హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్-డి పోస్టుల పరీక్ష ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల కింద నోటిఫికేషన్ జారీ చేసి, ఏడాది కింద రాత పరీక్ష నిర్వహించినా.. ఇప్పటికీ ఫలితాలు విడుదల కాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013 ఆగస్టు 30న దక్షిణ మధ్య రైల్వే 3,361 గ్రూపు-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2014లో రాతపరీక్ష నిర్వహించారు. వెంటనే పరీక్ష ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులంతా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.