మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెరుగైన రన్‌రేట్, పాయింట్ల ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌కు అసలైన పరీక్ష సెమీఫైనల్లో ఎదురుకానుంది. సెమీస్‌లో మహిళల క్రికెట్‌లో ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది.
లీగ్ పోటీల్లో ఒక మ్యాచ్ ఓడినా ఇంకో మ్యాచ్ గెలిచేందుకు అవకాశముంటుంది. కానీ నాకౌట్ స్టేజీ అలా కాదు. మ్యాచ్ గెలిస్తే ముందుకు.. ఓడిపోతే ఇంటికి. అందునా ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే టీమిండియా వుమెన్స్ శక్తికి మించి రాణించాల్సిందే. ఒకప్పుడు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ ఎంత ఆధిపత్యం చెలాయించిందో అందరికి తెలిసిందే. వారిని మించి డామినేట్ చేస్తుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు.
ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్‌లో ఒక మెగా టోర్నీ ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు లేకుండా ముగియదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంత బలంగా ఉందనేది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు అందుకొని టాపర్‌గా నిలిచింది. ఆ జట్టులో ఒకటో నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. హేలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తాహిలా మెక్‌గ్రాత్ ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉన్నారు.
మరి అలాంటి పటిష్టమైన ఆసీస్‌ను సెమీస్‌లో భారత్ నిలువరించగలిగితే ఈసారి కప్ కొట్టడం ఖాయం అని పలువురు జోస్యం చెబుతున్నారు. అనుకుంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించడం అంత కష్టమేమి కాదు. కానీ ముందు వారిని ఓడించగలమా అనే డౌట్ పక్కనబెట్టి సమిష్టి ప్రదర్శన చేస్తే కచ్చితంగా మ్యాచ్ మనదే అవుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన మూడుసార్లు ఔట్ నుంచి తప్పించుకునే అవకాశం వచ్చినప్పటికి తన టి20 కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెను ఎందుకు టీమిండియా సూపర్‌స్టార్ అంటారో.. ఎందుకంత క్రేజ్ అనేది ఈ పాటికే అర్థమై ఉండాలి.
అండర్-19 టి20 వరల్డ్‌కప్‌లో తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గానూ రాణించి జట్టును విజేతగా నిలిపిన షఫాలీ వర్మ గాడిన పడాల్సి ఉంది. జేమిమా రోడ్రిగ్స్ తొలి మ్యాచ్ మినహా మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. రిచా ఘోష్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఆల్‌రౌండర్స్ పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తమ ప్రతిభను చూపెట్టాల్సిన అవసరం ఉంది.
వీరంతా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేస్తే భారత్ గెలవడం ఈజీయే. ఎలాగూ బౌలింగ్‌లో రేణుకా సింగ్, శిఖా పాండేలు మంచి ప్రదర్శన ఇస్తుండగా.. స్పిన్నర్‌గా దీప్తి శర్మ ఆకట్టుకుంటుంది. మరి పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొని టీమిండియా వుమెన్స్ నిలబడతారా.. లేక ఒత్తిడికి లోనై పాత పాటే పాడుతారా అనేది ఫిబ్రవరి 23న తెలియనుంది.
India are through to the semi-finals 🥳
— T20 World Cup (@T20WorldCup) February 20, 2023
They win by DLS method against Ireland in Gqeberha to finish the Group stage with six points 👊#INDvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/6SOSiUMO9L
Comments
Please login to add a commentAdd a comment