South Africa vs Bangladesh
-
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు వియాన్ ముల్డర్ (105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సెంచరీలు నమోదయ్యాయి. తొలి రోజే ఓపెనర్ టోని డి జోర్జి, వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ శతకాలు బాదారు. ఓవర్‌నైట్ స్కోరు 307/2తో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 144.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ బ్యాటర్లు జోర్జి (177; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెడింగ్హామ్ (59; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించిన బెడింగ్‌హామ్‌ను తైజుల్ బౌల్డ్ చేశాడు. 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లుజోర్జి తన శతకాన్ని డబుల్ సెంచరీగా మలచుకోలేకపోయాడు. 141 క్రితంరోజు స్కోరుతో ఆట కొనసాగించిన అతను 36 పరుగులు జోడించి తైజుల్ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.తన మరుసటి ఓవర్లో కైల్ వెరియెన్ (0)ను తైజుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో తొలి సెషన్లో 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక... రెండో సెషన్లో రికెల్టన్ (12) నహీద్ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చకచకా నాలుగు వికెట్లు తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి (75 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు అబేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరు 152 పరుగులు జోడించారు.దక్షిణాఫ్రికా 575/6 డిక్లేర్డ్ ఇక టీ విరామం తర్వాత ముత్తుస్వామి అర్ధసెంచరీ, ముల్డర్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/198) ఐదు వికెట్లు తీయగలిగాడు కానీ దాదాపు 200 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 38 పరుగులే చేసి 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.టాప్–3 బ్యాటర్లు షాద్మన్ (0), హసన్ (10), జాకీర్ హసన్ (2) చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ రబడ 2 వికెట్లు తీయగా, నైట్‌వాచ్‌మన్ హసన్ (3)ను స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. మోమినుల్ హక్ (6 బ్యాటింగ్), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.‘బాక్సింగ్ డే’ టెస్టులోచివరిసారి టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 500 పరుగులు దాటిన సంవత్సరం 2020. ఆ ఏడాది సెంచూరియన్‌లో శ్రీలంక జట్టుతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో దక్షిణాఫ్రికా 621 పరుగులకు ఆలౌటైంది.ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డుఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు తమ తొలి సెంచరీని నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున టోనీ జోర్జి, స్టబ్స్, ముల్డర్ సెంచరీలు సాధించారు. 1948లో భారత్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ తరఫున గెర్రీ గోమెజ్, రాబర్ట్ క్రిస్టియాని, క్లేడ్ వాల్కట్ తమ తొలి సెంచరీలను నమోదు చేశారు. చదవండి: India vs New Zealand: జయమా... పరాభవమా! -
WTC: ఫైనల్ రేసులోకి దూసుకొచ్చిన సౌతాఫ్రికా.. డేంజర్లో టీమిండియా?
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులోకి సౌతాఫ్రికా దూసుకువచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో గెలుపొందడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. తద్వారా టీమిండియా- ఆస్ట్రేలియా జట్లకు సవాల్ విసిరే స్థితిలో నిలిచింది.టాప్-2లో టీమిండియా, ఆసీస్డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింట గెలిచి, మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. అంతేకాదు.. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ క్రమంలో 98 పాయింట్లు, 68.06 విజయాల శాతంతో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సైతం రోహిత్ సేన మాదిరే.. 12 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచి, మూడు ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది.అయితే, వివిధ మ్యాచ్‌లలో స్లో ఓవర్ రేటు తదితర కారణాల వల్ల ఆస్ట్రేలియా పాయింట్లలో కోత పడటంతో ప్రస్తుతం ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 62.50. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా ,ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. శ్రీలంక తొమ్మిదింట ఐదు విజయాలు, నాలుగు ఓటములతో మూడో స్థానం(60 పాయింట్లు, విజయాల శాతం 55.56)లో ఉంది.ఆరు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్న ప్రొటిస్ అయితే, ఇటీవలి బెంగళూరు టెస్టులో భారత్‌పై విజయంతో న్యూజిలాండ్ నాలుగోస్థానానికి చేరుకోగా.. తాజాగా సౌతాఫ్రికా కివీస్ జట్టును వెనక్కి నెట్టింది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో తానూ ఉన్నానంటూ ముందుకు వచ్చింది.PC: ICCమిగిలినవి గెలిస్తేరెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా ఖాతాలో 40 పాయింట్లు(ఏడింట మూడు గెలుపు, మూడు ఓటమి, ఒకటి డ్రా) ఉన్నాయి. విజయాల శాతం 47.62. ఈ సీజన్లో సౌతాఫ్రికాకు ఇంకా ఐదు టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటన్నింటిలో గెలిచిందంటే కచ్చితంగా టాప్-2కు చేరుకునే అవకాశం ఉంటుంది. టీమిండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా నాలుగు గెలిచినా రేసులో ఉండగలుగుతుంది.డేంజర్లో టీమిండియాకాబట్టి టీమిండియా తమ అగ్రస్థానానికి ముప్పు రాకుండా చూసుకోవాలంటే కివీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో తప్పక గెలవడంతో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో కనీసం రెండు టెస్టుల్లో విజయం సాధించాలి. ఇక సౌతాఫ్రికా తదుపరి బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు ఆడటంతో పాటు శ్రీలంకతో రెండు, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇక పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరతాయన్న విషయం తెలిసిందే. 2019-21, 2021-23 సీజన్లలో భారత్ ఫైనల్ చేరినా.. ఆయా ఎడిషన్లలో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకున్నాయి. చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
బంగ్లా ఆల్‌రౌండర్ విశ్వరూపం.. సౌతాఫ్రికాకు షాకిచ్చేలా!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు(2) తీయడంతో పాటు బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. మిరాజ్ సూపర్ బ్యాటింగ్ కారణంగానే బంగ్లా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుని మళ్లీ పోటీలోకి వచ్చే స్థితిలో నిలిచింది.106 పరుగులకే ఆలౌట్‌కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సోమవారం ఢాకా వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ప్రొటిస్ బౌలర్ల ధాటికి నిలవలేక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట్ అయింది. 202 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికాసౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. డేన్ పీడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 308 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కంటే 202 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(1), వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఈ దశలో మరో ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 40 పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(23) అతడికి సహకరించాడు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(33) స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడగా.. వికెట్ కీపర్ లిటన్ దాస్ 7 పరుగులకే అవుటయ్యాడు.మిరాజ్ మిరాకిల్ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలయ్యే దుస్థితిలో బంగ్లాదేశ్ ఉన్న వేళ మెహదీ హసన్ మిరాజ్ ఆపద్భాందవుడిగా ఆదుకున్నాడు. ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఊహించని రీతిలో సౌతాఫ్రికా బౌలర్లకు షాకిచ్చాడు.తన బ్యాటింగ్ విశ్వరూపం ప్రదర్శిస్తూ.. అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 171 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ సైతం హాఫ్ సెంచరీ(58)తో రాణించాడు.సరికొత్త రికార్డుఈ క్రమంలో వీరిద్దరు కలిసి సౌతాఫ్రికాపై సరికొత్త రికార్డు నెలకొల్పారు. 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్నర్షిప్ సాధించిన జోడీగా మెహదీ హసన్ మిరాజ్- జాకిర్ అలీ నిలిచారు. ఈ సందర్భంగా హబీబుల్ బషార్- జావేద్ ఒమర్(131 రన్స్) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశారు.ఎట్టకేలకు లీడ్లోకిఇదిలా ఉంటే.. బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి మిరాజ్ 87, నయీం హసన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ 85 ఓవర్ల ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి.. 81 పరుగుల లీడ్‌లోకి వచ్చింది. ఇక బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
రబాడ దెబ్బకు ముష్ఫికర్‌కు ఫ్యూజులు ఔట్..!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పట్టు బిగించింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా ఒక్క పరుగు వెనుకపడి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టెక్కలేదు. ఆ జట్టు చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండున్నర రోజులకు పైగా ఆట మిగిలి ఉంది. మెహిది హసన్ (55), జాకెర్ అలీ (30) బంగ్లాదేశ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఔటైతే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైనట్టే.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసి 202 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కైల్ వెర్రిన్ అద్బుతమైన సెంచరీ (114) చేసి సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.THE SOUND. 🔊THE DELIVERY. 🥶KAGISO RABADA, YOU BEAUTY...!!!pic.twitter.com/ZuVxm1ovxq— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024రబాడ దెబ్బ.. ముష్ఫికర్ అబ్బ..!ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్ రబాడ బంగ్లాదేశ్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా వెటరన్ ముష్ఫికర్ రహీం పాలిట విలన్ అయ్యాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రబాడ ముష్ఫికర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ క్లీన్ బౌల్డ్ అయిన తీరు ఎలా వైరల్ అయ్యిందో.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సీన్ కూడా అలాగే వైరలవుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రబాడ సంధించిన ఇన్ స్వింగర్ దెబ్బకు ముష్ఫికర్ మిడ్ వికెట్ గాల్లో పల్టీలు కొట్టింది. ఈ సీన్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. కాగా, రబాడ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నేలకూల్చాడు. చదవండి: కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..? -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం
అక్టోబర్ 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. బవుమా స్థానంలో యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తొలి టెస్ట్‌కు ఎంపికయ్యాడు. బ్రెవిస్‌కు టెస్ట్ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. తొలి టెస్ట్‌కు దూరమైనప్పటికీ బవుమా జట్టుతో పాటే ప్రయాణిస్తాడు. రెండో టెస్ట్ సమయానికి బవుమా కోలుకుంటాడని క్రికెట్ సౌతాఫ్రికా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్ మార్క్రమ్ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు ఇదే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన నండ్రే బర్గర్ సైతం గాయపడ్డాడు. అతని స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. అప్డేట్ చేసిన జట్టు వివరాలను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (అక్టోబర్ 11) వెల్లడించింది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రేన్నేబంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్..తొలి టెస్ట్ (అక్టోబర్ 21-25, ఢాకా)రెండో టెస్ట్ (అక్టోబర్ 29-నవంబర్ 2, చట్టోగ్రామ్)చదవండి: పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో) -
Ban vs SA: సౌతాఫ్రికా జట్టుకు బిగ్ షాక్!
సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేలతో పాటు.. బంగ్లాదేశ్ పర్యటనకూ దూరమయ్యాడు. కాగా సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది.అక్కడ ఐర్లాండ్‌తో రెండు టీ20లు ప్రొటిస్ జట్టు.. సిరీస్‌ను 1-1తో కలిసి ప్రత్యర్థితో పంచుకుంది. ఈ క్రమంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్‌లో 139 పరుగులతో ఐరిష్ జట్టును చిత్తు చేసిన సౌతాఫ్రికా.. శుక్రవారం రెండో వన్డేలో తలపడుతోంది.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరంఅయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే క్రికెట్ సౌతాఫ్రికా నండ్రే బర్గర్ గాయం గురించి వెల్లడించింది. ఈ పేసర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని.. దీంతో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపింది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా బర్గర్ అందుబాటులో ఉండకపోవచ్చని... త్వరలోనే అతడి స్థానాన్ని వేరొక ఆటగాడితో భర్తీ చేస్తామని పేర్కొంది.టీమిండియాతో సిరీస్‌లతో అరంగేట్రంకాగా ఐర్లాండ్‌తో తొలి వన్డేలోనూ బర్గర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక గతేడాది డిసెంబరులో టీమిండియాతో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నండ్రే బర్గర్.. అదే నెలలో వన్డే, టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐదు వన్డేల్లో ఆరు, రెండు టీ20లలో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా వన్డే చాలెంజ్ టోర్నీలో రాణించిన 29 ఏళ్ల నండ్రే బర్గర్.. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్-2024లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా జట్టులోనూ రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా సౌతాఫ్రికా జట్టు అక్టోబరు 16న బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది.రెండు టెస్టులుఇరు జట్ల మధ్య అక్టోబరు 21- నవంబరు 2 వరకు రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందుకు సంబంధించి సౌతాఫ్రికా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేసర్లు దూరమయ్యారు. తాజాగా బర్గర్ కూడా దూరం కావడం ప్రభావం చూపవచ్చు.బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రెకల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్).చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
నువ్వేమీ హెడెన్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి: సెహ్వాగ్
‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.షార్ట్ బాల్‌ను కూడా పుల్ షాట్ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్వో లేదంటే ఆడం గిల్క్రిస్ట్వో కాదు. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.హుక్ లేదంటే పుల్ షాట్ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో షకీబ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్-డిలో భాగమైన బంగ్లాదేశ్ సోమవారం నాటి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ అల్ హసన్ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్‌కు యత్నించి అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.జట్టులో సీనియర్ ఆటగాడైన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్‌బజ్ షోలో షకీబ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే! ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 గ్రూప్-డిలో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది.చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్ గనుక వదిలేసి ఉంటే.. -
నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క క్యాచ్‌తో అంతా తలకిందులు.. వీడియో
టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డిలో భాగమైన ప్రొటిస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసింది.తొలుత శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన మార్క్రమ్ బృందం.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పనిపట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించి.. గ్రూప్-డి టాపర్‌గా నిలిచింది.ఇక తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. చివరికి పైచేయి సాధించింది. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నజ్ముల్ షాంటో బృందాన్ని ఓడించిన సౌతాఫ్రికా.. ఈ ఎడిషన్‌లో సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.న్యూయార్క్ వేదికగా ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(18) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(4) పూర్తిగా నిరాశపరిచారు.నాలుగో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో ఉన్న సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్ గట్టెక్కించాడు.తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో 46 పరుగులు సాధించాడు క్లాసెన్. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్(29) రాణించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఇక లక్ష్యం స్వల్పంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌కు అనుకూలించని న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. టాపార్డర్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(14) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. తౌహీద్ హృదయ్(37), మహ్మదుల్లా(20) బంగ్లా శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించారు.సౌతాఫ్రికాపై గెలవాలంటే ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. కేవలం ఆరు పరుగులే వచ్చాయి. అయితే, ఈ ఓవర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.డెత్ ఓవర్లో మార్క్రమ్ తమ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేతికి బంతినివ్వగా.. అతడు వైడ్‌తో ఆరంభించాడు. దీంతో బంగ్లా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులుగా మారింది.ఈ క్రమంలో మహ్మదుల్లా 1, జాకిర్ అలీ 2 పరుగులు తీయగా.. నాలుగు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మహరాజ్ బౌలింగ్‌లో జాకిర్ అలీ(8) ఇచ్చిన క్యాచ్‌ను మార్క్రమ్ ఒడిసిపట్టాడు.ఆ తర్వాతి బంతికి లెగ్‌బై రూపంలో ఒక పరుగు రాగా.. రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మహరాజ్ బౌలిండ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకోగా.. మహ్మదుల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా టస్కిన్ అహ్మద్ ఒక్కటి మాత్రమే తీయగలిగాడు.చదవండి: జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. నిజానికి మార్క్రమ్ గనుక మహ్మదుల్లా క్యాచ్ వదిలేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా తన కెప్టెన్సీ, అద్బుత ఫీల్డింగ్‌తో మార్క్రమ్ సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: ‘సూపర్–8’కు దక్షిణాఫ్రికా
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్‌గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్‌లో నేడుపాకిస్తాన్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: అతడిని రిటైర్ కాకుండా చూడాలని పిటిషన్ వేస్తా: భారత మాజీ బ్యాటర్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ మూడు సెంచరీలు బాదాడు. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకపై శతక్కొట్టిన డికాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ 109 పరుగులు సాధించాడు. ఇలా మెగా టోర్నీ మొదట్లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే, బంగ్లాదేశ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు డికాక్. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అద్భుతమైన షాట్లతో అలరిస్తూ ప్రేక్షకులకు టీ20 మాదిరి వినోదం అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేసిన డికాక్.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా శరీరం సహకరించకపోవడం.. ఇకపై లీగ్ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి సారించే క్రమంలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు క్వింటన్ డికాక్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్ అవ్వబోతున్నట్లు.. టోర్నీ ఆరంభానికి ముందే డికాక్ తెలియజేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి బ్యాటింగ్ సూపర్. తన అద్భుతమైన నైపుణ్యాలతో అదరగొట్టాడు. నేనైతే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ పిటిషన్ సమర్పించాలనుకుంటున్నా. వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత డికాక్ రిటైర్ అవకుండా చూడాలని హామీ ఇమ్మని కోరతా. ఎందుకంటే.. అతడు రిటైర్ అయిపోతే.. 50 ఓవర్ల క్రికెట్లో ఇలాంటి మజాను మనకు ఎవరు అందిస్తారు?’’ అంటూ కామెంటేటర్ మంజ్రేకర్ సౌతాఫ్రికా బ్యాటర్‌ను ఆకాశానికెత్తాడు. ఇందుకు స్పందించిన మరో కామెంటేటర్, సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ సైతం.. ‘‘అవును.. తను వయసులో ఇంకా చిన్నవాడే. అంతేకాదు.. కెరీర్లో ఇప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడు. కానీ ప్రపంచ క్రికెట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో డికాక్‌తో పాటు చాలా మంది ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నువ్వు పిటిషన్ వేస్తానంటే నేను కూడా దానిపై తప్పకుండా సంతకం చేస్తా’’ అని సంజయ్ మంజ్రేకర్‌తో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ముంబై మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు
‘‘ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చెప్పలేను. చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ.. ఆ విషయాల గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఏం జరుగుతుందో తెలియలేదు. బహుశా.. నేనిలా ముందుకు సాగాలనే ఆ అల్లా నాకు ధైర్యాన్నిచ్చాడేమో! ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూ మరింత కఠిన శ్రమకోరుస్తున్నాను. నేను చేయగలిగింది అంతే కదా! జట్టు విజయాల్లో నా పాత్ర ఉండాలని కోరుకుంటాను. నిజానికి నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే విశ్రాంతినిచ్చారు. అయినా నా చేతుల్లో ఏమీలేదు. అంతా మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ నేను నా పనిని నిజాయితీగా పూర్తి చేస్తే నాతో పాటు జట్టుకు కూడా మేలు జరుగుతుంది’’ అని బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అన్నాడు. విశ్రాంతి పేరిట తనను చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితం చేశారంటూ సెలక్టర్లకు పరోక్షంగా చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాను ప్రొటిస్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ మహ్మదుల్లా పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. సౌతాఫ్రికా విధించిన 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కనీసం రెండంకెల స్కోరు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ షాంటో సున్నాకే పరిమితమయ్యాడు. ఇక మిడిలార్డర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మదుల్లా సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111 బంతులు ఎదుర్కొని 111 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు సహా 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే, మిగతా ఆటగాళ్ల నుంచి ఏమాత్రం సహకారం లభించకపోవడంతో మహ్మదుల్లా ఒంటరి పోరాటం వృథాగా పోయింది. సౌతాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా మాట్లాడుతూ.. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పనిలో పనిగా సెలక్టర్లతో పాటు తనను విమర్శించిన వాళ్లకు ఆటతోనే బదులిస్తానంటూ 37 ఏళ్ల మహ్మదుల్లా కౌంటర్లు వేశాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు మహ్మదుల్లాను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అతడికి తిరిగి జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023 టీమ్‌లో స్థానం సంపాదించిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 3 శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐపీఎల్ ఆడిన అనుభవం కలిసొచ్చింది.. అతడు మాత్రం అద్బుతం: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ప్రోటీస్.. అనంతరం బౌలింగ్‌లో బంగ్లాకు చుక్కలు చూపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగగా.. హెన్రిస్ క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేయగా.. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. అనంతరం 383 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మహ్మదుల్లా 111 బంతుల్లో 111 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు సాధించగా.. జానెసన్, విలియమ్స్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంపై ప్రోటీస్ తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రామ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన పట్ల మార్క్రామ్ సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ మెగా టోర్నీలో మరో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మొదట బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో మేము పైచేయి సాధించాం. మాకు ఎటువంటి డెత్ బౌలింగ్ సమస్య లేదు. ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో మా బౌలర్లు కొంచెం అదనంగా పరుగులు సమర్పించుకున్నారు. ఎందుకంటే అవతలి ఎండ్‌లో మహ్మదుల్లా క్రీజులో సెటిల్ అయివున్నాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మా డెత్ బౌలింగ్ ప్రణాళికలను అమలు చేయడానికి అదే సరైన సమయమని భావించాడు. కానీ అతడు మా బౌలర్లపై కాస్త పైచేయి సాధించాడు. ఇక బ్యాటింగ్‌లో డికాక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మా జట్టులో చాలా కీలకం. అదే విధంగా క్లాసెన్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. మాకు అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. మా బ్యాటింగ్ లైనప్ టాప్ 6లో ఉన్న ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రతీ ఒక్కరి రోల్ క్లియర్‌గా ఉంది. ఇక బావుమా ప్రస్తుతం కోలుకున్నాడు. అతడు పాకిస్తాన్‌తో జరిగే మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా మాకు బాగా కలిసొచ్చిందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్క్రామ్ పేర్కొన్నాడు. -
డికాక్, క్లాసెన్ విధ్వంసం.. బంగ్లాదేశ్ టార్గెట్ 383 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. అతడితో పాటు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్, షోర్ఫుల్ ఇస్లాం, షకీబ్ తలా వికెట్ సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తన కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడుతున్న డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌పై డికాక్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్ బౌలర్లను డికాక్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచతూచి ఆడిన క్వింటన్.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో డికాక్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఇది వన్డేల్లో అతడికి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమానార్హం. డికాక్ అరుదైన రికార్డు.. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డికాక్ ఓ అరుదైన ఘనతను తన పేరిటి లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గిల్‌క్రిస్ట్ 149 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్‌క్రిస్ట్ రికార్డును డికాక్(174) బ్రేక్ చేశాడు. చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. తుది జట్లు ఇవే
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ముంబై వేదికగా దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా దూరమయ్యాడు. అతడి స్ధానంలో మార్క్రమ్ సారథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు పేసర్ లుంగీ ఎంగిడీ గాయం కారణంగా దూరం కాగా.. విలియమ్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. తాహిద్ హృదయ్ స్ధానంలో షకీబ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్ దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లిజాడ్ విలియమ్స్ -
10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా వుమెన్స్ జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా 30 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శోభనా మోస్త్రే 27 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఓపెనర్లు లారా వోల్వార్డట్ 66 నాటౌట్, తజ్మీన్ బ్రిట్స్ 50 నాటౌట్ రాణించి 17.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. అయితే దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తుందని ఎవరు ఊహించలేదు. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించిన గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఫెవరెట్‌గా పరిగణించగా.. ఆసీస్ తన ఆటతీరుతో మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగా.. రెండో స్థానం కోసం కివీస్, సౌతాఫ్రికా, శ్రీలంకల మధ్య పోటీ ఎదురైంది. ముఖ్యంగా న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవడం కొంపముంచింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై పది వికెట్ల తేడాతో విజయం అందుకున్న ప్రొటీస్ రన్‌రేట్‌ను అమాంతం పెంచుకొని రెండో స్థానంలో నిలిచింది. మూడు జట్లు(కివీస్, ప్రొటీస్, లంక) నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికి.. లంక రన్‌రేట్ మైనస్‌లో ఉండగా.. కివీస్ రన్‌రేట్ +0.138గా ఉంది. అయితే సౌతాఫ్రికా +0.738 రన్‌రేట్‌తో మెరుగ్గా ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఇక సెమీఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరగనుండగా.. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచిన జట్లు ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్లో కత్తులు దూసుకోనున్నాయి. చదవండి: వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది -
అదృష్టం ఈ కెప్టెన్ దే.... ఆడేదేలే అయినా ఓడేదేలే
-
మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు!
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh- Sidney: టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం కొనసాగుతోంది. ప్రపంచకప్-2022లో భాగంగా సిడ్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కాగా గత కొంతకాలంగా పొట్టి క్రికెట్లో బవుమా పూర్తిగా తేలిపోతున్న సంగతి తెలిసిందే. దారుణ ప్రదర్శన గత ఏడు ఇన్నింగ్స్‌లో టీ20 ఫార్మాట్లో బవుమా చేసిన పరుగులు వరుసగా... 8, 8*, 0, 0, 3, 2*, 2. అంతేకాదు మొత్తంగా ఇప్పటి వరకు 31 అంతర్జాతీయ టీ20లు ఆడిన బవుమా సాధించిన పరుగులు 571. అత్యధిక స్కోరు 72. హాఫ్ సెంచరీ ఒకటి. ఇక వన్డేల్లోనూ 20 మ్యాచ్‌లలో అతడు సాధించిన పరుగులు 730. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో బవుమా అత్యధిక స్కోరు 113. టెస్టుల విషయానికొస్తే 51 మ్యాచ్‌లలో 2612 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నువ్వు కెప్టెన్ కదా! కాగా బంగ్లాతో మ్యాచ్‌లో బవుమా మరోసారి నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘బవుమా అద్భుత ఫామ్ కొనసాగుతోంది. సూపర్‌గా ఆడుతున్నాడు. 31 అంతర్జాతీయ టీ20లలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లు.. సారథిగా భేష్.. అయినా పాపం ఇంత ఘోరంగా ఆడే ఓ క్రికెటర్ ఈ భూమ్మీద కెప్టెన్‌గా ఉండగలడా?’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, బ్యాటర్‌గా విఫలమవుతున్నా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు 20 మ్యాచ్‌లకు టీ20లకు సారథిగా వ్యవహరించిన బవుమా.. 13 గెలిచాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అతడి అభిమానులు ట్రోల్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బంగ్లాతో మ్యాచ్‌లో రిలీ రోసో, క్వింటన్ డికాక్ రాణించడంతో సహా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనరచడంతో బవుమా బృందం 104 పరుగుల భారీ తేడాతో గెలిచింది. కాగా గతేడాది కెప్టెన్సీ చేపట్టిన బవుమా.. ఈ ఘనత సాధించిన తొలి బ్లాక్ ఆఫ్రికన్‌గా చరిత్రకెక్కాడు. చదవండి: Rilee Rossouw: అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించిన రోసో.. అరుదైన ఘనతలు టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు The curious case of Temba Bavuma.. 51 Tests - 1 Hundred... 30 T20Is - 1 Fifty, 115 SR.. How on the earth he is in Team, even T20I Captain 🤷🏻♂️ #tembabavuma #SAvsBAN #BANvSA #ICCT20WorldCup #ICCT20WorldCup2022 pic.twitter.com/UmhNosRXVG — Anil R Pradhan (@anilrpradhan) October 27, 2022 Temba Bavuma in the last 7 innings in T20I: 8(10), 8*(11), 0(4), 0(7), 3(8), 2*(2) & 2(6). — Johns. (@CricCrazyJohns) October 27, 2022 Excellent Form for Temba Bavuma Continues. Dismissed for 2 runs on 6 balls. I will Delete my Twitter if he ever scores a 35 or less balls Half Century against any team in T20s. — Afsha (@AfshaCricket) October 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022: ‘తొలి’ సెంచరీ.. రికార్డులు సృష్టించిన రోసో.. అరుదైన ఘనతలు
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా రోసోకు అంతర్జాతీయ టీ20లలో ఇది వరుసగా రెండో సెంచరీ. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరి టీ20లో అతడు 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగి మరోసారి శతకం బాదాడు. ఇక సిడ్నీ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోసో.. టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్(తొలి రెండు స్థానాలు), బ్రెండన్ మెకల్లమ్ తర్వాతి స్థానం ఆక్రమించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్లు 1. క్రిస్‌గేల్- 47 బంతుల్లో- 2016- 2. క్రిస్‌గేల్- 50 బంతుల్లో- 2007 3. బ్రెండన్ మెకల్లమ్- 51 బంతుల్లో- 2012 4. రిలీ రోసో- 52 బంతుల్లో-2022 అరుదైన ఘనత ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రోసో. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 1. బ్రెండన్ మెకల్లమ్- 123 పరుగులు 2. క్రిస్‌గేల్- 117 పరుగులు 3. అలెక్స్ హేల్స్- 116 నాటౌట్ 4. అహ్మద్ షెహజాద్- 111 నాటౌట్ 5. రిలీ రోసో- 109 పరుగులు చదవండి: IND vs NED: నెదర్లాండ్స్ జట్టులో వాళ్లతో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతి? T20 World Cup 2022: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. ఫైనల్ ఆ రెండు జట్లే మధ్యే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
ఇటీవలీ కాలంలో క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత దేశంలో సిరీస్ ఆడుతున్న జట్టుకు అక్కడి లోకల్ అంపైర్స్ మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థి జట్లు సిరీస్‌లు కోల్పోయేలా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది పక్కనబెడితే.. తాజాగా ఐసీసీ అంపైరింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు ఉన్న న్యూట్రల్ అంపైర్(తటస్థ అంపైర్) విధానాన్ని ఐసీసీ తిరిగి తీసుకురానుంది. దీనివల్ల పక్షపాత ధోరణి అనే పదానికి చెక్ పెట్టినట్లు అవుతుందని ఐసీసీ చైర్మెన్ గ్రేగ్ బార్క్లే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి కరోనా ముందు న్యూట్రల్ అంపైరింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. న్యూట్రల్ అంపైరింగ్ అంటే ఒక దేశం మరొక దేశంలో సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు లోకల్ అంపైర్లతో పాటు బయటి దేశాలకు చెందిన అంపైర్లు ఫీల్డ్ అంపైర్స్‌గా వ్యవహరించేశారు. అయితే 2020లో కరోనా మహమ్మారి విజృంభించడంతో బయటి దేశాల అంపైర్లపై ట్రావెల్‌పై బ్యాన్ విధించడంతో న్యూట్రల్ అంపైరింగ్ వ్యవస్థకు బ్రేక్ పడింది. అప్పటినుంచి ఏ దేశంలో సిరీస్‌లు జరిగినా ఆ దేశానికి చెందిన వ్యక్తులు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే బంగ్లాదేశ్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది.ఈ టూర్లో సౌతాఫ్రికాకు చెందిన అంపైర్లు మరియస్ ఎరాస్మస్, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్‌లు తమ తప్పుడు నిర్ణయాలతో పక్షపాత ధోరణి చూపించారంటూ విమర్శలు వచ్చాయి. చాలా మంది బంగ్లా ఆటగాళ్ల ఔట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. దీనివల్ల జట్టు ఓటమిపై ప్రభావం చూపిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే న్యూట్రల్ అంపైరింగ్ లేకపోవడం వల్ల.. లోకల్ అంపైర్స్ నిర్ణయాలు తమ కొంప ముంచాయంటూ షకీబ్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. షకీబ్ కామెంట్స్ తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లోకల్ అంపైరింగ్ పక్షపాత ధోరణిపై ఐసీసీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తమ స్వదేశంలో లంకతో ఆడుతున్న సిరీస్‌లో న్యూట్రల్ అంపైర్‌ను ఐసీసీ తాత్కాలికంగా ప్రవేశపెట్టింది. స్థానిక అంపైర్ షర్ఫుద్దౌలాతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, వెస్టిండీస్‌కు చెందిన జోయెల్ విల్సన్‌లను అంపైర్లుగా నియమించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తొందరలోనే న్యూట్రల్ అంపైరింగ్‌ను పూర్తి స్థాయిలో తిరిగి తీసుకురానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. చదవండి: IND Vs SA T20 Series: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? Kusal Mendis: మ్యాచ్ జరుగుతుండగానే ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ ఏప్రిల్ విజేత ఎవరంటే!
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఏప్రిల్ నెలకు గానూ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేశవ్ మహరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌లలో కలిపి అతడు మొత్తంగా 16 వికెట్లు తీశాడు. తద్వారా దక్షిణాఫ్రికా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుపొందాడు. ఇక ఇదే సిరీస్‌లో దక్షిణాఫ్రికా మరో ఆటగాడు సిమోన్ హార్మర్ కూడా ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు. మరోవైపు ఒమన్ ఓపెనర్ జతిందర్ సింగ్ కూడా ఏప్రిల్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్2లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 259 పరుగులు చేసి పోటీలో నిలిచాడు. అయితే, వీరందరినీ దాటుకుని కేశవ్ మహరాజ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ బ్యాటర్, ప్రస్తుత వోటింగ్ పానెల్ సభ్యుడు జేపీ డుమిని కేశవ్‌పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. చదవండి: Devon Conway: కాన్వే జోరు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరంటే? 7️⃣ wickets at Keshav Maharaj's home ground💚 🇿🇦 #SAvBAN #BetwayTestSeries #BePartOfIt | @Betway_za pic.twitter.com/cIcqpKD50Q — Cricket South Africa (@OfficialCSA) April 4, 2022 -
SA Vs Ban: 332 పరుగులతో ఘనవిజయం.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
Bangladesh tour of South Africa 2022- కెబెర్హా (దక్షిణాఫ్రికా): బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో సఫారీ జట్టు 332 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆతిథ్య స్పిన్నర్లు కేశవ్ మహరాజ్ (7/40), సైమన్ హార్మర్ (3/34) రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పది వికెట్లను పంచుకున్నారు. వీళ్లిద్దరు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కేశవ్ 7, హార్మెర్ 3 వికెట్లను పడగొట్టారు. 413 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 27/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (27), మెహదీ (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయనేలేదు. కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో... అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ‘కోవిడ్–19’ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల నిబంధన అమలు చేశారు. సఫారీ ఆటగాళ్లు సారెల్ ఎర్వి, వియాన్ మల్డర్లకు సోమవారం టెస్టులో పాజిటివ్ రావడంతో ఖయా జొండో, గ్లెంటన్ స్టుర్మన్లను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. 🏏 RESULT | #Proteas WIN BY 332 RUNS Keshav Maharaj claimed 7/40 in the second innings as the #Proteas romped to victory in the first hour of Day 4 to secure the #BetwayTestSeries over Bangladesh#SAvBAN #BePartOfIt | @Betway_za pic.twitter.com/47W7F5iNpe — Cricket South Africa (@OfficialCSA) April 11, 2022 -
దక్షిణాఫ్రికాపై చరిత్ర సృష్టించిన మహ్మదుల్ హసన్.. తొలి ఆటగాడిగా!
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్ హసన్ జాయ్ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా మహ్మదుల్ బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 326 బంతుల్లో 137 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 220 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 53 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 7 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. కాగా కింగ్స్‌మీడ్ మైదానంలో(డర్బన్) టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇంతకముందు డర్బన్‌లో టీమిండియా 66 పరుగులకే ఆలౌటైంది. స్కోర్లు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 367/10 బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 298/10 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 204/10 బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 53/10 చదవండి: SA vs BAN: భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డు బంగ్లాకు బదిలీ.. ప్రొటీస్ అద్భుత విజయం -
టెస్టు క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ దాటికి 54 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును నమమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ విజయం ద్వారా పలు రికార్డులను నమోదు చేసింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు అన్ని వికెట్లను ఇద్దరు బౌలర్లు మాత్రమే పడగొట్టారు. కేశవ్ మహరాజ్ ఏడు వికెట్లు తీయగా.. సిమోన్ హార్మర్ మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ►రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు బౌలింగ్ మొత్తం కేశవ్ మహరాజ్, సిమోన్ హార్మలు పంచుకోవడం విశేషం. ఒక ఇన్నింగ్స్ మొత్తంలో ఓవర్లు మొత్తం ఇద్దరు బౌలర్లే పంచుకోవడం.. అన్ని వికెట్లు వారిద్దరే తీయడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 28వ సారి. ►కాగా సౌతాఫ్రికాకు మాత్రం ఇది మొదటిసారి. ఒక ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లే 10 వికెట్లు తీయడం కూడా ప్రొటీస్ క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అలా సౌతాఫ్రికా జట్టు ఒక అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ►బంగ్లాదేశ్ ప్రొటీస్ గడ్డపై చెత్త రికార్డు నమోదు చేసింది. కింగ్స్‌మీడ్ మైదానంలో(డర్బన్) టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ►తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్టులో 54 పరుగులకు ఆలౌటైంది. ఇంతకముందు 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: SA vs BAN: భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డు బంగ్లాకు బదిలీ.. ప్రొటీస్ అద్భుత విజయం -
భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డు బంగ్లాకు బదిలీ.. ప్రొటీస్ అద్భుత విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 54 పరుగులకే ఆలౌటై 220 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేశవ్ మహరాజ్(10-0-32-7) బౌలింగ్ దాటికి విలవిల్లాలాడిన బంగ్లా బ్యాట్స్మెన్లలో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ మార్క్‌ను సాధించగా.. మిగతా తొమ్మిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం విశేషం. కాగా రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ అన్ని వికెట్లను ఇద్దరు బౌలర్లు మాత్రమే పడగొట్టడం విశేషం. కేశవ్ మహరాజ్ ఏడు వికెట్లు తీయగా.. సిమోన్ హార్మర్ మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకో విశేషమేమిటంటే రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్‌కు బౌలింగ్ కూడా ఈ ఇద్దరే వేశారు. ఒక ఇన్నింగ్స్ మొత్తం ఓవర్లు ఇద్దరు బౌలర్లే వేయడం సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రొటీస్ గడ్డపై చెత్త రికార్డు నమోదు చేసింది. కింగ్స్‌మీడ్ మైదానంలో(డర్బన్) టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇంతకముందు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉంది. 1996-97 డర్బన్ టెస్టులో టీమిండియా 66 పరుగులకే ఆలౌటైంది. తాజాగా ఈ రికార్డు బంగ్లాదేశ్‌కు బదిలీ అయింది. బంగ్లాకు టెస్టుల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో బంగ్లాదేశ్ 43 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకుంది. కాగా దక్షిణాఫ్రికా డర్బన్ వేదికగా 2013 తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. ఈ 9 ఏళ్లలో జరిగిన 10 టెస్టుల్లో ఒక్కదాంట్లో కూడా సౌతాఫ్రికా విజయం సాధించకపోవడం విశేషం. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో సౌతాఫ్రికా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఏప్రిల్ 8 నుంచి 12 వరకు పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరగనుంది. చదవండి: World Cup 2022: భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..! సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్.. భావోద్వేగానికి లోనవుతూ..!