రాబోయే క్రికెట్‌లో కాబోయే స్టార్లు అయ్యేందుకు అండర్–19 వన్డే ప్రపంచకప్‌కు మించిన టోర్నీ ఏదీ లేదు. అంతర్జాతీయ కెరీర్‌కు కచి్చతంగా సోపానమయ్యే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా సై అంటే సై అంటున్నారు. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఐదుసార్లు విజేత అయిన భారత జట్టు ఆరో టైటిల్ లక్ష్యంగా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
బ్లూమ్‌ఫొంటెన్ (దక్షిణాఫ్రికా): గతంలో యువరాజ్ సింగ్ (2000–ప్రపంచకప్)... ప్రస్తుతం రోహిత్ శర్మ (2006), కోహ్లి (2008)... ఇకపై ఇషాన్ కిషన్ (2016), గిల్ (2018) భారత క్రికెట్ చరిత్రలో బంగారు బాట వేసుకున్నారు. వీళ్లంతా అండర్–19 ప్రపంచకప్ నుంచి వెలుగులోకి వచి్చనవారే! వీళ్లే కాదు... మనీశ్ పాండే, ఉన్ముక్త్ చంద్, యశ్ ధుల్, మన్‌జోత్ కల్రా, కమలేశ్ నాగర్‌కోటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.
క్రికెట్ క్రేజీ భారత్‌ను మరో స్థాయిలో నిలబెట్టారు. అందువల్లే భారత్ కుర్రాళ్ల మెగా ఈవెంట్‌లో ఎప్పటికప్పుడు హాట్ ఫేవరెట్‌గా ఉంది. ఇప్పుడు కూడా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో సఫారీలో ఆరో ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. భారత్ మిగతా రెండు లీగ్ మ్యాచ్‌లను ఈనెల 25న ఐర్లాండ్‌తో, 28న అమెరికాతో ఆడుతుంది.
ఇదీ ఫార్మాట్...
ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మూడు లీగ్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు గ్రూప్ దశలో 24 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఓ రోజు విశ్రాంతి అనంతరం 30 నుంచి ‘సూపర్ సిక్స్’ దశ పోరు ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 6, 8 తేదీల్లో రెండు సెమీఫైనల్ పోటీలు జరుగుతాయి. టైటిల్ పోరు 11న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment