Women T20 World Cup 2023
-
కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్యాటర్ బ్యాక్‌ఫుట్ షాట్ ఆడింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కీపర్ సిద్రా నవాజ్‌కు త్రో విసిరింది. అయితే కీపర్ నవాజ్ తన చేతికున్న గ్లోవ్స్‌ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్‌కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్ నవాజ్ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్‌కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కీపర్ ఓవర్ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్‌పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: పాక్ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్ -
10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా వుమెన్స్ జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా 30 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శోభనా మోస్త్రే 27 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఓపెనర్లు లారా వోల్వార్డట్ 66 నాటౌట్, తజ్మీన్ బ్రిట్స్ 50 నాటౌట్ రాణించి 17.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. అయితే దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తుందని ఎవరు ఊహించలేదు. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించిన గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఫెవరెట్‌గా పరిగణించగా.. ఆసీస్ తన ఆటతీరుతో మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగా.. రెండో స్థానం కోసం కివీస్, సౌతాఫ్రికా, శ్రీలంకల మధ్య పోటీ ఎదురైంది. ముఖ్యంగా న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవడం కొంపముంచింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై పది వికెట్ల తేడాతో విజయం అందుకున్న ప్రొటీస్ రన్‌రేట్‌ను అమాంతం పెంచుకొని రెండో స్థానంలో నిలిచింది. మూడు జట్లు(కివీస్, ప్రొటీస్, లంక) నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికి.. లంక రన్‌రేట్ మైనస్‌లో ఉండగా.. కివీస్ రన్‌రేట్ +0.138గా ఉంది. అయితే సౌతాఫ్రికా +0.738 రన్‌రేట్‌తో మెరుగ్గా ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఇక సెమీఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరగనుండగా.. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచిన జట్లు ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్లో కత్తులు దూసుకోనున్నాయి. చదవండి: వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది -
వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో పోరుకు దూరంగా ఉన్న మంధాన ఆ తర్వాత వరుసగా రెండు అర్థసెంచరీలతో చెలరేగింది. ముఖ్యంగా ఐర్లాండ్‌తో జరిగిన చివరి లీగ్‌లో మ్యాచ్‌లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది మంధాన. 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. మ్యాచ్‌లో మంధాన గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడడం విశేషం. లెఫ్ట్ హ్యాండర్ అయిన స్మృతి మంధాన పుల్ షాట్స్, కవర్ డ్రైవ్, లాఫ్టడ్ ఆఫ్ డ్రైవ్స్‌తో అభిమానులకు కనువిందు కలిగించింది. తాజాగా మంధాన ఆటను గంగూలీతో పోలుస్తూ ఐసీసీ షేర్ చేసిన వీడియో ఆసక్తి కలిగించింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫ్రంట్‌ఫుట్ వచ్చి కొట్టే సిక్సర్‌కు అయితే లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మంధాన ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో యాదృశ్చికమో లేక అలా జరిగిందో తెలియదు కానీ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది. ఆఫ్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, స్ట్రెయిట్ షాట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింట్లోనూ దాదా స్టైల్‌ను అచ్చు గుద్దింది మంధాన. ఐసీసీ వీడియోను చూసిన అభిమానులు మళ్లీ దాదా ఆటను గుర్తుచేసింది.. అంటూ కామెంట్ చేశారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఐర్లాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో విజయం అందుకున్న టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 23న(గురువారం) పటిష్టమైన ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడనుంది. బలమైన ఆసీస్‌ను టీమిండియా మట్టి కరిపిస్తే గనుక కచ్చితంగా ఈసారి ట్రోఫీ మనదే అని అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ అనగానే మొదటగా వచ్చే పేరు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా. పురుషులు క్రికెట్ ఆధిపత్యంలో మహిళల క్రికెట్ కెప్టెన్ సంగతి మరిచిపోతున్నాం. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం మహిళల టి20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23న జరగనున్న తొలి సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది భారత మహిళల జట్టు. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. 150 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన వేళ మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ హర్మన్‌ప్రీత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''గూగుల్‌కు వెళ్లి ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎవరు అని వెతికితే హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ సమస్యను మనమే సృష్టిస్తే.. దానిని పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. మహిళల క్రికెట్ కోసం అది చేద్దాం.#IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit ఈ పదాలను అన్నింటిలో షేర్ చేసి చక్కదిద్దుకుందాం.'' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువరాజ్ చేసిన ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది. నిజమే టీమిండియా మహిళల క్రికెట్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈసారి మహిళల జట్టు టి20 వరల్డ్‌కప్ కొట్టాలని కోరుకుందాం. యువీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా యువరాజ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సేమ్ వీడియోను షేర్ చేశాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత మహిళల జట్టు లీగ్ దశలో ఇంగ్లండ్ చేతిలో మినహా మిగతా అన్నింటిలోనూ విజయాలు సాధించింది. సోమవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు ఎంటరైంది. If we’ve created this problem, we also have the power to fix it. Let’s do it for women’s cricket! 🏏💪🏻 Use this hashtag: #IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit to spread the word and make a difference! 🇮🇳 pic.twitter.com/JMn5Cw7Cel — Yuvraj Singh (@YUVSTRONG12) February 21, 2023 -
'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్'
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా స్టార్ స్మృతి మంధాన ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. అయితే తన కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ ఇదేనని మంధాన మ్యాచ్ అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో వేలికి గాయమైనప్పటికి మంధాన తన జోరును ఎక్కడా ఆపలేదు. మధ్యలో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్ విజయం అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ.. ''వర్షం కారణంగా మ్యాచ్ జరిగిన సెంట్జార్జీ పార్క్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. గాలికి బంతి దిశ మారుతూ వికెట్ల మీదకు దూసుకువస్తుండడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైపోయింది. బహుశా నా కెరీర్లోనే ఇది అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ అనుకుంటున్నా. వేలికి గాయం అయినప్పటికి పెద్దగా ఏం కాలేదు.. అంతా ఓకే. షఫాలీ వర్మతో సమన్వయం చేసుకున్నా. ఇద్దరం కలిసి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే నిశ్చయించుకున్నాం. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేస్తే సరిపోతుందని భావించాం. అందుకే జాగ్రత్తగా ఆడాం. మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీస్ చేర్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మేం ఆడాల్సిన పద్దతిలో ఆడలేదు. అందుకే ఓడిపోయాం'' అంటూ చెప్పుకొచ్చింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. A crucial knock with a big six! This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs! Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4 — ICC (@ICC) February 20, 2023 చదవండి: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే.. -
ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే..
మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెరుగైన రన్‌రేట్, పాయింట్ల ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌కు అసలైన పరీక్ష సెమీఫైనల్లో ఎదురుకానుంది. సెమీస్‌లో మహిళల క్రికెట్లో ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. లీగ్ పోటీల్లో ఒక మ్యాచ్ ఓడినా ఇంకో మ్యాచ్ గెలిచేందుకు అవకాశముంటుంది. కానీ నాకౌట్ స్టేజీ అలా కాదు. మ్యాచ్ గెలిస్తే ముందుకు.. ఓడిపోతే ఇంటికి. అందునా ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే టీమిండియా వుమెన్స్ శక్తికి మించి రాణించాల్సిందే. ఒకప్పుడు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ ఎంత ఆధిపత్యం చెలాయించిందో అందరికి తెలిసిందే. వారిని మించి డామినేట్ చేస్తుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు. ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్లో ఒక మెగా టోర్నీ ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు లేకుండా ముగియదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంత బలంగా ఉందనేది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు అందుకొని టాపర్‌గా నిలిచింది. ఆ జట్టులో ఒకటో నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. హేలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తాహిలా మెక్‌గ్రాత్ ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉన్నారు. మరి అలాంటి పటిష్టమైన ఆసీస్‌ను సెమీస్‌లో భారత్ నిలువరించగలిగితే ఈసారి కప్ కొట్టడం ఖాయం అని పలువురు జోస్యం చెబుతున్నారు. అనుకుంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించడం అంత కష్టమేమి కాదు. కానీ ముందు వారిని ఓడించగలమా అనే డౌట్ పక్కనబెట్టి సమిష్టి ప్రదర్శన చేస్తే కచ్చితంగా మ్యాచ్ మనదే అవుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన మూడుసార్లు ఔట్ నుంచి తప్పించుకునే అవకాశం వచ్చినప్పటికి తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెను ఎందుకు టీమిండియా సూపర్‌స్టార్ అంటారో.. ఎందుకంత క్రేజ్ అనేది ఈ పాటికే అర్థమై ఉండాలి. అండర్-19 టి20 వరల్డ్‌కప్‌లో తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గానూ రాణించి జట్టును విజేతగా నిలిపిన షఫాలీ వర్మ గాడిన పడాల్సి ఉంది. జేమిమా రోడ్రిగ్స్ తొలి మ్యాచ్ మినహా మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. రిచా ఘోష్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఆల్‌రౌండర్స్ పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తమ ప్రతిభను చూపెట్టాల్సిన అవసరం ఉంది. వీరంతా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేస్తే భారత్ గెలవడం ఈజీయే. ఎలాగూ బౌలింగ్‌లో రేణుకా సింగ్, శిఖా పాండేలు మంచి ప్రదర్శన ఇస్తుండగా.. స్పిన్నర్‌గా దీప్తి శర్మ ఆకట్టుకుంటుంది. మరి పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొని టీమిండియా వుమెన్స్ నిలబడతారా.. లేక ఒత్తిడికి లోనై పాత పాటే పాడుతారా అనేది ఫిబ్రవరి 23న తెలియనుంది. India are through to the semi-finals 🥳 They win by DLS method against Ireland in Gqeberha to finish the Group stage with six points 👊#INDvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/6SOSiUMO9L — T20 World Cup (@T20WorldCup) February 20, 2023 చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' -
ఐర్లాండ్‌తో కీలకపోరు.. కచ్చితంగా గెలవాల్సిందే
మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో టీమ్ఇండియా తలపడుతుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్(4) రెండో స్థానంలో కొనసాగుతుంటే..ఐర్లాండ్(0) ఆఖర్లో ఉంది. అయితే సెమీఫైనల్స్‌కు ఎలాంటి అవరోధాలు లేకుండా అర్హత సాధించాలంటే టీమిండియా..ఐర్లాండ్‌పై తప్పక గెలువాలి. ఇప్పటికే గ్రూపు-2 నుంచి ఇంగ్లండ్(6) ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.. అయితే మరో స్థానం కోసం పోటీ ఏర్పడింది. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ గెలిస్తే మన ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. అప్పుడు టీమిండియా నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది. మిగిలిన మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో తలపడుతుంది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన పోరులో పాక్ ఓడిపోవడం ఒక రకంగా మనకు కలిసొచ్చింది. ఒకవేళ ఆఖరి పోరులో ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే నాలుగు పాయింట్లకే పరిమితమవుతుంది. అప్పుడు భారత్‌కు బెర్తు ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మ్యాచ్‌ను కీలకంగా తీసుకున్న భారత్ అందుకు తగ్గట్లు సిద్ధమైంది. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బరిలోకి దిగడం సందేహంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ వ్యచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. ఈ గాయం నుంచి ఆమె కోలుకోకపోవడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్మృతి ఆడలేదు. మరోవైపు భుజం నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తొలి మ్యాచ్‌లో ఆడేది లేనిది ఆదివారం తెలుస్తుంది. చదవండి: దిగ్గజ ఆల్‌రౌండర్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా -
T20 WC: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం
India W vs Bangladesh Women- Richa Ghosh- స్టెలెన్బాస్చ్ (దక్షిణాఫ్రికా): టి20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి వార్మప్ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు జోరుగా ప్రాక్టీస్ చేశారు. రిచా ఘోష్ (56 బంతుల్లో 91 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడింది. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీస్కోరు చేసింది. రిచా, జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్సర్) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఆఖరి రెండు ఓవర్లలో అయితే రిచా, పూజ వస్త్రకర్ (13 నాటౌ ట్; 2 సిక్సర్లు) జోడీ ఏకంగా 46 పరుగులు సాధించడం విశేషం. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులే చేసింది. శుక్రవారం ప్రపంచకప్ మొదలుకానుండగా... భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్తాన్‌తో ఆడుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ స్కోర్లు భారత్- 183/5 (20) బంగ్లాదేశ్- 131/8 (20) చదవండి: Pat Cummins: గతం అనవసరం... మా జట్టు బలంగా ఉంది! నాగ్‌పూర్ పిచ్ ఎలా ఉందంటే.. ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా -
దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదని?
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్‌కు సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఫిట్నెస్ టెస్టులో విఫలమవకావడంతో వాన్ నీకెర్క్‌ను మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆమె స్థానంలో ఆల్‌రౌండర్ సునే లూస్‌ను తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ముందు వాన్ నీకెర్క్ కుడి కాలికి గాయమైంది. దీంతో ఆమె వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమైంది. అనంతరం ఆమె జట్టుకు దూరంగా ఉంటుంది. క్రికెట్ సౌతాఫ్రికా న్యూ రూల్స్ ఇవే.. క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్నెస్ రూల్స్ ప్రకారం.. మహిళా జట్టుకు ఎంపిక కావాలంటే క్రికెటర్లు కచ్ఛితంగా 9.3 నిమిషాల్లో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. అయితే వాన్ నీకెర్క్ మాత్రం మరో 30 సెకన్లు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలక్టర్లు ఆమెను పక్కనపెట్టారు. టీ20ల్లో అద్భుత రికార్డు.. టీ20ల్లో వాన్ నీకెర్క్‌కు మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో వాన్ నీకెర్క్ 1877 పరుగులతో పాటు 65 వికెట్లు కూడా పడగొట్టింది. అంతేకాకుండా టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ కూడా వాన్ నీకెర్కే కావడం విశేషం. గతేడాది కేప్‌తో స్వలింగ వివాహం వాన్ నీకెర్క్ గతేడాది తన సహచర క్రికెటర్ మరిజాన్నే కేప్‌ని స్వలింగ వివాహం చేసుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన జట్టులో కేప్‌కు మాత్రం చోటు దక్కింది. టీ20ల్లో సౌతాఫ్రికా తరుపున హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా కేప్ ఉంది. ఇక ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న జరగనున్న దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: అన్నరీ డెర్క్సెన్, సునే లూస్ (కెప్టెన్), మారిజాన్ కాప్, లారా గూడాల్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, తజ్మిన్ బ్రిట్స్, మసాబాటా క్లాస్, లారా వోల్వార్డ్ట్, సినాలో జాఫ్తా, నాన్కులులేకో మ్లాబా చదవండి: Shubman Gill: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! Your heroines for the ICC Women's #T20WorldCup 🇿🇦 #MyHero #AlwaysRising #BePartofIt pic.twitter.com/MUVZNtVQ1k — Proteas Women (@ProteasWomenCSA) January 31, 2023 -
T20 WC 2023: న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్
Morne Morkel: సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో వైట్ఫెర్న్స్కు బౌలింగ్‌లో మెళకువలు నేర్పించనున్నాడు. కివీస్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 38 ఏళ్ల మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో నమీబియా పురుషుల జట్టు కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రొటిస్ పొట్టి లీగ్‌లో అతడు డర్బన్ సూపర్‌జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. సౌతాఫ్రికాలో టోర్నీ ఈ క్రమంలో మెగా టోర్నీ నేపథ్యంలో న్యూజిలాండ్ ఈ మేరకు మోర్కెల్ నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం విశేషం. సౌతాఫ్రికాలో ఈ వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అక్కడి పిచ్‌ల గురించి అవగాహన ఉన్న మేటి బౌలర్‌ను తమ కోచ్‌గా ఎంపిక చేసుకోవడం గమనార్హం. కాగా 2006- 2018 మధ్య కాలంలో మోర్నీ మోర్కెల్ సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టు తరఫున మొత్తంగా 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టెస్టులో 309, వన్డేల్లో 188, టీ20లలో 47 వికెట్లు తీశాడు. ఇక న్యూజిలాండ్ మహిళా జట్టు ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మహిళ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 చదవండి: IND vs SL: శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్ Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి..