లండన్: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బలమైన పేస్ అటాకింగ్ ఉన్న దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా సఫారీ బౌలింగ్‌ను చిత్తుచిత్తు చేసింది. బంగ్లా ఓపెనర్లు గొప్పగా రాణించనప్పటికీ సీనియర్ ఆటగాళ్లు షకీబుల్ హసన్, ముష్పికర్ రహీమ్‌లు తమ భాద్యతను సక్రమంగా నిర్వర్తించారు. వీరికి తోడు మహ్మదుల్లా-మొసెదెక్‌లు చివర్లో చితక్కొట్టడంతో బంగ్లా భారీ స్కోర్‌వైపు అడుగులు వేసింది.
అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించిన పరుగులే బంగ్లాకు వన్డేల్లో అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో గతంలో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక పరుగుల రికార్డును(329) తిరగరాసింది. ఇక ప్రపంచకప్‌లోనూ బంగ్లాకు ఇదే అత్యుత్తమ స్కోర్. 2015 ప్రపంచకప్ సందర్భంగా స్కాట్లాండ్‌పై 322 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో షకీబుల్-రహీమ్‌లు మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇది ఓవరాల్ వరల్డ్‌కప్‌లో బంగ్లాకు అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నమోదైంది. అంతకుముందు మహ్మదుల్లా, రహీమ్‌లు గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజాగా ఆ రికార్డును షకీబ్, రహీమ్‌లు సవరించారు.
Comments
Please login to add a commentAdd a comment