IPL 2022: Shikhar Dhawan Is Set To Make His Bollywood Debut, Says Reports - Sakshi
Sakshi News home page

Shikhar Dhawan Acting Debut: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్‌ ఓపెనర్‌..!

Published Wed, May 18 2022 9:27 AM | Last Updated on Wed, May 18 2022 10:45 AM

IPL 2022: Shikhar Dhawan Is Set To Make Bollywood Debut Says Reports - Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ వెండితెరపై మెరువనున్నాడా అంటే.. అవుననే సమాధానమే వినబడుతుంది. సరదా కోసం టిక్‌ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే గబ్బర్‌.. త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రముఖ సినిమా వెబ్‌సైట్ పింక్ విల్లా ఓ కథనంలో పేర్కొంది. ఈ కథనం మేరకు.. ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న గబ్బర్ ఇప్పటికే సినిమా షూటింగ్‌తో పాటు డబ్బింగ్ పార్ట్‌ కూడా పూర్తి చేశాడని సమాచారం. 

అయితే దర్శక నిర్మాతలు ఈ విషయాలను మీడియాకు లీక్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు. గబ్బర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ విషయాన్ని అతనికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ధృవీకరించాడు. సినిమా వివరాలను వెల్లడించేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి మాట్లాడుతూ.. శిఖర్‌కు సినిమాలంటే చిన్నతనం నుంచి అమితమైన ఆసక్తి ఉంది.. భారీ తారాగణం ఉన్న సినిమాలో ఓ కీలక క్యారెక్టర్‌కు శిఖర్‌ అయితేనే కరెక్ట్‌గా సరిపోతాడని దర్శక నిర్మాతలు భావించారు.. శిఖర్‌ కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి కనబర్చాడు.. ఈ సినిమాలో శిఖర్‌ ఫుల్‌ లెంగ్త్‌లో ఉండే కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముందని క్లారిటీ ఇచ్చాడు. 

కాగా, శిఖర్‌ కీలకపాత్రలో నటించాడని చెబుతున్న బాలీవుడ్ సినిమా యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా పృథ్వీ రాజ్ అని బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022లో శిఖర్‌ ధవన్‌ పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడి ఉన్నాయి. పంజాబ్‌.. మే 22న సన్‌రైజర్స్‌తో తలపడాల్సి ఉంది. 
చదవండి: 'మ్యాచ్ గెలవడం కంటే నీ ఈగో ముఖ్యమా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement