టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు అర్హత
చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగులతో గెలుపు
7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన బంగ్లాదేశ్ బౌలర్ తంజిమ్
క్రికెట్ కూనలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. మొదటికే మోసం వస్తుందని... తదుపరి దశకు అర్హత పొందే అవకాశాలు గల్లంతవుతాయని తాజా టి20 ప్రపంచకప్ నిరూపించింది. అసలు ఊహించుకోవడానికే విడ్డూరంగా కొన్ని అనూహ్య ఫలితాలు వచ్చాయి. మాజీ చాంపియన్లు, రన్నరప్‌లు ఇలా గట్టి జట్లకు పెద్ద షాక్‌లే తగిలాయి. తొలి ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా గ్రూప్ ‘ఎ’లో పాక్‌ను వెనక్కినెట్టి ఏకంగా సూపర్–8లోకి ప్రవేశించడం అద్భుతం! అద్భుతం కాకపోయినా... బంగ్లాదేశ్ గ్రూప్ ‘డి’ నుంచి శ్రీలంకను తోసి ముందడుగు వేసింది.
కింగ్స్‌టౌన్: ఇదివరకే భారత్, అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్ క్రికెట్ టోరీ్నలో ఇప్పటికే తదుపరి ‘సూపర్–8’ దశకు చేరుకున్నాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ను గ్రూప్ ‘డి’ నుంచి బంగ్లాదేశ్‌కు ఖరారైంది. ఇతర సమీకరణాలతో దక్కే బెర్త్ కాకుండా గెలిచి సగర్వంగా సాధించాలని బంగ్లాదేశ్ కూన నేపాల్‌పై పెద్ద పోరాటమే చేసింది.
సోమవారం ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సీమర్లు తంజిమ్ హసన్ సకిబ్ (4–2–7–4), ముస్తఫిజుర్ రెహా్మన్ (4–1–7–3) నిప్పులు చెరిగే బౌలింగ్ స్పెల్‌తో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ నెగ్గిన నేపాల్ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది.
షకీబుల్ హసన్ (22 బంతుల్లో 17; 2 ఫోర్లు) చేసిందే ఇన్నింగ్స్ టాప్ స్కోరు! మహ్ముదుల్లా (13), రిషద్ (13), జాకీర్ అలీ (12), టస్కిన్ అహ్మద్ (12), లిటన్ దాస్ (10) రెండంకెల స్కోరు చేశారు. పెద్దగా అనుభవం లేని నేపాల్ బౌలర్లు సోంపాల్ కామి, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్, సందీప్ లమిచానె తలా 2 వికెట్లతో బంగ్లాకు ముచ్చెమటలు పట్టించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకు కుప్పకూలింది.
టాప్–5 బ్యాటర్లు కుశాల్ (4), ఆసిఫ్ (14 బంతుల్లో 17; 4 ఫోర్లు), అనిల్ (0), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (1), సందీప్ జొరా (1) బంగ్లా పేస్‌కు దాసోహమయ్యారు. 26/5 స్కోరు వద్ద... ఇంకెముందిలే బంగ్లా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ కుశాల్ మల్లా (40 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), దీపేంద్ర సింగ్ (31 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో నేపాల్ స్కోరు 78/5 వరకూ వెళ్లింది. ఆ స్కోరు వద్దే కుశాల్‌ను ముస్తఫిజుర్‌ను అవుట్ చేయడంతో మరో 7 పరుగుల వ్యవధిలోనే నేపాల్ ఆలౌటైంది. స్పిన్నర్ షకీబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, టస్కిన్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది. తంజిమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X అఫ్గానిస్తాన్
వేదిక: గ్రాస్‌ఐలెట్; ఉదయం గం. 6 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment