ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ (88) అజేయమైన అర్ధ సెంచరీతో రాణించి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన మైలురాళ్లను అధిగమించిన విషయం తెలిసిందే.
Dhoni Thala hai, Kohli King hain aur Shikhar? 6000 IPL runs, delivering under pressure, he is T20 ka Khalifa. He should play T20 World Cup. Don't ask me where, if I was selector, I would tell you.
— Mohammad Kaif (@MohammadKaif) April 26, 2022
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గబ్బర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్విటర్ వేదికగా శిఖర్‌ను శిఖరానికెత్తాడు. ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20కా ఖలీఫా అంటూ కొనియాడాడు. ధవన్ త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆడాలి, ఏ స్థానంలో అని నన్ను అడగకండి, నేను సెలెక్టర్‌ని అయితే తప్పక చెప్పేవాడిని అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
కాగా, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ధవన్ పలు అరుదైన మైలురాళ్లను క్రాస్ చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో కోహ్లి (6402) తర్వాత 6000 పరుగుల మార్కును దాటిన రెండో ఆటగాడిగా, ఐపీఎల్‌లో ఓ జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా, టీ20ల్లో కోహ్లి (10392 పరుగులు), రోహిత్ శర్మ (10009 పరుగులు) తర్వాత 9000 పరుగుల మార్కును అధిగమించిన మూడో భారత ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డులన్నింటినీ ధవన్ తన 200వ ఐపీఎల్ మ్యాచ్‌లో చేరుకోవడం విశేషం.
చదవండి: PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్ ధవన్
Comments
Please login to add a commentAdd a comment