Mohammed Kaif
-
'హెడ్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.. ఆ ఒక్కటి చేస్తే చాలు'
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ డే/నైట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.రోహిత్ సేన మాత్రం మూడు విభాగాల్లో విఫలమైన ఆసీస్ ముందు మోకరల్లింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అయితే భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.దీంతో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 200 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలా భారత పేసర్లందుకు తెలివిగా ఆలోచించడం లేదని కైఫ్ ప్రశ్నించాడు."స్కాట్ బోలాండ్ ఆసీస్ జట్టులో రెగ్యూలర్‌గా ఉండడు. కానీ అతడికి విరాట్ కోహ్లిని ఎలా ఔట్ చేయాలో తెలుసు. జట్టులో స్ధిరంగా ఉండని బౌలరే కోహ్లిని ట్రాప్ చేసినప్పుడు, మీరెందుకు ట్రావిస్ హెడ్‌ని అడ్డుకోలేకపోయారు. ప్రతీ బ్యాటర్‌కు ఓ వీక్నెస్ ఉంటుంది.హెడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే హెడ్ ఔటయ్యే అవకాశముంటుంది. అటువంటిప్పుడు మీరు ఎందుకు అదే లైన్లో నిలకడగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం మనం ఆసీస్ బౌలర్లను చూసి నేర్చుకోవాలి.విరాట్ కోహ్లి బలహీనత అందరికీ తెలుసు. ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే విరాట్ ఔటయ్యే అవకాశముంది. అందుకే ఆసీస్ బౌలర్లు అదే లైన్లో అతడికి బౌలింగ్ చేస్తారు. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్, రెండో ఇన్నింగ్స్‌లో బోలాండే అదే పనిచేశారు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా ట్రావిస్ హెడ్‌కి వ్యతిరేకంగా భారత బౌలర్లు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. మొదటి బంతి నుంచే అతడిని ఎటాక్ చేయాలి. హెడ్‌కు ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. పక్కా ప్రణాళికతో అతడిని ఔట్ చేయాలని" ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కైఫ్ పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: భారత్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే: పాక్ మాజీ క్రికెటర్ -
IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గనుక వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అతడిని కొనుగోలు చేయాలని సూచించాడు. అంతేకాదు.. హిట్‌మ్యాన్‌ను ఆర్సీబీ తమ సారథిగా నియమిస్తే.. ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు.కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండో ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన చార్జర్స్‌లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్‌ను కొనుగోలు చేసి.. జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణాల్యతో ముంబైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డుతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించుకుంది.ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని.. ముంబై ఫ్రాంఛైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.టైటిల్ కరువు తీరుతుందిఅంతేకాదు.. రోహిత్‌ను ఒప్పించి తమ కెప్టెన్‌గా నియమించుకోవాలి. బ్యాటర్‌గా రోహిత్ మరీ మునుపటిలా పరుగులు రాబట్టలేకపోవచ్చు. ఫార్టీ, ఫిఫ్టీస్ మాత్రం చేయగలడు. అయితే, కెప్టెన్‌గా తుదిజట్టు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి లాభం చేకూరుతుంది.టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా తన ప్రణాళికలు, వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే.. రోహిత్ శర్మను కొని, కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. రోహిత్ ఐపీఎల్లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు.మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీకాగా ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి చాలాకాలం పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆటగాడిగా అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.చదవండి: అరంగేట్రం చేసిన నాలుగేళ్లకే పాక్ క్రికెటర్ రిటైర్మెంట్.. కానీ ఓ ట్విస్ట్! -
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న హార్దిక్ ప్రపంచకప్-2024లో కీలక పాత్ర పోషించగలడని జోస్యం చెప్పాడు.ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ప్రభావం చూపగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన పాండ్యా ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నాడు.అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆడిన పది మ్యాచ్‌లలో మూడు మాత్రమే గెలిచింది. ఇక పేస్ ఆల్‌రౌండర్ పాండ్యా 197 పరుగులు స్కోరు చేయడంతో పాటు.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ధారాళంగా పరుగులు(ఎకానమీ 11) ఇచ్చి ఈ మాత్రం వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన మహ్మద్ కైఫ్.. పాండ్యాకు అండగా నిలిచాడు.‘‘ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ఇంపాక్ట్ చూపగలడని నేను భావిస్తున్నా. పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌ల సందర్భంగా ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది.మెల్బోర్న్లో కోహ్లి 82 పరుగులు చేసినపుడు.. హార్దిక్ పాండ్యా 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు.ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫినిషింగ్ టచ్‌తో ఆకట్టుకున్నాడు. నవాజ్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో దుమ్ములేపాడు. దినేశ్ కార్తిక్, జడేజా అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడి జట్టును గట్టెక్కించాడు’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో గుర్తుచేశాడు.మేజర్ ఈవెంట్లలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుతో ఉండటం ఎంత అవసరమో ఈ ఉదాహరణల ద్వారా వివరించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
T20 WC: ఓపెనర్‌గా అతడు.. రింకూ, సంజూకు నో ఛాన్స్!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. మే 26 ఫైనల్‌తో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1న టీ20 వరల్డ్‌కప్-2024కు తెరలేవనుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ ఐసీసీ టోర్నీలో భారత తుదిజట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్‌తో పాటు ఓపెనర్ అతడే ‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లి నంబర్ 3, సూర్యకుమార్ యాదవ నంబర్ 4, హార్దిక్ పాండ్యా ఐదో నంబర్లో.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ డెప్త్ దృష్ట్యా నా జట్టులో ఆల్రౌండర్లకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అక్షర్ పటేల్ ఏడు, రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాతి స్థానంలో నైపుణ్యాలున్న బౌలర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాలి. పేసర్ల కోటాలో ఆ ఇద్దరు తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు రావాల్సి ఉంటుంది. ఇలా అయితే తుదిజట్టు కూర్పు సరిగ్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అయితే, అనూహ్యంగా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్-2024లో సత్తా చాటుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కైఫ్ చోటివ్వకపోవడం గమనార్హం. బ్యాట్ ఝులిపించలేకపోతున్న జైస్వాల్ మహ్మద్ కైఫ్ ఎంచుకున్న తుదిజట్టులోని ఆటగాళ్లలో ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు కోహ్లి 319 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, యశస్వి జైస్వాల్ మాత్రం ఇంత వరకు ప్రభావం చూపలేదు. ఈ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం 255 పరుగులతో దుమ్ములేపుతున్నాడు. ఇక వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ 246 పరుగులతో పంత్ కంటే చాలా ముందున్నాడు. రింకూ సైతం కేకేఆర్‌పై ఫినిషర్‌గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో టీమిండియాను రోహిత్ శర్మనే ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! -
విరాట్ కోహ్లి బ్రేక్ తీసుకున్న ప్రతిసారీ జరిగేది ఇదే!
Virat Kohli- RCB- IPL 2024: టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి గురించి భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024లో ఈ రన్‌మెషీన్ పరుగుల వరద పారించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడాల్సి ఉండగా సెలవు తీసుకున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన కోహ్లి.. ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన కోహ్లి.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ ఆర్సీబీ స్టార్ మైదానంలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్(టీ20) టోర్నీలో అఫ్గనిస్తాన్ మీద కోహ్లి కొట్టిన శతకం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత అతడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అద్భుతమైన ఫామ్‌తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లిలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. తను ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తాడో అప్పుడు మరింత ప్రమాదకారిగా మారతాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటానికి రెగ్యులర్‌గా ఆడుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు విరుద్దం. ముందుగా చెప్పినట్లు బ్రేక్ తర్వాత.. తన ఆట తీరు ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లి ఫామ్ మీదనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయని మహ్మద్ కైఫ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య చెపాక్ వేదికగా ఈ ఈవెంట్‌కు తెరలేవనుంది. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్‌లను ఒప్పించి మరీ.. -
శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అసోం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 405 పరుగులకు ఆలౌట్ అయింది. అనుస్తుప్ మజుందార్(125), కెప్టెన్, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్ ఆర్డర్లో కరణ్ లాల్(52), సూరజ్ సింధు జైస్వాల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్ దాస్(50), సాహిల్ జైన్(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ ఆబ్సెంట్ హర్ట్(0)గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(మహ్మద్ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, అంకిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ అసోంను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్ సింధు జైస్వాల్ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్ ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్‌లో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన సూరజ్ సింధు జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు కాకుండా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం. చదవండి: శివమ్ దూబే మెరుపు శతకం -
బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన షమీ తమ్ముడు.. టాప్ స్కోరర్‌గా..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ రంజీ ట్రోఫీ 2024లో ఇరగదీస్తున్నాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కైఫ్.. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కైఫ్.. బెంగాల్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కైఫ్ యూపీతో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కైఫ్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 45 పరుగులు చేసి, తన జట్టుకు అతి మూల్యమైన పరుగులను అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. కైఫ్ (4/14), సూరజ్ సింధు (3/20), ఇషాన్ పోరెల్ (2/24) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ (8/41) విజృంభించడంతో బెంగాల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (188) పరిమితమైంది. ఆఖర్లో కైఫ్ (45 నాటౌట్) రాణించకపోయి ఉంటే, యూపీకి పట్టిన గతే బెంగాల్‌కు కూడా పట్టి ఉండేది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో కైఫ్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అనంతరం కైఫ్ యూపీ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతితో (3/72) చెలరేగాడు. కైఫ్‌తో పాటు సూరజ్ సింధు ఓ వికెట్ తీయడంతో యూపీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే..
Ranji Trophy 2023-24: టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ-2024 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఈ రైటార్మ్ పేసర్ తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బెంగాల్‌తో మొదలైన టెస్టులో భువీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అరవై పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా తన బౌలింగ్ నైపుణ్యాలతో బెంగాల్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మహ్మద్ కైఫ్‌నకు నాలుగు వికెట్లు కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు) అత్యధికంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, ఇషాన్ పోరెల్ రెండు వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్ సమర్థ్ సింగ్ 13 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. భువీ కూడా తగ్గేదేలే ప్రత్యర్థిని అల్ప స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్‌కు భువీ వరుస షాకులు ఇచ్చాడు. ఈ యూపీ బౌలర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13, సుదీప్ కుమార్ ఘరామి 0, అనుస్తుప్ మజుందార్ 12, మనోజ్ తివారి 3, అభిషేక్ పోరెల్ 12 పరుగులకే పరిమితమయ్యారు. ఇలా మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్ బ్యాటర్లు శ్రేయాన్ష్ ఘోష్ 37, కరణ్ లాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అన్న షమీ బాటలో తమ్ముడు కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీకి దేశవాళీ క్రికెట్లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. టీమిండియా స్టార్ పేసర్ స్థాయికి ఎదిగాడు. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు మహ్మద్ కైఫ్ సైతం ప్రస్తుతం బెంగాల్‌కే ఆడుతున్నాడు. ఇలా ఈరోజు అతడు అత్యుత్తమ ప్రదర్శనతో తన సొంత రాష్ట్రానికి చెందిన యూపీ జట్టును 60 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు.. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కానీ.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో షమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు.. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి జూనియర్లు జట్టులో పాతుకుపోవడంతో భువీకి మొండిచేయే ఎదురవుతోంది. అయితే, తాజా రంజీ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. చదవండి: IND Vs AFG: రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్ .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
అరంగేట్రంలో సత్తాచాటిన మహ్మద్ షమీ తమ్ముడు.. ఆంధ్రా జట్టుపై!
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో భాగంగా ఆంధ్రాతో మ్యాచ్‌తో బెంగాల్ తరుపున మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కైఫ్ 3 వికెట్లు పడగొట్టి అందరని అకట్టుకున్నాడు. కైఫ్‌కు కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. కవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఆంధ్ర, బెంగాల్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 409 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగాల్ బ్యాటర్లలో ముజుందార్(125) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఆంధ్ర జట్టు సైతం తమ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఆంధ్ర కూడా 445 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 36 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఆఖరి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: IND vs SA: రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!? -
బుమ్రా కాదు! బాబర్‌కు చుక్కలు చూపించగల భారత బౌలర్ అతడే!
Asia Cup 2023 India Vs Pakistan: ‘మహ్మద్ షమీ అద్భుతమైన బౌలర్. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా గైర్హాజరీలో జట్టుకు ప్రధాన బలంగా నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడి రికార్డు గొప్పగా ఉంది. అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లలో షమీ కూడా ఒకడు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో షమీ ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం (సెప్టెంబరు 2) మ్యాచ్ జరుగనుంది. శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె ఇందుకు వేదిక. దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. బాబర్‌కు షమీ చుక్కలు చూపిస్తాడు ఈ నేపథ్యంలో గత రికార్డులననుసరించి ఈసారి కూడా టీమిండియాదే పైచేయి అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మహ్మద్ కైఫ్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఇబ్బంది పెట్టగల టీమిండియా బౌలర్‌పై తన అంచనా తెలియజేశాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో బాబర్‌కు చుక్కలు చూపించడం తథ్యమని పేర్కొన్నాడు. మహ్మద్ షమీ ప్రస్తుతం షమీ మంచి ఫామ్‌లో ఉన్నాడని.. కచ్చితంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రాణిస్తాడని జోస్యం చెప్పాడు. భారత జట్టుకు ప్రధాన బలం కాగలడని పేర్కొన్నాడు. ‘‘ఈసారి బాబర్ ఆజం.. మహ్మద్ షమీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం బాబర్‌కు ఓ సవాలు లాంటిదే’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. సూపర్ ఫామ్‌లో షమీ కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 64 టెస్టులు, 90 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. వరుసగా ఆయా ఫార్మాట్లలో 229, 162, 24 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. తాజా సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత షమీకి పూర్తిగా విశ్రాంతినిచ్చారు. జస్ప్రీత్ బుమ్రా గాయం నేపథ్యంలో షమీని ప్రధాన అస్త్రంగా వాడేందుకు ఈ మేరకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే, ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఆసియా కప్-2023 రేసులోకి దూసుకువచ్చాడు. పాక్ భారీ విజయంతో.. ఇదిలా ఉంటే.. తమ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడ్డ పాకిస్తాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 151 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Asia Cup: ఆటగాళ్ల జెర్సీలపై పాక్ పేరు లేకపోవడానికి కారణమిదే! అనవసరంగా.. -
ధావన్ ఖలీఫా లాంటివాడు.. ఈసారి పంజాబ్ కచ్చితంగా: టీమిండియా మాజీ బ్యాటర్
IPL 2023- Shikhar Dhawan: ‘‘పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బాగుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బౌలర్లు జట్టులో ఉన్నారు. ఈసారి ఐపీఎల్లో పంజాబ్ టాప్-4లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గురించి మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ ఐపీఎల్‌కు ఖలీఫా లాంటివాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా నిలుస్తున్నాడు’’ అని కొనియాడాడు. ఓవైపు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటం.. మరోవైపు సమర్థవంతమైన కెప్టెన్ ఉన్న కారణంగా పంజాబ్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం ఖాయమని కైఫ్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్-2023 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గబ్బర్ హిట్! ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో తొలి రెండు మ్యాచ్‌లలో ధావన్ సేన జయకేతనం ఎగురవేసింది. తమ ఆరంభ మ్యాచ్‌లో సొంతమైదానం మొహాలీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడ్డ పంజాబ్.. డీఎల్ఎస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ధావన్ 40 పరుగులు సాధించాడు. జట్టు 191 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమైన అర్ష్‌దీప్ సింగ్(3 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రాహుల్ చహర్, హర్‌ప్రీత్‌బ్రార్, సికందర్ రజా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఒకడే ఒక్కడు మొనగాడు ఇక రెండో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన పంజాబ్ విజయంలో ధావన్ (86 పరుగులు నాటౌట్) , పేసర్ నాథన్ ఎల్లిస్ (4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు) కీలక పాత్ర పోషించారు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ గురువారం గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన మహ్మద్ కైఫ్.. ధావన్ బ్యాటింగ్ మెరుపులు, నాయకత్వ ప్రతిభను ప్రశంసించాడు. ఈసారి పంజాబ్ కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని జోస్యం చెప్పాడు. కాగా గాయం నుంచి కోలుకున్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ జట్టుతో చేరడంతో పంజాబ్‌కు బలం పెరిగినట్లయింది. చదవండి: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..! IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..! -
కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో..
IPL 2023 KKR Vs RCB- Virat Kohli: ‘‘విరాట్ కోహ్లి.. అచ్చం ఈరోజు ఎలాగైతే అవుటయ్యాడో.. గతంలో ఓసారి కూడా ఇలాగే పెవిలియన్ చేరాడు. ఆరోజు డ్రెస్సింగ్ రూంలో కోహ్లి నా పక్కనే ఉన్నాడు. కచ్చితంగా కోహ్లి కోపంతో తన బ్యాట్‌ను విసిరేస్తాడని అనుకున్నా. నేను అనుకున్నట్లే కోహ్లి బ్యాట్ తీసుకుని దూరంగా విసిరేశాడు. ప్యాడ్స్ తీసి పారేశాడు. పక్కనే కూర్చున్న నాతో.. ‘‘తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా భారీ స్కోరు సాధిస్తా చూడు’’ అన్నాడు. నిజంగానే నెక్ట్స్ మ్యాచ్‌లో 72 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ముందు మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసిన అవుటైన సదరు బ్యాటర్.. వెంటనే పుంజుకుని తదుపరి మ్యాచ్‌లో 72 రన్స్ సాధించాడంటే మామూలు విషయం కాదు. అప్పుడే నాకు తనెంత ప్రత్యేకమైన, విశేషమైన ఆటగాడో అర్థమైంది’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ గతాన్ని గుర్తుచేసుకున్నాడు. తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి టీమిండియా స్టార్, రన్ మెషీన్ కోహ్లి పరుగుల దాహం, ఆట పట్ల అతడి అంకిత భావం అమోఘమంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 18 బంతులు ఎదుర్కొని 21 పరుగులు చేసి సునిల్ నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో అసహనంతో క్రీజును వీడాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. కైఫ్... ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన సమయంలో కోహ్లితో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 81 పరుగుల తేడాతో ఓడింది. ఈ సీజన్లో తొలి పరాజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి 49 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి
దోహా వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. మార్చి 20న జరిగే ఫైనల్లో వరల్డ్ జెయింట్స్‌ను ఢీకొట్టేందుకు ఆసియా లయన్స్ అర్హత సాధించింది. నిన్న (మార్చి 18) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని ఆసియా లయన్స్.. గౌతమ్ గంభీర్ సారధ్యంలోని ఇండియా మహారాజాస్ను 85 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. The Lions roar their way to the finals! 🦁💥@AsiaLionsLLC won by 85 runs in the ultimate showdown of this season! 🎊#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/ZEyo1I76gC — Legends League Cricket (@llct20) March 18, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్.. ఉపుల్ తరంగ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), తిలకరత్నే దిల్షాన్ (26 బంతుల్లో 27; 2 ఫోర్లు), మహ్మద్ హఫీజ్ (24 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అస్ఘర్ అఫ్ఘాన్ (24 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), తిసార పెరీరా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. Tharanga Thriller!🏏👏 Ladies and Gentlemen, @upultharanga44 is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3HhkbPoKd5 — Legends League Cricket (@llct20) March 18, 2023 మహారాజాస్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, ప్రజ్ఞాన్ ఓజా తలో 2 వికెట్లు, ప్రవీణ్ తాంబే ఓ వికెట్ పడగొట్టగా.. మహ్మద్ కైఫ్ అత్యద్భుతమైన 3 క్యాచ్‌లు పట్టి మ్యాచ్‌ను రక్తి కట్టించాడు. మహారాజాస్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 15 పరుగులు సమర్పించుకున్నారు. Kaif-tastic, Kaif-alicious, Kaif-a-mazing! 💥👑 The legend @MohammadKaif shows how it's done the kaifway! #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #MohammadKaif pic.twitter.com/GsJm8xAcLN — Legends League Cricket (@llct20) March 18, 2023 అనంతరం ఛేదనకు దిగిన మహారాజాస్.. ఆసియా సింహాల బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మహారాజాస్ ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (15), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (32), మహ్మద్ కైఫ్ (14), సురేశ్ రైనా (18) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. యూసఫ్ పఠాన్ (9), ఇర్ఫాన్ పఠాన్ (3), మన్విందర్ బిస్లా (8), స్టువర్ట్ బిన్నీ (0), అశోక్ దిండా (2), ప్రవీణ్ తాంబే (0) నిరాశపరిచారు. Despite the defeat, @GautamGambhir is the @rariohq Boss Cap Holder for the runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/II4hvjRxmG — Legends League Cricket (@llct20) March 18, 2023 లయన్స్ బౌలర్లలో సోహైల్ తన్వీర్, అబ్దుర్ రజాక్, మహ్మద్ హఫీజ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఇసురు ఉడాన, షాహిద్ అఫ్రిది, తిలకరత్నే దిల్షాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. .@sohailmalik614 successfully owns the @rariohq Boss Cap for the wickets after today's amazing performance!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/DXatiJujiI — Legends League Cricket (@llct20) March 18, 2023 -
ఐపీఎల్ హంగామా నడుస్తున్నా నేనున్నానని గుర్తు చేస్తున్న పుజారా..!
ఇంగ్లండ్ కౌంటీల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాది కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన గొప్ప ఆటగాళ్లెప్పుడూ పుజారాలా బ్యాట్‌తోనే సమాధానం చెబుతారని.. సెంచరీలు, డబుల్ సెంచరీలతోనే వారు సెలెక్టర్లకు సవాలు విసురుతారని అన్నాడు. ఓ పక్క ఐపీఎల్ హంగామా నడుస్తున్నా, పుజారా నేనున్నానని సెలెక్టర్లకు గుర్తు చేశాడని పేర్కొన్నాడు. What do great players do when out of India team? Knock the selectors' doors with 100s and 200s like Pujara. Away from IPL glamour, a simple 'forget me not' message. @cheteshwar1 — Mohammad Kaif (@MohammadKaif) May 8, 2022 కాగా, పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో నాలుగు శతకాలు (డెర్బీషైర్‌పై 201*, వోర్సెస్టర్‌షైర్‌పై 109, డర్హమ్‌పై 203, మిడిల్‌సెక్స్‌పై 170*) బాదాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. Make yourselves comfortable and watch every ball of Shaheen Afridi 🆚 Cheteshwar Pujara 🤩 #LVCountyChamp pic.twitter.com/E6uVJopBQr — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 తాజాగా మిడిల్సెక్స్తో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 197 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 170 పరుగులు సాధించిన పుజారా తన జట్టును మాత్రం ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పుజారా డబుల్ సెంచరీతో పాటు మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ససెక్స్ 335/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఫలితం అనుభవించింది. ససెక్స్ నిర్ధేశించిన 370 పరుగుల టార్గెట్‌ను మిడిల్సెక్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మిడిల్సెక్స్ ఓపెనర్ సామ్ రాబ్సన్ (149) సెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్ (79), మ్యాక్స్ హోల్డన్ (80 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకముందు ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌట్ కాగా.. మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పుజారా.. ప్రత్యర్ధి బౌలర్ (మిడిల్సెక్స్), పాక్ ఆటగాడు షాహీన్ అఫ్రిది మధ్య బ్యాటిల్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. పుజారా.. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది చుక్కలు చూపించాడు. చదవండి: IPL 2022: కోహ్లి గోల్డెన్ డక్.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్ -
ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20 ఖలీఫా..!
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ (88) అజేయమైన అర్ధ సెంచరీతో రాణించి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన మైలురాళ్లను అధిగమించిన విషయం తెలిసిందే. Dhoni Thala hai, Kohli King hain aur Shikhar? 6000 IPL runs, delivering under pressure, he is T20 ka Khalifa. He should play T20 World Cup. Don't ask me where, if I was selector, I would tell you. — Mohammad Kaif (@MohammadKaif) April 26, 2022 ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గబ్బర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్విటర్ వేదికగా శిఖర్ను శిఖరానికెత్తాడు. ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20కా ఖలీఫా అంటూ కొనియాడాడు. ధవన్ త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆడాలి, ఏ స్థానంలో అని నన్ను అడగకండి, నేను సెలెక్టర్‌ని అయితే తప్పక చెప్పేవాడిని అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా, సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ధవన్ పలు అరుదైన మైలురాళ్లను క్రాస్ చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో కోహ్లి (6402) తర్వాత 6000 పరుగుల మార్కును దాటిన రెండో ఆటగాడిగా, ఐపీఎల్లో ఓ జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా, టీ20ల్లో కోహ్లి (10392 పరుగులు), రోహిత్ శర్మ (10009 పరుగులు) తర్వాత 9000 పరుగుల మార్కును అధిగమించిన మూడో భారత ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డులన్నింటినీ ధవన్ తన 200వ ఐపీఎల్ మ్యాచ్‌లో చేరుకోవడం విశేషం. చదవండి: PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్ ధవన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. भाई लोग आप की फरमाइश पे | Anything for an India victory, no matter how awkward :) pic.twitter.com/aSgGA1pUQE — Mohammad Kaif (@MohammadKaif) September 7, 2021 ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. నాగిని డ్యాన్స్ వేస్తూ టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. "టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు.. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కైఫ్.. టీమిండియా విజయాన్ని వంద శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండయా157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్ -
'యూవీ.. నీ ఫిట్నెస్ చాలెంచ్ నాకు పంపు'
-
రాహుల్‌పై అతిగా ఆధారపడొద్దు..
హైదరాబాద్: మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనిపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికీ భారత్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్ అతడేనని స్పష్టం చేశాడు. ఎక్కువగా ఒత్తిడి ఉండే 6,7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విషయాన్ని గుర్తుచేవాడు. ముఖ్యంగా టెయిలెండర్లతో మ్యాచ్‌ను ఫినిష్ చేసే పద్దతి ఎవరూ మర్చిపోలేరన్నాడు. ఉన్నఫలంగా ధోనిని పక్కకుపెడితే టీమిండియాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎందుకంటే అతడిని పక్కకు పెడితే ఇప్పటికిప్పుడు ఆ స్థాయి వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ టీమిండియాకు దొరకడని అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే తిరిగి టీమిండియాలోకి ధోని వస్తాడని అందరూ భావిస్తూన్నారు. కానీ ఆవ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఎందుకంటే ధోని అత్యుత్తమ ఆటగాడు. ఎలాంటి ఒత్తిడిలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఈ ఓటమి తర్వాతే ధోని రిటైర్మెంట్ అంశం తెరపైకి వచ్చింది. అయితే ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఉన్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లు ధోనికి ప్రత్యామ్నాయమని అందరూ అంటున్నారు. రాహుల్ మంచి బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కీపింగ్ విషయంలో అతడిపై ఎక్కువగా ఆధారపడొద్దు. స్పెషలిస్టు కీపర్‌కు గాయమైతే ఒకటి రెండు మ్యాచ్‌లు నెట్టుకరావచ్చు. కానీ అతడికే పూర్తిస్థాయిలో కీపింగ్ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. ఇక పంత్, శాంసన్‌లు ఇంకా పరిణితి చెందాలి. సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాల స్థానాలను కోహ్లి, రోహిత్, రహానే, పుజారాలు దాదాపుగా భర్తీ చేశారు. కానీ ధోనికి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు ఎవరూ నాకైతే కనిపించలేదు. ధోని ఇంకొంత కాలం క్రికెట్ ఆడితే టీమిండియాకు ఎంతో లాభం’అంటూ కైఫ్ పేర్కొన్నాడు. చదవండి: చోటివ్వలేదని తిడుతున్నారు.. సారీ మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లు వీరే! -
ధోనికి మద్దతుగా కైఫ్.. రాహుల్ వద్దు!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సేవలు ఇంకా అవసరమనే అంటున్నాడు మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ధోని అవసరం ఉందనే విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ గ్రహించాలంటూ కైఫ్ మద్దతుగా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి అవకాశం ఇవ్వకపోతే అది చాలా పెద్ద తప్పిదం అవుతుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో భారత క్రికెట్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌పై ఆధారపడటం తగదన్నాడు. ప్రధాన వికెట్ పాత్రను రాహుల్‌కు అప్పగించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు కల్పించి, రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉపయోగించుకోవాలన్నాడు. (ధోనికి ఎలా చోటిస్తారు..?) ‘ భవిష్యత్తులో రాహుల్ మన ప్రధాన వికెట్ కీపర్ అని అభిమానులు భావిస్తూ ఉండొచ్చు. కానీ నా దృష్టిలో రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్ మాత్రమే. ప్రధాన వికెట్ కీపర్ గాయపడిన సమయంలో రాహుల్‌ను కీపర్‌గా ఉపయోగించుకుంటేనే సమంజసం. అదే సమయంలో స్పెషలిస్టు కీపర్ గాయపడినప్పుడు రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించేలా మాత్రమే చూడాలి. ఐపీఎల్లో ధోని ప్రదర్శన కోసం ఇప్పటివరకూ చాలా కళ్లు నిరీక్షించాయి. ఆ ప్రదర్శన ఆధారంగా అతని వరల్డ్‌కప్ చాన్స్ ఆధారపడుతుందనే చాలా మంది ఆతృతగా ఎదురుచూశారు. కానీ నా ప్రకారం టీ20 వరల్డ్‌కప్ అనేది మిగతా లీగ్‌లకు భిన్నం. నేను ధోని ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతని ఫామ్‌ను అంచనా వేయలేను. ధోని ఎప్పటికీ గ్రేట్ బ్యాట్స్‌మన్.. అంతే కాదు ఇంకా చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఇంకా ఐపీఎల్ ఆడాలనుకుంటున్నాడంటే అతనిలో సత్తా తగ్గలేదని చెప్పకనే చెబుతున్నాడు. జట్టుకు విజయాలను అందించడంలో ధోనిలో స్పెషల్ టాలెంట్ ఉంది. ఒత్తిడిలో మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు ఎన్నో. అటువంటి ఆటగాడ్ని దూరం పెట్టడం మాత్రం ఎంతమాత్రం సరైనది కాదు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు ఇవ్వకపోతే అది తప్పుడు నిర్ణయమే అవుతుంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ తర్వాత ధోని పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. కొంతకాలం ధోని విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో రిషభ్ పంత్‌కు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించారు. కాగా, పంత్ పదే పదే విఫలం కావడంతో అతన్ని తప్పించి కేఎల్ రాహుల్ చేత కీపింగ్ చేయించారు. ఇక రాహుల్ కీపింగ్, బ్యాటింగ్‌లో మెరవడంతో పంత్ పక్కకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం పంత్‌ను పట్టించుకోని టీమిండియా మేనేజ్మెంట్ రాహుల్‌పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ధోని అవసరం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు టీమిండియా పెద్దలు. ఐపీఎల్లో జరిగి ధోని ఆకట్టుకుంటే మళ్లీ అతను హైలైట్ అయ్యేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడ్డా ఇంకా దానిపై స్పష్టత లేదు. అసలు ఈ సీజన్లో ఐపీఎల్ జరగదనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో ధోనిని ఏ ప్రాతిపదికన భారత జట్టులోకి తీసుకుంటారంటూ గంభీర్ లాంటి ప్రశ్నిస్తున్నారు. -
‘ఫిట్నెస్ అవసరం.. యోయో కాదు’
భువనేశ్వర్: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్లు ఎంపిక కావాలంటే యో యో టెస్టు అనేది ప్రామాణికంగా మారింది. క్రికెటర్లు పరుగులు చేస్తున్నా, వికెట్లు సాధిస్తున్నా యోయో టెస్టులో పాస్ కాకపోతే వారిని పక్కక పెట్టేయడం చూస్తునే ఉన్నాం. అయితే దీనిపై ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం యోయో టెస్టు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘జట్టును ఎంపిక చేసేటప్పుడు సమతూకం అనేది ముఖ్యం. అదే సమయంలో ఆటగాళ్లకు ఫిట్నెస్ కూడా అవసరమే. కానీ యోయో అనేది ప్రామాణికంగా కాదు. ఒక ఆటగాడు ఎంపికను యోయో ఆధారంగా తీసుకోవడం సరైన నిర్ణయంకాదు. ఒక క్రికెటర్ పరుగులు సాధిస్తూ, వికెట్లు తీస్తున్న సమయంలో యోయో టెస్టులో పాస్ కాలేదనే కారణంగా జట్టులో ఎంపిక చేయకపోవడం దారుణం. ఈ తరహాలో మంచి ఆటగాడ్ని జట్టులో ఎంపిక చేయకపోతే సమతూకమనేది ఉండదు. నేను భారత్‌కు ఆడేటప్పుడు ఆటగాళ్ల ఫిట్నెస్ను తెలుసుకునేందుకు టెస్టు(బీప్ టెస్టు) ఉండేది. దీనివల్ల జట్టు నుంచి తప్పించడమనేది ఉండేది కాదు. ఒకవేళ ఫిట్నెస్ లెవల్ బాగోలేని పక్షంలో దాన్ని మెరుగుపరుచుకునేందుకు కొన్ని నెలల సమయం ఇచ్చేవారు. ప్రస్తుత భారత్ జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌నే చూడండి. అతను ఒక కీపర్. కానీ 50 ఓవర్ల క్రికెట్లో కీపర్ కాకుండా ఫీల్డర్‌గా బాధ్యతలు పంచుకున్నాడు. అది అతనికి సౌకర్యవంతం కాకపోవచ్చు. ఇక విరాట్ కోహ్లి అద్భుతమైన ఫిట్నెస్ ప్రమాణాలు ఉన్న ఆటగాడు. జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లిని అనుసరిస్తూ ఫిట్నెస్ లెవల్స్‌ను పెంచుకుంటున్నారు. ఫిట్నెస్ అనేది అవసరం. కానీ యోయో టెస్టు పేరుతో ఆటగాడి కనీస ఉత్తీర్ణత మార్కులు 16.1గా ఉండటం కరెక్ట్ కాదు’ అని కైఫ్ పేర్కొన్నాడు. -
ఆంధ్రా కెప్టెన్ గా మహ్మద్ కైఫ్!
కాన్పూర్: గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీంఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. ఇక ఆ రాష్ట్రానికి గుడ్ బై చెప్పనున్నాడు. రాబోయే రంజీ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ తరుపున బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నాడు. 16 సంవత్సరాలుగా యూపీ తరుపున ఆడిన ఈ క్రికెటర్.. త్వరలో ఆంధ్రా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువకులను వెలుగులోకి తెచ్చేందుకు యూపీ క్రికెట్ అసోసియేషన్ నడుంబిగించడంతో కైఫ్ కు ముగింపు పలికింది. దీనిలో భాగంగానే కైఫ్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ తో రెండు సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నాడు. ఫస్ట్ క్రికెట్ లో మంచి రికార్డు ఉన్న కైఫ్ సేవలను ఆంధ్రా రంజీ క్రికెట్ అసోసియేషన్ వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కైఫ్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 9,277 పరుగులు, 143 క్యాచ్ లు, 20 వికెట్లు తీసుకున్నాడు.