group - a
-
T20 World Cup 2024: గట్టెక్కిన బంగ్లాదేశ్
క్రికెట్ కూనలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. మొదటికే మోసం వస్తుందని... తదుపరి దశకు అర్హత పొందే అవకాశాలు గల్లంతవుతాయని తాజా టి20 ప్రపంచకప్ నిరూపించింది. అసలు ఊహించుకోవడానికే విడ్డూరంగా కొన్ని అనూహ్య ఫలితాలు వచ్చాయి. మాజీ చాంపియన్లు, రన్నరప్‌లు ఇలా గట్టి జట్లకు పెద్ద షాక్లే తగిలాయి. తొలి ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా గ్రూప్ ‘ఎ’లో పాక్‌ను వెనక్కినెట్టి ఏకంగా సూపర్–8లోకి ప్రవేశించడం అద్భుతం! అద్భుతం కాకపోయినా... బంగ్లాదేశ్ గ్రూప్ ‘డి’ నుంచి శ్రీలంకను తోసి ముందడుగు వేసింది. కింగ్స్టౌన్: ఇదివరకే భారత్, అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్ క్రికెట్ టోరీ్నలో ఇప్పటికే తదుపరి ‘సూపర్–8’ దశకు చేరుకున్నాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ను గ్రూప్ ‘డి’ నుంచి బంగ్లాదేశ్‌కు ఖరారైంది. ఇతర సమీకరణాలతో దక్కే బెర్త్ కాకుండా గెలిచి సగర్వంగా సాధించాలని బంగ్లాదేశ్ కూన నేపాల్‌పై పెద్ద పోరాటమే చేసింది. సోమవారం ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సీమర్లు తంజిమ్ హసన్ సకిబ్ (4–2–7–4), ముస్తఫిజుర్ రెహా్మన్ (4–1–7–3) నిప్పులు చెరిగే బౌలింగ్ స్పెల్‌తో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ నెగ్గిన నేపాల్ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. షకీబుల్ హసన్ (22 బంతుల్లో 17; 2 ఫోర్లు) చేసిందే ఇన్నింగ్స్ టాప్ స్కోరు! మహ్ముదుల్లా (13), రిషద్ (13), జాకీర్ అలీ (12), టస్కిన్ అహ్మద్ (12), లిటన్ దాస్ (10) రెండంకెల స్కోరు చేశారు. పెద్దగా అనుభవం లేని నేపాల్ బౌలర్లు సోంపాల్ కామి, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్, సందీప్ లమిచానె తలా 2 వికెట్లతో బంగ్లాకు ముచ్చెమటలు పట్టించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకు కుప్పకూలింది. టాప్–5 బ్యాటర్లు కుశాల్ (4), ఆసిఫ్ (14 బంతుల్లో 17; 4 ఫోర్లు), అనిల్ (0), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (1), సందీప్ జొరా (1) బంగ్లా పేస్‌కు దాసోహమయ్యారు. 26/5 స్కోరు వద్ద... ఇంకెముందిలే బంగ్లా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ కుశాల్ మల్లా (40 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), దీపేంద్ర సింగ్ (31 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో నేపాల్ స్కోరు 78/5 వరకూ వెళ్లింది. ఆ స్కోరు వద్దే కుశాల్‌ను ముస్తఫిజుర్‌ను అవుట్ చేయడంతో మరో 7 పరుగుల వ్యవధిలోనే నేపాల్ ఆలౌటైంది. స్పిన్నర్ షకీబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, టస్కిన్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది. తంజిమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X అఫ్గానిస్తాన్వేదిక: గ్రాస్‌ఐలెట్; ఉదయం గం. 6 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
2026 FIFA World Cup: భారత ఫుట్‌బాల్ జట్టు సత్తాకు పరీక్ష
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్‌బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్‌గా ఖతర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్‌కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్‌లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. భారత్‌తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్‌కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది. -
ICC Under 19 World Cup: ఆరో టైటిల్ లక్ష్యంగా...
రాబోయే క్రికెట్లో కాబోయే స్టార్లు అయ్యేందుకు అండర్–19 వన్డే ప్రపంచకప్‌కు మించిన టోర్నీ ఏదీ లేదు. అంతర్జాతీయ కెరీర్‌కు కచి్చతంగా సోపానమయ్యే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా సై అంటే సై అంటున్నారు. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఐదుసార్లు విజేత అయిన భారత జట్టు ఆరో టైటిల్ లక్ష్యంగా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్లూమ్ఫొంటెన్ (దక్షిణాఫ్రికా): గతంలో యువరాజ్ సింగ్ (2000–ప్రపంచకప్)... ప్రస్తుతం రోహిత్ శర్మ (2006), కోహ్లి (2008)... ఇకపై ఇషాన్ కిషన్ (2016), గిల్ (2018) భారత క్రికెట్ చరిత్రలో బంగారు బాట వేసుకున్నారు. వీళ్లంతా అండర్–19 ప్రపంచకప్ నుంచి వెలుగులోకి వచి్చనవారే! వీళ్లే కాదు... మనీశ్ పాండే, ఉన్ముక్త్ చంద్, యశ్ ధుల్, మన్జోత్ కల్రా, కమలేశ్ నాగర్కోటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. క్రికెట్ క్రేజీ భారత్‌ను మరో స్థాయిలో నిలబెట్టారు. అందువల్లే భారత్ కుర్రాళ్ల మెగా ఈవెంట్లో ఎప్పటికప్పుడు హాట్ ఫేవరెట్‌గా ఉంది. ఇప్పుడు కూడా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో సఫారీలో ఆరో ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. భారత్ మిగతా రెండు లీగ్ మ్యాచ్‌లను ఈనెల 25న ఐర్లాండ్‌తో, 28న అమెరికాతో ఆడుతుంది. ఇదీ ఫార్మాట్... ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మూడు లీగ్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు గ్రూప్ దశలో 24 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఓ రోజు విశ్రాంతి అనంతరం 30 నుంచి ‘సూపర్ సిక్స్’ దశ పోరు ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 6, 8 తేదీల్లో రెండు సెమీఫైనల్ పోటీలు జరుగుతాయి. టైటిల్ పోరు 11న జరుగనుంది. -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్‌ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: నెదర్లాండ్స్, ఈక్వెడార్ మ్యాచ్ ‘డ్రా’
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. -
Vijay Hazare Trophy: సమర్థ్ 200
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. -
T20 World Cup 2022: గెలిచి శ్రీలంక.. ఓడి నెదర్లాండ్స్...
టి20 ప్రపంచకప్ తొలిరౌండ్ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ ‘సూపర్–12’కు ప్రధాన టోర్నీకి అర్హత సంపాదించాయి. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో ఆసియా చాంపియన్ లంకను కంగు తినిపించిన నమీబియా సంచలన ప్రదర్శన చివరకు పేలవంగా ముగిసింది. యూఏఈపై గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిన నమీబియా... నెదర్లాండ్స్ ముందుకెళ్లే అవకాశాన్నిచ్చింది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. సాయంత్రం ముగిసిన పోరులో యూఏఈ 7 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. లంక గెలిచి అర్హత సాధించగా, ఓడిన నెదర్లాండ్స్ కూడా ఇదివరకే రెండు విజయాలతో ముందంజ వేసింది. నమీబియా గెలిస్తే నెదర్లాండ్స్ కథ ముగిసేది. గీలాంగ్: నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండిస్ (44 బంతుల్లో 79; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. మ్యాక్స్ ఓ డౌడ్ (53 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరిపోరాటం చేశాడు. లంక ఇన్నింగ్స్ నిదానంగా మొదలైంది. పవర్‌ప్లేలో నిసాంక (14; 1 ఫోర్), మెండీస్ జోడీ చేసింది 36 పరుగులే! అదే స్కోరుపై నిసాంక, ధనంజయ డిసిల్వా (0)... మీకెరెన్ వేసిన ఏడో ఓవర్లో పెవిలియన్ చేరారు. ఈ దశలో కుశాల్, చరిత్ అసలంక (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరు వేగంగా పరుగులు జత చేశారు. 9వ ఓవర్లో 50 పరుగులు చేసిన లంక, కుశాల్ సిక్సర్లతో విరుచుకుపడటంతో 14.3 ఓవర్లలోనే 100 స్కోరు దాటింది. కుశాల్ 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. భానుక రాజపక్స (13 బంతుల్లో 19; 2 ఫోర్లు) వచ్చాక స్కోరు వేగం మరింత పుంజుకుంది. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక (8), కుశాల్ మెండిస్‌లు వెనుదిరగడంతో ఆశించిన స్కోరు చేయలేకపోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో మీకెరెన్, బస్ డి లీడె చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ జట్టులోనూ ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ కడదాకా పోరాటం చేసినా లంక బ్యాటర్స్లా అండగా నిలిచే సహచరులు కరువయ్యారు. అతని తర్వాత రెండో అత్యధిక స్కోరు కెప్టెన్ ఎడ్వర్డ్స్ (21)దే! మిగతావారిలో ముగ్గురు డకౌటైయ్యారు. లెగ్ స్పిన్నర్ హసరంగ (3/28) ప్రత్యర్థిని పడగొట్టగా, తీక్షణ 2, లహిరు, ఫెర్నాండో చెరో వికెట్ తీశారు. వీస్ పోరాడినా... టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గట్టి ప్రత్యర్థి, ఆసియా చాంపియన్ శ్రీలంకపై నమీబియా 163/7 స్కోరు చేసింది. 55 పరుగులతో సంచలన విజయం సాధించింది. కానీ సూపర్–12కు అర్హత సాధించే ఆఖరి మ్యాచ్‌లో క్రికెట్కూన యూఏఈ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరిదాకా పట్టుదల కనబరిచిన యూఏఈ చివరకు 7 పరుగుల తేడాతో గెలిచి ఈ గ్రూప్‌లో ఒక విజయంతో నిష్క్రమించింది. నమీబియాకు కీలకమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముహమ్మద్ వసీమ్ (41 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు), వ్రిత్యా అరవింద్ (32 బంతుల్లో 21; 2 ఫోర్లు) నమీబియా బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆరంభంలో కష్టపడ్డారు. దీంతో 8 ఓవర్లు ముగిసినా జట్టు స్కోరు 39 పరుగులను దాటలేదు. అరవింద్ అవుటయ్యాక... కెప్టెన్ రిజ్వాన్ (29 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాకే యూఏఈ స్కోరు పుంజుకుంది. వసీమ్, రిజ్వాన్ రెండో వికెట్‌కు 6.5 ఓవర్లలో 58 పరుగులు జోడించారు. ఆఖర్లో బాసిల్ హమీద్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీషాట్లతో మెరిపించడంతో యూఏఈ పోరాడే స్కోరు చేయగలిగింది. నమీబియా బౌలర్లు డేవిడ్ వీస్, బెర్నార్డ్, షికొంగో తలా ఒక వికెట్ తీశారు. అనంతరం నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి ఓడిపోయింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా ఆరంభం నుంచే అగచాట్లు పడింది. ఓపెనర్లు మైకేల్ లింగెన్ (10), స్టీఫన్ (4) సహా ఆరో వరుస బ్యాటర్ స్మిత్ (3) దాకా అంతా నిరాశపరిచారు. దీంతో 69 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన నమీబియాకు ఓటమి ఖాయమైంది. అయితే డేవిడ్ వీస్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టులో ఆశలు రేపాయి. ఎనిమిదో వికెట్‌కు రుబెన్ ట్రంపుల్మన్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), వీస్ ఇద్దరు 7 ఓవర్లలో 70 పరుగులు జోడించడంతో నమీబియా గెలుపు వాకిట నిలిచింది. 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన సమీకరణం నమీబియాను ఊరించింది. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచేందుకు వీస్ ప్రయత్నించగా బౌండరీ వద్ద షరఫు అందుకోవడంతో యూఏఈకి గెలుపు ఖాయమైంది. ఈ ఫలితం నెదర్లాండ్స్‌కు లక్కీచాన్స్ అయ్యింది. మధ్యా హ్నం ఓటమి తాలుకు నిరాశ సాయంత్రమయ్యేసరికి సంతోషంగా మారింది. యూఏఈ మ్యాచ్ అయిపోగానే నెదర్లాండ్స్ సంబరాల్లో మునిగితేలింది. గ్రూప్‘బి’ తేలేది నేడే గ్రూప్ ‘ఎ’ లెక్క తేలింది. మిగిలింది ‘బి’ గ్రూపు లెక్కే! ఇక్కడ నాలుగు జట్లకు సమాన అవకాశాలున్నాయి. స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లన్నీ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గెలుపోటములతో రేసులో ఉన్నాయి. నేడు ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్‌తో ఐర్లాండ్... స్కాట్లాండ్తో జింబాబ్వే తలపడతాయి. గెలిస్తే చాలు... ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా గెలిచిన రెండు జట్లు ‘సూపర్–12’ దశకు అర్హత సాధిస్తాయి. -
ఇటలీ శుభారంభం
రోమ్: ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 53వ నిమిషంలో టర్కీ ప్లేయర్ దెమిరల్ సెల్ఫ్ గోల్‌తో ఇటలీ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కిరో ఇమోబిల్ (66వ నిమిషంలో), లొరెంజో (79వ నిమిషంలో) ఇటలీ జట్టుకు ఒక్కో గోల్ అందించారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా వేల్స్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
గ్రూప్–ఏలో కర్ణాటక క్వాలిఫై
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న దక్షిణ భారత సబ్–జూనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో గ్రూప్–ఏలో కర్ణాటక క్వాలిఫై అయ్యింది. గురువారం ఐదో రోజు జరిగిన పోరులో కర్ణాటక, తమిళనాడు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మొదటి హాఫ్‌టైం వరకు ఇరుజట్లు 2–2తో సమానంగా నిలిచాయి. రెండో హాఫ్‌టైంలో కర్ణాటక జట్టు తన దూకుడు ప్రదర్శించి ఏకంగా 4 గోల్స్ సాధించడంతో కర్ణాటక జట్టు 6–3తో తమిళనాడుపై సాధించింది. జట్టులో జాన్సన్ 2, నిక్సన్ 1, సుమర్‌దేవ్ 1, అంకిత్ 2 గోల్స్ సాధించారు. అంతకుముందు క్రీడా పోటీలను ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ప్రారంభించారు. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, జిల్లా కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఆర్డీటీ మేనేజర్ సురేంద్ర తదితరులు పర్యవేక్షించారు. నేడు తేలనున్న ఆంధ్ర భవితవ్యం శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గ్రూప్–బీ విభాగంలో ఆంధ్ర, కేరళ జట్లు తలపడనున్నాయి. చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయింగ్ సాధిస్తుంది.