చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. వరల్డ్‌కప్ చరిత్రలోనే Quinton de Kock now has the highest score for a designated wicketkeeper in World Cup history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. వరల్డ్‌కప్ చరిత్రలోనే

Published Tue, Oct 24 2023 5:41 PM

 Quinton de Kock now has the highest score for a designated wicketkeeper in World Cup history - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ద‍క్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తన కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న డికాక్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌పై డికాక్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్ బౌలర్లను డికాక్‌ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త ఆచతూచి ఆడిన క్వింటన్‌.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

 ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో డికాక్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఇది వన్డేల్లో అతడికి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం గమానార్హం.

డి​కాక్‌ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన డికాక్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిటి లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గిల్‌క్రిస్ట్‌ 149 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్‌క్రిస్ట్‌ రికార్డును డికాక్‌(174) బ్రేక్‌ చేశాడు. 
చదవండినిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్‌ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్‌ లెజెండ్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement