మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా వుమెన్స్ జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా 30 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శోభనా మోస్త్రే 27 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఓపెనర్లు లారా వోల్వార్డట్ 66 నాటౌట్, తజ్మీన్ బ్రిట్స్ 50 నాటౌట్ రాణించి 17.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు.
అయితే దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తుందని ఎవరు ఊహించలేదు. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించిన గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఫెవరెట్‌గా పరిగణించగా.. ఆసీస్ తన ఆటతీరుతో మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగా.. రెండో స్థానం కోసం కివీస్, సౌతాఫ్రికా, శ్రీలంకల మధ్య పోటీ ఎదురైంది. ముఖ్యంగా న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవడం కొంపముంచింది.
అదే సమయంలో బంగ్లాదేశ్‌పై పది వికెట్ల తేడాతో విజయం అందుకున్న ప్రొటీస్ రన్‌రేట్‌ను అమాంతం పెంచుకొని రెండో స్థానంలో నిలిచింది. మూడు జట్లు(కివీస్, ప్రొటీస్, లంక) నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికి.. లంక రన్‌రేట్ మైనస్‌లో ఉండగా.. కివీస్ రన్‌రేట్ +0.138గా ఉంది. అయితే సౌతాఫ్రికా +0.738 రన్‌రేట్‌తో మెరుగ్గా ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చింది.
ఇక సెమీఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరగనుండగా.. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచిన జట్లు ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్లో కత్తులు దూసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment