
IPL 2022: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న గబ్బర్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్లు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు ఫన్నీ వీడియోలతోనూ ఆకట్టుకుంటాడు. ఈ క్రమంలో గురువారం శిఖర్ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఐపీఎల్-2022లో శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్ 460 పరుగులు(అత్యధిక స్కోరు 88- నాటౌట్) సాధించాడు. అయితే, బ్యాటర్‌గా ధావన్ సఫలీకృతుడైనప్పటికీ.. అతడి జట్టుకు మాత్రం మరోసారి పరాభవం తప్పలేదు. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి 14 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
ఈసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో గబ్బర్ ఓ ఫన్నీ వీడియో పంచుకున్నాడు. ఇందులో ధావన్ తండ్రి అతడిని సరదాగా తన్నుతూ.. కొడుతున్నట్లుగా కనిపించారు. పక్కనున్న వాళ్లు ఆపుతున్నా ఆవేశంగా ముందుకు వస్తూ ధావన్‌ను ఆయన చితక్కొట్టినట్లు నటించారు.
ఈ వీడియోకు.. ‘‘నాకౌట్‌కు అర్హత సాధించనందుకు మా నాన్న చేతిలో ఇలా నాకౌట్’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇది నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇక సినిమాలపై మక్కువ ఉన్న ధావన్ త్వరలోనే బాలీవుడ్ తెరపై దర్శనమివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ధావన్‌ను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయని నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చదవండి 👇
IPL 2022: చాన్స్ ఇస్తే... చెలరేగిపోయారు... ఈ నలుగురు వారికి వారే సాటి! అద్భుతంగా..
Comments
Please login to add a commentAdd a comment