Photo Courtesy: IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టడం ద్వారా.. డేల్ స్టెయిన్ (97 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడిన రబాడ.. 98 వికెట్లు సాధించి 100 వికెట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తున్నాడు. మే 22న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రబాడ మరో 2 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 100 వికెట్ల మార్కును అందుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు చేజార్చుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. అయితే టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే సన్‌రైజర్స్- పంజాబ్ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఢిల్లీ, ఆర్సీబీలతో సమానంగా (14 పాయింట్లు) నిలుస్తుంది.
చదవండి: IPL 2022: ముంబైపై ఢిల్లీ గెలిచిందా.. ఆ నాలుగు జట్ల పని గోవిందా..!
Comments
Please login to add a commentAdd a comment