లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్ అనిపించాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భాగంగా డీకాక్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్(42; 30 బంతుల్లో 9 ఫోర్లు) ధాటిగా ఆడే క్రమంలో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో భాగంగా క్రిస్ మోరిస్ వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని సౌమ్య సర్కార్ పుల్ చేయబోయాడు. అది సర్కార్ అంచనా తప్పి గ్లౌవ్‌ను ముద్దాడుతూ వికెట్లకు వెనకాలే పైకి లేచింది. ఆ సమయంలో వికెట్లకు దూరంగా ఉన్న కీపర్ డీకాక్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని అందుకోవడానికి పరుగెత్తూకుంటూ వచ్చి బంతి కింది పడే సమయంలో అమాంతం డైవ్ కొట్టాడు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
డీకాక్ అద్భుతమైన డైవ్ క్యాచ్
(ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లికి గాయం)
ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకోవడంతో సౌమ్య సర్కార్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజ్‌లో కుదురుకుని నిలకడగా ఆడుతున్న సమయంలో సర్కార్ ఔట్ కావడం బంగ్లా అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. అదే సమయంలో డీకాక్‌పై కామెంటేటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదొక అద్భుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లా ఇన్నింగ్స్‌ను తమీమ్ ఇక్బాల్- సౌమ్య సర్కార్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు సాధించిన తర్వాత ఇక్బాల్(16) ఔటయ్యాడు. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో సౌమ్య సర్కార్ పెవిలియన్ చేరాడు. దాంతో 75 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment