బంగ్లాదేశ్‌పై 4 పరుగులతో గెలుపు
మెరిసిన క్లాసెన్
రాణించిన కేశవ్, రబడ, నోర్జే
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు.
ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్‌గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్‌రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది.
టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు.
సఫారీ విలవిల
బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్‌రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు.
స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
పాకిస్తాన్ X కెనడా
వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment