ICC Shares Video of 'Mind-Blowing' Similarities Between Smriti Mandhana and Sourav Ganguly - Sakshi
Sakshi News home page

Smriti Mandhana: వారెవ్వా.. ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ దాదానే తలపించింది

Published Wed, Feb 22 2023 9:44 AM | Last Updated on Wed, Feb 22 2023 10:35 AM

ICC Share Video Mind-Blowing Similarities Smriti Mandhana-Sourav Ganguly - Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో పోరుకు దూరంగా ఉ‍న్న మంధాన ఆ తర్వాత వరుసగా రెండు అర్థసెంచరీలతో చెలరేగింది. ముఖ్యంగా ఐర్లాండ్‌తో జరిగిన చివరి లీగ్‌లో మ్యాచ్‌లో తన కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడింది మంధాన. 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. మ్యాచ్‌లో మంధాన గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడడం విశేషం. లెఫ్ట్‌ హ్యాండర్‌ అయిన స్మృతి మంధాన పుల్‌ షాట్స్‌, కవర్‌ డ్రైవ్‌, లాఫ్టడ్‌ ఆఫ్‌ డ్రైవ్స్‌తో అభిమానులకు కనువిందు కలిగించింది.


 
తాజాగా మంధాన ఆటను గంగూలీతో పోలుస్తూ ఐసీసీ షేర్‌ చేసిన వీడియో ఆసక్తి కలిగించింది. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఫ్రంట్‌ఫుట్‌ వచ్చి కొట్టే సిక్సర్‌కు అయితే లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మంధాన ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో యాదృశ్చికమో లేక అలా జరిగిందో తెలియదు కానీ ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ దాదానే తలపించింది. ఆఫ్‌ డ్రైవ్స్‌, కవర్‌ డ్రైవ్స్‌, ఫుల్‌ షాట్స్‌, స్ట్రెయిట్‌ షాట్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింట్లోనూ దాదా స్టైల్‌ను అచ్చు గుద్దింది మంధాన. ఐసీసీ వీడియోను చూసిన అభిమానులు మళ్లీ దాదా ఆటను గుర్తుచేసింది.. అంటూ కామెంట్‌ చేశారు. వీలైతే మీరు ఒక​ లుక్కేయండి.

ఐర్లాండ్‌పై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో విజయం అందుకున్న టీమిండియా వుమెన్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 23న(గురువారం) పటిష్టమైన ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడనుంది. బలమైన ఆసీస్‌ను టీమిండియా మట్టి కరిపిస్తే గనుక కచ్చితంగా ఈసారి ట్రోఫీ మనదే అని అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement