
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ముంబై వేదికగా దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా దూరమయ్యాడు. అతడి స్ధానంలో మార్‌క్రమ్ సారథ్యం వహిస్తున్నాడు.
అదే విధంగా ఈ మ్యాచ్‌కు పేసర్ లుంగీ ఎంగిడీ గాయం కారణంగా దూరం కాగా.. విలియమ్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. తాహిద్ హృదయ్ స్ధానంలో షకీబ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లిజాడ్ విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment