Women's T20 World Cup 2023 Warm-Up Match: Richa Ghosh Smashed An Attacking Unbeaten 91 As India Defeated Bangladesh By 52 Runs - Sakshi
Sakshi News home page

T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

Published Thu, Feb 9 2023 8:06 AM | Last Updated on Thu, Feb 9 2023 9:13 AM

T20 WC 2023 Warm Up: Richa Shines India Beat Bangladesh By 52 Runs - Sakshi

India W vs Bangladesh Women- Richa Ghosh- స్టెలెన్‌బాస్చ్‌ (దక్షిణాఫ్రికా): టి20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు జోరుగా ప్రాక్టీస్‌ చేశారు. రిచా ఘోష్‌ (56 బంతుల్లో 91 నాటౌట్‌; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడింది. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీస్కోరు చేసింది. రిచా, జెమీమా రోడ్రిగ్స్‌ (27 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్సర్‌) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఆఖరి రెండు ఓవర్లలో అయితే రిచా, పూజ వస్త్రకర్‌ (13 నాటౌ ట్‌; 2 సిక్సర్లు) జోడీ ఏకంగా 46 పరుగులు సాధించడం విశేషం.

అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులే చేసింది. శుక్రవారం ప్రపంచకప్‌ మొదలుకానుండగా... భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్తాన్‌తో ఆడుతుంది.  

మహిళల టీ20 ప్రపంచకప్‌ భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వార్మప్‌ మ్యాచ్‌ స్కోర్లు
భారత్‌- 183/5 (20)
బంగ్లాదేశ్‌- 131/8 (20)

చదవండి: Pat Cummins: గతం అనవసరం... మా జట్టు బలంగా ఉంది! నాగ్‌పూర్‌ పిచ్‌ ఎలా ఉందంటే..
ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్‌మన్‌ గిల్‌.. సత్తా చాటిన హార్ధిక్‌ పాండ్యా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement