వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా న్యూజిలాండ్‌పై డికాక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 116 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు. మొదటిలో కివీస్ బౌలర్లను ఆచితూచి ఆడిన డికాక్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో డికాక్ ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 545 పరుగులు చేసిన డికాక్.. లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డికాక్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
డికాక్ సాధించిన రికార్డులు ఇవే..
►ఒక వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా డికాక్(545) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర పేరిట ఉండేది. 2015 వన్డే ప్రపంచకప్‌లో సంగక్కర 541 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును క్వింటన్ బ్రేక్ చేశాడు.
►అదే విధంగా వన్డేప్రపంచకప్‌లలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వికెట్ కీపర్‌గా డికాక్ నిలిచాడు. ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్‌లలో డికాక్ 22 సిక్సర్లు సాధించారు. ఈ ఏడాది ఎడిషన్‌లోనే డికాక్ 18 సిక్సర్లు కొట్టడం గమనార్హం. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్(19) పేరిట ఉండేది.
చదవండి: CWC 2023: వరల్డ్‌కప్‌లో ఘోర ప్రదర్శన. ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం! క్రికెట్‌కు గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment