డికాక్‌, క్లాసెన్‌ విధ్వంసం​.. బంగ్లాదేశ్‌ టార్గెట్‌ 383 పరుగులు | De Kock hits 174 as South Africa finish with 382-5 against Bangladesh | Sakshi
Sakshi News home page

CWC 2023: డికాక్‌, క్లాసెన్‌ విధ్వంసం​.. బంగ్లాదేశ్‌ టార్గెట్‌ 383 పరుగులు

Published Tue, Oct 24 2023 5:54 PM | Last Updated on Tue, Oct 24 2023 6:14 PM

De Kock Hits centuty South Africa finish with 382-5 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రోటీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ అద్భుతమైన శతకంతో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. అతడితో పాటు హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. క్లాసెన్‌ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్‌, షోర్‌ఫుల్‌ ఇస్లాం, షకీబ్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. వరల్డ్‌కప్ చరిత్రలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement