దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు పట్టిన డికాక్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్‌ల క్యాచ్‌లను అందుకున్న డికాక్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2003 ప్రపంచ కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా నమీబియాపై ఆరు క్యాచ్‌లను పట్టాడు.
అదే విధంగా 2015 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఇదే ఫీట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(91 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలర్లలో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్, ఎంగిడి తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2024: ఆర్సీబీలోకి రచిన్ రవీంద్ర.. హింట్ ఇచ్చిన యువ సంచలనం!
Comments
Please login to add a commentAdd a comment