
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మోగించింది. ఈ గెలుపుతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు దాదాపు ఖారారు చేసుకున్నట్లే. పాకిస్తాన్ నిర్ధేశించిన 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది.
విరాట్ సూపర్ సెంచరీ..
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్.. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత శుబ్‌మన్ గిల్‌తో కలిసి విలువైన పార్టనర్‌షిప్ నెలకొల్పిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఈ క్రమంలో 111 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 82వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక కోహ్లితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.
చెలరేగిన భారత బౌలర్లు..
అంతకముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి: IND vs PAK: అఫ్రిది కళ్లు చెదిరే యార్కర్.. రోహిత్ శర్మ షాక్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment