లివింగ్‌స్టోన్- కగిసో రబడ (Photo Credit: iplt20.com)
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్‌కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంకా కోలుకోలేదు
మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో చికిత్స పొందుతున్న లివింగ్‌స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్‌కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు.
కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్‌స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్‌తో చేరతాడనే వార్తలు వచ్చాయి.
అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్‌లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తలపడనుంది.
హైదరాబాద్‌కు చేరుకున్న ధావన్ సేన
ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్‌కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్‌స్టోన్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది.
చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే
కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో..
Sadda Captain has spoken. 🫡
— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023
📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J
All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv
— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023
Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7
— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023
Comments
Please login to add a commentAdd a comment