో సఫారీ జట్టు జయకేతనం ఎగురవేసింది. సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. బెంగళూరు: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా మీద తొలిసారి టి20 సిరీస్ నెగ్గాలన్న టీమిండియా కోరిక నెరవేరలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో టి20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన కోహ్లి సేన... సఫారీల చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్, ఓపెనర్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి ఆడి సఫారీ జట్టును గెలిపించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 19; ఫోర్, సిక్స్), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (17 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) ఫర్వాలేదనిపించారు. రబడ (3/39) మూడు వికెట్లు పడగొట్టగా, పొదుపుగా బౌలింగ్ చేసిన ఫార్చూన్ (2/19), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బ్యురాన్ హెన్డ్రిక్స్ (2/14)కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో దక్షిణాఫ్రికాను డికాక్ ఒంటిచేత్తో నడిపించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్‌తో ఆ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. డికాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ అక్టోబరు 2న విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఎంతో చేస్తుందనుకుంటే! 54/1... పవర్ ప్లే (6 ఓవర్లు) అనంతరం భారత్ స్కోరిది. ఓపెనర్ రోహిత్ శర్మ (9) విఫలమైనా, దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రభావవంతంగా లేకపోవడం, ధావన్, కోహ్లి (9) క్రీజులో ఉండటంతో భారీ స్కోరు ఖాయంగా కనిపించింది. కానీ, టీమిండియా ఒక్కసారిగా తడబడింది. షమ్సీ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాది మంచి టచ్‌లో కనిపించిన ధావన్... అతడి మరుసటి ఓవర్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఆ వెంటనే రబడ బౌలింగ్‌లో ఫుల్ లెంగ్త్ బంతిని గాల్లోకి లేపిన కోహ్లి బౌండరీ లైన్ వద్ద ఫెలూక్వాయో పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో పంత్ ప్రయోగం మరోసారి ఫలించలేదు. ప్రిటోరియస్ బౌలింగ్‌లో చక్కటి సిక్స్ కొట్టిన పంత్‌ను ఫార్చూన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. రెండు బంతుల తేడాతో క్రీజు వదిలి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (5) స్టంపౌటయ్యాడు. దీంతో 13 ఓవర్లకు జట్టు 92/5తో కష్టాల్లో పడింది. కృనాల్ (4) కూడా ఔటయ్యాక హార్దిక్ (18 బంతుల్లో 14; ఫోర్), జడేజా తమవంతు పోరాటం సాగించారు. ఏడో వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జడేజా, సుందర్ (4), హార్దిక్‌లను రబడ పెవిలియన్ చేర్చడంతో భారత్ సాధారణ స్కోరుతోనే సరిపెట్టుకుంది. డికాక్ దున్నేశాడు.... అసలే స్వల్ప లక్ష్యం. ఆపై ఛేదనకు అనువైన పిచ్. దీంతో డికాక్, మరో ఓపెనర్ రీజా హెన్డ్రిక్స్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) చెత్త బంతులనే షాట్లు కొడుతూ పోయారు. సైనీ ఓవర్లో రెండు సిక్స్‌లతో ఊపులోకి వచ్చిన సఫారీ కెప్టెన్ ఎక్కడా తగ్గకుండా ఆడాడు. ఏ బౌలర్‌ను వదలను అన్నట్లుగా బౌండరీలు, సిక్స్‌లు బాదాడు. 38 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హెన్డ్రిక్స్ను హార్దిక్ ఔట్ చేసినా అప్పటికే ఆలస్యమైంది. డికాక్ ధాటితో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ఛేదనలో ఇబ్బంది పడలేదు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బవుమా (23 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ చేయి వేయడంతో సఫారీలు లక్ష్యాన్ని అవలీలగా అందుకున్నారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) బవుమా (బి) షమ్సీ 36; రోహిత్ (సి) రీజా హెన్డ్రిక్స్ (బి) బ్యురన్ హెన్డ్రిక్స్ 9; కోహ్లి (సి) ఫెలూక్వాయో (బి) రబడ 9; పంత్ (సి) ఫెలూక్వాయో (బి) ఫార్చూన్ 19; అయ్యర్ (స్టంప్డ్) డికాక్ (బి) ఫార్చూన్ 5; హార్దిక్ పాండ్యా (సి) మిల్లర్ (బి) రబడ 14; కృనాల్ పాండ్యా (సి) డికాక్ (బి) బ్యురన్ హెన్డ్రిక్స్ 4; జడేజా (సి అండ్ బి) రబడ 19; సుందర్ (రనౌట్) 4; చహర్ (నాటౌట్) 0; సైనీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134 వికెట్ల పతనం: 1–22, 2–63, 3–68, 4–90, 5–92, 6–98, 7–127, 8–133, 9–133. బౌలింగ్: ఫార్చూన్ 3–0–19–2; రబడ 4–0–39–3; బ్యురన్ హెన్డ్రిక్స్ 4–0–14–2; ఫెలూక్వాయో 4–0–28–0; షమ్సీ 4–0–23–1; ప్రిటోరియస్ 1–0–8–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెన్డ్రిక్స్ (సి) కోహ్లి (బి) హార్దిక్ 28; డికాక్ (నాటౌట్) 79; బవుమా (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 140 వికెట్ల పతనం: 1–76. బౌలింగ్: సుందర్ 4–0–27–0; దీపక్ చహర్ 3–0–15–0; సైనీ 2–0–25–0; కృనాల్ 3.5–0–40–0; హార్దిక్ 2–0–23–1; జడేజా 2–0–8–0. పంత్... అంతేనా! అంతేనా! యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ నిరాశపర్చాడు. ఫామ్ లేమి, వైఫల్యాలు ఆటగాళ్లకు సహజమే అయినా అందరూ ప్రత్యేక దృష్టితో చూస్తున్నందున మూడో టి20లో పంత్‌ది తప్పక రాణించాల్సిన పరిస్థితి. మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు దిగినప్పటికి (7.3వ ఓవర్) అంతా సవ్యంగా ఉంది. ఓ మెరుపు ఇన్నింగ్స్‌తో విమర్శలకు సమాధానం ఇచ్చే ఇలాంటి అవకాశాన్ని పంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్ స్టంప్‌నకు దూరంగా బౌలర్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాడు. ఎప్పటిలాగే ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బోణీ కొట్టేనా!
తొలి టి20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. ఇప్పుడు మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై టీమిండియా తమ అనుకూలతను వాడుకొని విజయం సాధించండంపై దృష్టి పెట్టగా, పర్యాటక జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది. కోహ్లి నాయకత్వంలో భారత ఆటగాళ్లంతా అమితోత్సాహంతో కనిపిస్తుండగా, కొత్త కెపె్టన్ డి కాక్ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. వాతావరణం బాగుండటం అభిమానులు ఆనందించాల్సిన విషయం. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై బోణీ చేస్తుంది. మొహాలి: భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే టి20 మ్యాచ్‌లలో మొహాలీ స్టేడియంలో జరిగిన 2016 టి20 ప్రపంచ కప్ పోరు ఒకటి. ఆ్రస్టేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి అత్యద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఇటీవల అతను దీని గురించే ఫొటోతో సహా గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టేడియం వేదికపై భారత్ మళ్లీ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న టీమిండియా నేటి టి20 మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఒకరిద్దరు మినహా పెద్దగా గుర్తింపు లేని ఆటగాళ్లతోనే ఆడనున్న దక్షిణాఫ్రికా ఎలాంటి పోటీనివ్వగలదో చూడాలి. స్పిన్నర్లపై దృష్టి... దాదాపు నెలన్నర క్రితం కోహ్లి సేన తమ చివరి టి20 మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడింది. మ్యాచ్ గెలవడంతో పాటు 3–0తో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. నాటి మ్యాచ్‌తో పోలిస్తే సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్ స్థానంలో హార్దిక్ పాండ్యా, విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తుది జట్టులో ఖాయంగా ఉంటారు. రోహిత్ కోసం రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. కోహ్లి తనదైన శైలిలో చెలరేగేందు సిద్ధంగా ఉండగా, మనీశ్ పాండే మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. టెస్టుల్లో ఇప్పటికే చోటు కోల్పోయిన ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయి ప్రదర్శించేందుకు ఇది సరైన అవకాశం. ఇద్దరు పేసర్లుగా నవదీప్ సైనీ, దీపక్ చహర్ ఆడటం ఖాయం. అయితే అన్నింటికి మించి ఇద్దరు స్పిన్నర్లపై ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు సాధ్యమైనన్ని ప్రత్యామ్నాయాలు పరీక్షించేందుకు సిద్ధమవుతున్న టీమిండియా ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్‌లను తీర్చి దిద్దే పనిలో పడింది. రెండేళ్లుగా భారత విజయాల్లో కీలకంగా మారిన చహల్, కుల్దీప్లను పక్కన పెట్టి మరీ వీరిద్దరిని ఎంపిక చేశారు. కాబట్టి వారితో పోలికలు రావడం కూడా ఖాయం. ఆల్‌రౌండర్ జడేజా జట్టుకు అదనపు బలం. గెలిపించేదెవరు? స్టార్ ఆటగాళ్లతో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకే భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శక్తికి మించి పని. అలాంటిది ఏమాత్రం అనుభవం లేని ఆటగాళ్లతో ఆ జట్టు పొట్టి ఫార్మాట్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఐపీఎల్ అనుభవం ఉన్న రబడ, మిల్లర్లతో పాటు కెపె్టన్ డి కాక్ ఆటపై సఫారీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా రబడ తన స్పెల్‌తో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీయగలిగితే పైచేయి సాధించగలమని ఆ జట్టు భావిస్తోంది. వాన్ డర్ డసెన్ ఇటీవల కీలక ఆటగాడిగా ఎదిగినా... భారత్‌లో ఎప్పుడూ ఆడలేదు. బవుమా, జూనియర్ డాలా, నోర్టే తదితరుల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. కొన్నాళ్ల క్రితం ఇదే మైదానంలో జరిగిన వన్డేలో ఆసీస్ బ్యాట్స్‌మన్ టర్నర్ తరహాలో ఎవరైనా అనూహ్య ఇన్నింగ్స్ ఆడితే తప్ప సఫారీలకు విజయం సులువు కాబోదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్, ధావన్, పంత్, పాండే, హార్దిక్, జడేజా, కృనాల్, సుందర్/రాహుల్ చహర్, దీపక్ చహర్, సైనీ. దక్షిణాఫ్రికా: డి కాక్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, బవుమా, వాన్ డర్ డసెన్, మిల్లర్, జోర్న్ ఫార్చూన్, ఫెలుక్వాయో, రబడ, షమ్సీ, ప్రిటోరియస్, డాలా/నోర్టే. పిచ్, వాతావరణం టి20లకు సరిపోయే విధంగా మంచి బ్యాటింగ్ వికెట్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. -
భారీ స్కోరు దిశగా బంగ్లా
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లా ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలిచారు. బంగ్లా ఆటగాళ్లలో షకీబుల్ హసన్, ముష్పఫికర్ రహీమ్‌లు హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ 32 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండొందల మార్కును చేరింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(16) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, సౌమ్య సర్కార్, షకీబుల్, రహీమ్‌లు మెరిశారు. సౌమ్య సర్కార్ 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసిన తర్వాత రెండో వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఆ తరుణంలో షకీబుల్‌కు జత కలిసిన రహీమ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే వీరు తలో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లా ఇన్నింగ్స్‌ను తమీమ్ ఇక్బాల్- సౌమ్య సర్కార్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు సాధించిన తర్వాత ఇక్బాల్(16) ఔటయ్యాడు. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో సౌమ్య సర్కార్ పెవిలియన్ చేరాడు. దాంతో 75 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై షకీబుల్-రహీలు అత్యంత నిలకడగా ఆడటంతో సఫారీ బౌలర్లకు సవాల్‌గా మారింది. -
డీకాక్.. కళ్లు చెదిరేలా
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్ అనిపించాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భాగంగా డీకాక్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్(42; 30 బంతుల్లో 9 ఫోర్లు) ధాటిగా ఆడే క్రమంలో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో భాగంగా క్రిస్ మోరిస్ వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని సౌమ్య సర్కార్ పుల్ చేయబోయాడు. అది సర్కార్ అంచనా తప్పి గ్లౌవ్‌ను ముద్దాడుతూ వికెట్లకు వెనకాలే పైకి లేచింది. ఆ సమయంలో వికెట్లకు దూరంగా ఉన్న కీపర్ డీకాక్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని అందుకోవడానికి పరుగెత్తూకుంటూ వచ్చి బంతి కింది పడే సమయంలో అమాంతం డైవ్ కొట్టాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : డీకాక్ అద్భుతమైన డైవ్ క్యాచ్ (ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లికి గాయం) ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకోవడంతో సౌమ్య సర్కార్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజ్‌లో కుదురుకుని నిలకడగా ఆడుతున్న సమయంలో సర్కార్ ఔట్ కావడం బంగ్లా అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. అదే సమయంలో డీకాక్‌పై కామెంటేటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదొక అద్భుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లా ఇన్నింగ్స్‌ను తమీమ్ ఇక్బాల్- సౌమ్య సర్కార్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు సాధించిన తర్వాత ఇక్బాల్(16) ఔటయ్యాడు. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో సౌమ్య సర్కార్ పెవిలియన్ చేరాడు. దాంతో 75 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. -
డీకాక్ అద్భుతమైన డైవ్ క్యాచ్
-
దక్షిణాఫ్రికా రెండో గెలుపు
దంబుల్లా: బౌలర్ల పట్టుదలకు తోడు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 244 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (79 నాటౌట్; 6 ఫోర్లు), డిక్వెలా (69; 10 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి, ఫెలుక్వాయో మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం సఫారీ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులు చేసి గెలుపొందింది. డికాక్ (78 బంతుల్లో 87; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా (43; 6 ఫోర్లు), కెప్టెన్ డు ప్లెసిస్ (49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరుగనుంది. -
'డీకాక్ పరుష పదజాలంతో రెచ్చగొట్టాడు'
డర్బన్: క్రీడా మైదానంలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాల్సిన క్రికెటర్లు డేవిడ్ వార్నర్-డీకాక్‌లు అన్ని మరిచి మాటల యుద్ధానికి దిగారు. సహచరులు వారిస్తునన్నా వినిపించుకోకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆసీస్-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఆటలో టీ విరామం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో వార్నర్, డీకాక్ ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. దాంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే మ్యాచ్ పూర్తైన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో వార్నర్‌ను ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెనకేసుకొచ్చాడు. ఇందులో వార్నర్ తప్పిదం లేదంటూ స్మిత్ పేర్కొన్నాడు. వార్నర్‌ను పరుష పదజాలంతో ముందు రెచ్చగొట్టింది డీకాక్ అంటూ స్మిత్ తెలిపాడు. ఫీల్డ్‌లో వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో వారి మధ్య వివాదం రాజుకుందన్నాడు. వార్నర్ భార్యను డీకాక్ దూషించిన కారణంగానే అతను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్మిత్ అన్నాడు. ఏది ఏమైనా ఈ తరహా ఘటనలు క్రికెట్‌కు అంత మంచివి కావన్నాడు. మరొకవైపు డీకాక్ తల్లి, చెల్లిని వార్నర్ అసభ్యకర పదజాలంతో తిట్టినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
మొన్న ఏబీ... నిన్న డు ప్లెసిస్... నేడు డికాక్
కేప్‌టౌన్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓటములతో పాటు గాయాలతోనూ విలవిల్లాడుతోంది. వన్డేల్లో కోహ్లి సేన చేతిలో వరుస పరాజయాలు... గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడంతో సఫారీ జట్టు కుదేలవుతోంది. ఇప్పటికే ఏబీ డివిలియర్స్ తొలి మూడు వన్డేల్లో ఆడట్లేదు. డు ప్లెసిస్ ఏకంగా భారత్‌తో సిరీస్‌కే దూరమయ్యాడు. వీళ్లిద్దరు చేతి వేలి గాయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ ఈ జాబితాలో చేరాడు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా అతని ఎడమ మణికట్టుకు గాయమైంది. దీంతో అతను మిగతా నాలుగు వన్డేలతో పాటు టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. డికాక్ పూర్తిగా కోలుకునేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. బుధవారం కేప్‌టౌన్‌లో జరిగే మూడో వన్డేతో అతని కెరీర్ మొదలవనుంది. ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. -
దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్‌లు గాయాల బారిన పడగా, తాజాగా మరో కీలక ఆటగాడు క్వింటాన్ డీకాక్‌కు కూడా గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మణికట్టు గాయం కారణంగా మొత్తం భారత్‌తో సిరీస్ నుంచి డీకాక్ తప్పకున్నాడు. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత పేసర్ బూమ్రా వేసిన షార్ట్ పిచ్ బంతి డీకాక్ చేతికి బలంగా తాకింది. ఆ నొప్పి తీవ్రం కావడంతో డీకాక్ అర్థాంతరంగా భారత్‌తో సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మిగిలిన నాలుగు వన్డేలతో పాటు మూడు ట్వంటీ 20ల సిరీస్‌కు డీకాక్ దూరం కానున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. డీకాక్ తిరిగి కోలుకోవడానికి రెండు వారాల నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్ నుంచి డీకాక్ వైదొలగాల్సి వచ్చింది. అయితే అతని స్థానంలో మరొక ఆటగాడ్ని ఇంకా ఎంపిక చేయలేదు. -
వికెట్లు ముందు దొరికిపోయారు..
డర్బన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(16), డీ కాక్(34) వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 15 ఓవర్లో డీకాక్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత స్పిన్నర యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో డీ కాక్ ఎల్బీగా అవుటయ్యాడు. అంతకుముందు హషీమ్ ఆమ్లా సైతం ఎల్బీగానే పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ వికెట్లు ముందు దొరికిపోవడం గమనార్హం. బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఆమ్లా ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఆపై మరో ఏడు ఓవర్ల వ్యవధిలో డీ కాక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. దాంతో సఫారీలు 83 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయారు. ఇక మర్క్రామ్(9) మూడో వికెట్‌గా అవుటయ్యాడు. జట్టు స్కోరు 103 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో హార్దక్ పాండ్యా క్యాచ్ ఇచ్చిన మర్క్రామ్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. తొలి మూడు వన్డేలకు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతని స్థానంలో తొలి వన్డేలో మర్క్రామ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. -
డీకాక్ 'ఫాస్టెస్ట్' రికార్డు!
లండన్: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ మైదానంలో వేగవంతమైన టెస్టు హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు స్పష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో డీ కాక్ దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా లార్డ్స్ టెస్టుల్లో అత్యంత వేగవంతంగా అర్థ శతకం సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇక్కడ టెస్టు బ్యాటింగ్ ను పక్కకు పెట్టిన డీకాక్ టీ 20ని గుర్తు చేశాడు. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ వచ్చే డీకాక్.. టెస్టుల్లో మాత్రం మిడిల్ ఆర్డర్ లో కానీ, చివరి వరసులో కానీ వస్తుంటాడు. ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన డీకాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే 51 పరుగుల వద్ద డీ కాక్ ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 361 పరుగుల వద్ద ఆలౌటైంది.. -
సీఎస్ఎ అవార్డుల్లో డికాక్‌కు అవార్డుల పంట
జోహన్నస్బర్గ్: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ క్రికెట్ సౌతాఫ్రికా ఏటా ప్రదానం చేసే సీఎస్ఏ అవార్డుల్లో ఐదు అవార్డులను కైవసం చేసుకున్నాడు. 2017 ఏడాదికిగానూ ఉత్తమ దక్షిణాఫ్రికా క్రికెటర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, పబ్లిక్ ఓటింగ్ అవార్డును కూడా కైవసం చేసుకోవడం విశేషం. గాలాలో జరిగన అవార్డుల కార్యక్రమంలో డికాక్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ ఐదు అవార్డులతో పాటు ఐసీసీ వన్డే క్రికెటర్ అవార్డును కూడా సాధించాడు. ఇదిలా ఉండగా ఉత్తమ టీ–20 క్రికెటర్ అవార్డును వరుసగా రెండో ఏడాది కూడా ఇమ్రాన్ తాహిర్ ఎగరేసుకెళ్లాడు. -
డికాక్ అవుట్..శామ్యూల్స్ ఇన్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వెస్టీండిస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్‌ను ఎంపిక చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాడు సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయంతో ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఇతని స్థానంలో శ్యాముల్స్ ను ఎంపిక చేసినట్లు ఆ జట్టు ప్రకటించింది. డికాక్ ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టీండిస్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన శ్యాముల్స్ను ఐపీఎల్-10 సీజన్ వేలంలో ఏ జట్టు తీసుకోలేదు. దీంతో 7 వ స్థానంలో దాటిగా ఆడే ఆల్ రౌండర్ లేక సతమతమవుతున్నఢిల్లీ శ్యామ్యూల్స్ను ఎంపిక చేసింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలని ఢిల్లీ భావిస్తుంది. ఇప్పటికీ 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండు నెగ్గి, నాలుగు మ్యాచుల్లో ఓడింది. -
డీ కాక్ మళ్లీ ఇరగదీశాడు!
హోబార్ట్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్.. రెండో టెస్టులో కూడా ఇరగదీశాడు. మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో డీ కాక్(104;143 బంతుల్లో 17 ఫోర్లు) శతకం నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు 132 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో డీకాక్ ఆకట్టుకున్నాడు. మరో క్రికెటర్ బావుమాతో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి దక్షిణాఫ్రికాను పటిష్టస్థితికి చేర్చాడు. ఈ క్రమంలోనే బావుమా(74;204 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఫిలిండర్(32) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికాకు 241 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా 79 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. బర్న్స్ డకౌట్ గా వెనుదిరగగా, వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఈ రోజు ఆటలో ఆసీస్ స్కోరు వికెట్ నష్టానికి 77 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. అయితే వర్షం తెరుపు ఇవ్వడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికీ వార్నర్ ను అబాట్ అవుట్ చేశాడు. రెండో డో రోజు ఆట వర్షం వల్ల పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. 171/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా..ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. పూర్తిస్థాయి నిలకడతో దక్షిణాఫ్రికా పరిస్థితిని చక్కదిద్దింది.అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి డీకాక్ ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బావుమా కూడా అవుటయ్యాడు.ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్ ఆరు వికెట్లు సాధించగా, స్టార్క్ కు మూడు వికెట్లు లభించాయి. -
'నాకు పింక్ బాల్ ఓకే'
అడిలైడ్: తనకు పింక్ బాల్ తో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో డీ కాక్(122 రిటైర్డ్ అవుట్;103 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు)తో శతకం సాధించాడు. అనంతరం పింక్ బాల్‌పై డీ కాక్ మాట్లాడుతూ.. డే అండ్ నైట్ లో ఉపయోగించే పింక్ బంతికి, డే మ్యాచ్‌ల్లో ఉపయోగించే బంతికి తేడా ఏమీ కనిపించలేదన్నాడు. అసలు దాని గురించి కూడా తాను పెద్దగా ఆలోచించలేదన్నాడు. 'బంతి ఏదైనా బంతే. పరిస్థితులన్ని బట్టి నేను ఆడతా. నా వరకూ పింక్ బాల్‌తో ఇబ్బంది అనిపించలేదు' అని డీ కాక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి పింక్ బాల్ పని తీరును అంచనా వేయొద్దని డీ కాక్ తెలిపాడు. తాను క్రీజ్‌లోకి వెళ్లిన తరువాత డకౌట్ అయినా, సెంచరీ చేసినా అది బాల్ మార్పుతో వచ్చిన ఫలితం కాదన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టును పింక్ బాల్ తో నిర్వహించనున్నారు. నవంబర్ 24 వ తేదీన అడిలైడ్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య పింక్ బాల్ మ్యాచ్ జరుగనుంది. దానిలో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే ఒక పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడగా, మూడో టెస్టుకు ముందు మెల్ బోర్న్లో మరో పింక్ బాల్ మ్యాచ్‌ను సఫారీలు ఆడనున్నారు. -
ఇంగ్లండ్ కుమ్మేసింది
► దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం ► జో రూట్, జాసన్ రాయ్ మెరుపులు ► ఆమ్లా, డి కాక్ శ్రమ వృథా ముంబై: 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఉఫ్‌మని ఊదేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ (16 బంతుల్లో 43; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) ఊచకోతతో ప్రారంభమైన పరుగుల వరద జో రూట్ (44 బంతుల్లో 83; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) జట్టు విజయాన్ని ఖాయం చేసేదాకా సాగింది. ఫలితంగా వాంఖడే మైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. బౌలర్ల వైఫల్యానికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా జత కలవడంతో ప్రొటీస్ మూల్యం చెల్లించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 229 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆమ్లా (31 బంతుల్లో 58; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), డి కాక్ (24 బంతుల్లో 52; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. డుమిని (28 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు), మిల్లర్ (12 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసి నెగ్గింది.ఇంగ్లండ్ తొలి బంతి నుంచే బాదుడు ప్రారంభించింది. రబడా వేసిన ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లో నాలుగు ఫోర్లు బాదిన ఓపెనర్ రాయ్ 21 పరుగులు రాబట్టగా రెండో ఓవర్లో మరో ఓపెనర్ హేల్స్ వరుసగా మూడు ఫోర్లు.. రాయ్ 4,6 కొట్టడంతో 23 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో హేల్స్ (7 బంతుల్లో 17; 4 ఫోర్లు) అవుటవడంతో తొలి వికెట్‌కు 15 బంతుల్లోనే 48 పరుగులు వచ్చాయి. కొద్దిసేపటికే రాయ్ ఓ భారీ సిక్స్ అనంతరం అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జో రూట్ బాధ్యతను తీసుకుని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. భారీ షాట్లతో రెచ్చిపోయి 29 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్లో అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్లో ఒక్క పరుగు కోసం హైడ్రామా నడిచినా మొయిన్ అలీ ఇంగ్లండ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా ఎల్బీడబ్ల్యు (బి) అలీ 58; డి కాక్ (సి) హేల్స్ (బి) అలీ 52; డి విలియర్స్ (సి) మోర్గాన్ (బి) రషీద్ 16; డు ప్లెసిస్ (సి) రాయ్ (బి) విల్లీ 17; డుమిని నాటౌట్ 54; మిల్లర్ నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 229. వికెట్ల పతనం: 1-96, 2-114, 3-133, 4-169. బౌలింగ్: విల్లే 4-0-40-1; టోప్లే 2-0-33-0; అలీ 4-0-34-2; జోర్డాన్ 3-0-49-0; స్టోక్స్ 2-0-23-0; రషీద్ 4-0-35-1; రూట్ 1-0-13-0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) డి కాక్ (బి) అబాట్ 43; హేల్స్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 17; స్టోక్స్ (సి) మోరిస్ (బి) రబడా 15; జో రూట్ (సి) మిల్లర్ (బి) రబడా 83, మోర్గాన్ (బి) డుమిని 12; బట్లర్ (స్టంప్డ్) డి కాక్ (బి) తాహిర్ 21; అలీ నాటౌట్ 12; జోర్డాన్ (సి) డుమిని (బి) అబాట్ 5; విల్లే (రనౌట్) 0; రషీద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (19.4 ఓవర్లలో 8 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1-48, 2-71, 3-87, 4-111, 5-186, 6-219, 7-229, 8-229. బౌలింగ్: రబడా 4-0-50-2; స్టెయిన్ 2-0-35-0; అబాట్ 3.4-0-41-3; తాహిర్ 4-0-28-1; డుమిని 3-0-31-1; మోరిస్ 3-0-43-0. -
ఇంగ్లండ్ దే తొలి వన్డే
♦ 39 పరుగుల తేడాతో ఓడిన దక్షిణాఫ్రికా ♦ డికాక్ సెంచరీ వృథా బ్లోమ్‌ఫోంటీన్: ఓపెనర్ క్వింటాన్ డి కాక్ (96 బంతుల్లో 138 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకం సాధించినా దక్షిణాఫ్రికా జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 400 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా వర్షంవల్ల ఆట నిలిచిపోయే సమయానికి 33.3 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు మాత్రమే చేసింది. ఆమ్లా (6) విఫలమైనా... డికాక్, డు ప్లెసిస్ (55)లు రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. డివిలియర్స్ (8), డుమిని (13), రో సోవ్ (19)లు విఫలమయ్యారు. 34వ ఓవర్లో భారీ వర్షం కురవడంతో ఆగిపోయిన మ్యాచ్ మళ్లీ మొదలవ్వలేదు. దీంతో డక్‌వర్త్ ప్రకారం సఫారీ జట్టు విజయలక్ష్యాన్ని 290 పరుగులుగా నిర్దేశించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 399 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభిం చింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే పోర్ట్ ఎలిజబెత్‌లో శనివారం జరుగుతుంది.