![open tournament with comfortable 3-0 win over Turkey - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/13/IMMOBILE-SCORES1.jpg.webp?itok=RxxYv5k1)
రోమ్: ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 53వ నిమిషంలో టర్కీ ప్లేయర్ దెమిరల్ సెల్ఫ్ గోల్‌తో ఇటలీ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కిరో ఇమోబిల్ (66వ నిమిషంలో), లొరెంజో (79వ నిమిషంలో) ఇటలీ జట్టుకు ఒక్కో గోల్ అందించారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా వేల్స్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment