
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పట్టు బిగించింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా ఒక్క పరుగు వెనుకపడి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టెక్కలేదు.
ఆ జట్టు చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండున్నర రోజులకు పైగా ఆట మిగిలి ఉంది. మెహిది హసన్ (55), జాకెర్ అలీ (30) బంగ్లాదేశ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఔటైతే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైనట్టే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసి 202 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కైల్ వెర్రిన్ అద్బుతమైన సెంచరీ (114) చేసి సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
THE SOUND. 🔊
THE DELIVERY. 🥶
KAGISO RABADA, YOU BEAUTY...!!!pic.twitter.com/ZuVxm1ovxq— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024
రబాడ దెబ్బ.. ముష్ఫికర్ అబ్బ..!
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్ రబాడ బంగ్లాదేశ్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా వెటరన్ ముష్ఫికర్ రహీం పాలిట విలన్ అయ్యాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రబాడ ముష్ఫికర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ క్లీన్ బౌల్డ్ అయిన తీరు ఎలా వైరల్ అయ్యిందో.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సీన్ కూడా అలాగే వైరలవుతుంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో రబాడ సంధించిన ఇన్ స్వింగర్ దెబ్బకు ముష్ఫికర్ మిడ్ వికెట్ గాల్లో పల్టీలు కొట్టింది. ఈ సీన్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. కాగా, రబాడ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నేలకూల్చాడు.
చదవండి: కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..?