Kagiso Rabada: రబాడ (5/39) ఐదు వికెట్లతో రఫ్ఫాడించడంతో బంగ్లాదేశ్‌తో ఇవాళ(మార్చి 20) జరిగిన రెండో వన్డేలో ఆతిధ్య ప్రోటీస్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీలు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోవడంతో పాటు తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. సఫారీ జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించగా, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై రివెంజ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు రబాడ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా, డికాక్ (62), కైల్ వెర్రిన్ (58 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో సఫారీ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు అఫీఫ్ హోసేన్ (107 బంతుల్లో 77; 9 ఫోర్లు) ఒంటరి పోరటాం చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే బుధవారం (మార్చి 23) జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రబాడ భీకరమైన బంతులతో ప్రత్యర్ధులను గడగడలాడించడంతో అతని ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో రబాడను పంజాబ్ ఏకంగా రూ. 9. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, రబాడ, ఎంగిడి, డస్సెన్, మార్క్రమ్ సహా పలువురు సౌతాఫ్రికా క్రికెటర్లు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన టెస్ట్ సిరీస్‌కు డుమ్మా కొట్టి ఐపీఎల్ ఆడేందుకు పయనమవుతున్నారు.
చదవండి: హిట్టర్లలతో సిద్దమైన పంజాబ్.. పూర్తి జట్టు ఇదే
A great catch from Janneman Malan to ensure @KagisoRabada25 five-wicket haul🖐️ #SAvBAN #BetwayPinkODI #BePartOfIt | @Betway_za pic.twitter.com/hlYxZDjyPN
— Cricket South Africa (@OfficialCSA) March 20, 2022
Comments
Please login to add a commentAdd a comment