Group - D
-
T20 World Cup 2024: గట్టెక్కిన బంగ్లాదేశ్
క్రికెట్ కూనలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. మొదటికే మోసం వస్తుందని... తదుపరి దశకు అర్హత పొందే అవకాశాలు గల్లంతవుతాయని తాజా టి20 ప్రపంచకప్ నిరూపించింది. అసలు ఊహించుకోవడానికే విడ్డూరంగా కొన్ని అనూహ్య ఫలితాలు వచ్చాయి. మాజీ చాంపియన్లు, రన్నరప్‌లు ఇలా గట్టి జట్లకు పెద్ద షాక్లే తగిలాయి. తొలి ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా గ్రూప్ ‘ఎ’లో పాక్‌ను వెనక్కినెట్టి ఏకంగా సూపర్–8లోకి ప్రవేశించడం అద్భుతం! అద్భుతం కాకపోయినా... బంగ్లాదేశ్ గ్రూప్ ‘డి’ నుంచి శ్రీలంకను తోసి ముందడుగు వేసింది. కింగ్స్టౌన్: ఇదివరకే భారత్, అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్ క్రికెట్ టోరీ్నలో ఇప్పటికే తదుపరి ‘సూపర్–8’ దశకు చేరుకున్నాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ను గ్రూప్ ‘డి’ నుంచి బంగ్లాదేశ్‌కు ఖరారైంది. ఇతర సమీకరణాలతో దక్కే బెర్త్ కాకుండా గెలిచి సగర్వంగా సాధించాలని బంగ్లాదేశ్ కూన నేపాల్‌పై పెద్ద పోరాటమే చేసింది. సోమవారం ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సీమర్లు తంజిమ్ హసన్ సకిబ్ (4–2–7–4), ముస్తఫిజుర్ రెహా్మన్ (4–1–7–3) నిప్పులు చెరిగే బౌలింగ్ స్పెల్‌తో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ నెగ్గిన నేపాల్ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. షకీబుల్ హసన్ (22 బంతుల్లో 17; 2 ఫోర్లు) చేసిందే ఇన్నింగ్స్ టాప్ స్కోరు! మహ్ముదుల్లా (13), రిషద్ (13), జాకీర్ అలీ (12), టస్కిన్ అహ్మద్ (12), లిటన్ దాస్ (10) రెండంకెల స్కోరు చేశారు. పెద్దగా అనుభవం లేని నేపాల్ బౌలర్లు సోంపాల్ కామి, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్, సందీప్ లమిచానె తలా 2 వికెట్లతో బంగ్లాకు ముచ్చెమటలు పట్టించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకు కుప్పకూలింది. టాప్–5 బ్యాటర్లు కుశాల్ (4), ఆసిఫ్ (14 బంతుల్లో 17; 4 ఫోర్లు), అనిల్ (0), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (1), సందీప్ జొరా (1) బంగ్లా పేస్‌కు దాసోహమయ్యారు. 26/5 స్కోరు వద్ద... ఇంకెముందిలే బంగ్లా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ కుశాల్ మల్లా (40 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), దీపేంద్ర సింగ్ (31 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో నేపాల్ స్కోరు 78/5 వరకూ వెళ్లింది. ఆ స్కోరు వద్దే కుశాల్‌ను ముస్తఫిజుర్‌ను అవుట్ చేయడంతో మరో 7 పరుగుల వ్యవధిలోనే నేపాల్ ఆలౌటైంది. స్పిన్నర్ షకీబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, టస్కిన్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది. తంజిమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X అఫ్గానిస్తాన్వేదిక: గ్రాస్‌ఐలెట్; ఉదయం గం. 6 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024: ‘సూపర్–8’కు దక్షిణాఫ్రికా
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్‌గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్‌లో నేడుపాకిస్తాన్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024: దక్షిణాఫ్రికా బోణీ
న్యూయార్క్: మెరుపుల్లేవు... విధ్వంసక షాట్లు అసలే కనిపించలేదు... రెండు పెద్ద జట్ల మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ నాలుగో మ్యాచ్ కనీస వినోదాన్ని అందించలేకపోయింది. అనూహ్య బౌన్స్‌తో బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై స్వల్ప స్కోర్లతో మ్యాచ్ ముగిసింది. ముందుగా శ్రీలంక పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, చిన్న లక్ష్యాన్ని ఛేదిందుకు దక్షిణాఫ్రికా కూడా చాలా సమయం తీసుకుంది. మొత్తం 35.3 ఓవర్ల మ్యాచ్‌లో పోరులో కేవలం 6 ఫోర్లు, 3 సిక్స్‌లు మాత్రమే వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఆడిన 214 బంతుల్లో 127 డాట్ బాల్స్ ఉన్నాయి. టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఎక్కువ డాట్ బాల్స్ ఆడిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.సోమవారం నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. టి20ల్లో లంకకు ఇదే అత్యల్ప స్కోరు. కుశాల్ మెండిస్ (30 బంతుల్లో 19; 1 ఫోర్), ఏంజెలో మాథ్యూస్ (16 బంతుల్లో 16; 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆన్రిచ్ నోర్జే (4/7) తన స్పెల్‌లో ఓవర్‌కు ఒకటి చొప్పున నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. కేశవ్ మహరాజ్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులు సాధించింది. డి కాక్ (27 బంతుల్లో 20; 1 సిక్స్), క్లాసెన్ (22 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) గెలుపు తీరం చేర్చారు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. -
Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు
ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, బెంగాల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. -
రైల్వే గ్రూప్-డి ఫలితాలేవీ?
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్-డి పోస్టుల పరీక్ష ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల కింద నోటిఫికేషన్ జారీ చేసి, ఏడాది కింద రాత పరీక్ష నిర్వహించినా.. ఇప్పటికీ ఫలితాలు విడుదల కాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013 ఆగస్టు 30న దక్షిణ మధ్య రైల్వే 3,361 గ్రూపు-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2014లో రాతపరీక్ష నిర్వహించారు. వెంటనే పరీక్ష ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులంతా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.