మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్(4) రెండో స్థానంలో కొనసాగుతుంటే..ఐర్లాండ్(0) ఆఖర్లో ఉంది.
అయితే సెమీఫైనల్స్‌కు ఎలాంటి అవరోధాలు లేకుండా అర్హత సాధించాలంటే టీమిండియా..ఐర్లాండ్‌పై తప్పక గెలువాలి. ఇప్పటికే గ్రూపు-2 నుంచి ఇంగ్లండ్(6) ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.. అయితే మరో స్థానం కోసం పోటీ ఏర్పడింది. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ గెలిస్తే మన ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. అప్పుడు టీమిండియా నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది.
మిగిలిన మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో తలపడుతుంది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన పోరులో పాక్ ఓడిపోవడం ఒక రకంగా మనకు కలిసొచ్చింది. ఒకవేళ ఆఖరి పోరులో ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే నాలుగు పాయింట్లకే పరిమితమవుతుంది. అప్పుడు భారత్‌కు బెర్తు ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మ్యాచ్‌ను కీలకంగా తీసుకున్న భారత్ అందుకు తగ్గట్లు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment