బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ దాటికి 54 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును నమమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ విజయం ద్వారా పలు రికార్డులను నమోదు చేసింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
►బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు అన్ని వికెట్లను ఇద్దరు బౌలర్లు మాత్రమే పడగొట్టారు. కేశవ్ మహరాజ్ ఏడు వికెట్లు తీయగా.. సిమోన్ హార్మర్ మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
►రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు బౌలింగ్ మొత్తం కేశవ్ మహరాజ్, సిమోన్ హార్మలు పంచుకోవడం విశేషం. ఒక ఇన్నింగ్స్ మొత్తంలో ఓవర్లు మొత్తం ఇద్దరు బౌలర్లే పంచుకోవడం.. అన్ని వికెట్లు వారిద్దరే తీయడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 28వ సారి.
►కాగా సౌతాఫ్రికాకు మాత్రం ఇది మొదటిసారి. ఒక ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లే 10 వికెట్లు తీయడం కూడా ప్రొటీస్ క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అలా సౌతాఫ్రికా జట్టు ఒక అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
►బంగ్లాదేశ్ ప్రొటీస్ గడ్డపై చెత్త రికార్డు నమోదు చేసింది. కింగ్స్‌మీడ్ మైదానంలో(డర్బన్) టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.
►తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్టులో 54 పరుగులకు ఆలౌటైంది. ఇంతకముందు 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లా చెత్త రికార్డు మూటగట్టుకుంది.
చదవండి: SA vs BAN: భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డు బంగ్లాకు బదిలీ.. ప్రొటీస్ అద్భుత విజయం
Comments
Please login to add a commentAdd a comment