Photo Courtesy: IPL
ఐపీఎల్ 2022 సీజన్ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారై, సన్‌రైజర్స్, పంజాబ్ జట్లు ఇదివరకే రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది.
రికార్డులు ఎలా ఉన్నాయంటే..
క్యాష్ రిచ్ లీగ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 19 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 13, పంజాబ్ 6 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది.
నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
- పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్‌లో మరో బౌండరీ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 700 బౌండరీల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే నేటి మ్యాచ్‌లో ధవన్ 5 బౌండరీలు బాధితే పంజాబ్ తరఫున 50 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు.
- పంజాబ్ పేసర్ రబాడ నేటి మ్యాచ్‌లో మరో 2 వికెట్లు పడగొడితే క్యాష్ రిచ్ లీగ్‌లో 100 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించిన తొలి సౌతాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
- పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మార్కును చేరుకుంటాడు.
- పంజాబ్ హిట్టర్ లివింగ్‌స్టోన్ మరో 2 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో 4500 పరుగుల మార్కును క్రాస్ చేస్తాడు.
- సన్‌రైజర్స్ డాషింగ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి మరో 3 బౌండరీలు బాధితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును, అలాగే మరో 4 సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.
- పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ మరో 3 సిక్సర్లు బాధితే టీ20ల్లో 150 సిక్సర్ల అరుదైన క్లబ్‌లో చేరతాడు. అలాగే మయాంక్ నేటి మ్యాచ్‌లో మరో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున 150 బౌండరీలను పూర్తి చేసుకుంటాడు.
- సన్‌రైజర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ మరో 6 బౌండరీలు సాధిస్తే టీ20ల్లో 300 బౌండరీల మార్కును అందుకుంటాడు.
- సన్‌రైజర్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్ మరో వికెట్ పడగొడితే ఐపీఎల్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.
- సన్‌రైజర్స్ హిట్టర్ అబ్దుల్ సమద్ మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.
చదవండి: సన్‌రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..!
Comments
Please login to add a commentAdd a comment