అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న దక్షిణ భారత సబ్–జూనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో గ్రూప్–ఏలో కర్ణాటక క్వాలిఫై అయ్యింది. గురువారం ఐదో రోజు జరిగిన పోరులో కర్ణాటక, తమిళనాడు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మొదటి హాఫ్‌టైం వరకు ఇరుజట్లు 2–2తో సమానంగా నిలిచాయి. రెండో హాఫ్‌టైంలో కర్ణాటక జట్టు తన దూకుడు ప్రదర్శించి ఏకంగా 4 గోల్స్ సాధించడంతో కర్ణాటక జట్టు 6–3తో తమిళనాడుపై సాధించింది. జట్టులో జాన్‌సన్ 2, నిక్‌సన్ 1, సుమర్‌దేవ్ 1, అంకిత్ 2 గోల్స్ సాధించారు. అంతకుముందు క్రీడా పోటీలను ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ప్రారంభించారు. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, జిల్లా కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఆర్డీటీ మేనేజర్ సురేంద్ర తదితరులు పర్యవేక్షించారు.
నేడు తేలనున్న ఆంధ్ర భవితవ్యం
శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గ్రూప్–బీ విభాగంలో ఆంధ్ర, కేరళ జట్లు తలపడనున్నాయి. చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయింగ్ సాధిస్తుంది.
గ్రూప్–ఏలో కర్ణాటక క్వాలిఫై
Published Thu, Sep 7 2017 10:06 PM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement
Advertisement