Mohammed Kaif Recalled A Story About Virat Kohli From The Batter Early Days For RCB - Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లి వచ్చాడు.. నేను అనుకున్నట్లే కోపంగా బ్యాట్‌ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో..

Published Fri, Apr 7 2023 4:29 PM | Last Updated on Fri, Apr 7 2023 5:31 PM

Kaif Mind Boggling RCB Story: Kohli Came Threw His Bat Told Me That - Sakshi

కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి క్లీన్‌బౌల్డ్‌ (Photo Credit: iplt20.com)

IPL 2023 KKR Vs RCB- Virat Kohli: ‘‘విరాట్‌ కోహ్లి.. అచ్చం ఈరోజు ఎలాగైతే అవుటయ్యాడో.. గతంలో ఓసారి కూడా ఇలాగే పెవిలియన్‌ చేరాడు. ఆరోజు డ్రెస్సింగ్‌ రూంలో కోహ్లి నా పక్కనే ఉన్నాడు. కచ్చితంగా కోహ్లి కోపంతో తన బ్యాట్‌ను విసిరేస్తాడని అనుకున్నా. 

నేను అనుకున్నట్లే కోహ్లి బ్యాట్‌ తీసుకుని దూరంగా విసిరేశాడు. ప్యాడ్స్‌ తీసి పారేశాడు. పక్కనే కూర్చున్న నాతో.. ‘‘తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా భారీ స్కోరు సాధిస్తా చూడు’’ అన్నాడు. నిజంగానే నెక్ట్స్ మ్యాచ్‌లో 72 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

ముందు మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసిన అవుటైన సదరు బ్యాటర్‌.. వెంటనే పుంజుకుని తదుపరి మ్యాచ్‌లో 72 రన్స్‌ సాధించాడంటే మామూలు విషయం కాదు. అప్పుడే నాకు తనెంత ప్రత్యేకమైన, విశేషమైన ఆటగాడో అర్థమైంది’’ అని టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ గతాన్ని గుర్తుచేసుకున్నాడు.

తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరి
టీమిండియా స్టార్‌, రన్‌ మెషీన్‌ కోహ్లి పరుగుల దాహం, ఆట పట్ల అతడి అంకిత భావం అమోఘమంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 18 బంతులు ఎదుర్కొని 21 పరుగులు చేసి సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో అసహనంతో క్రీజును వీడాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. కైఫ్‌... ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన సమయంలో కోహ్లితో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నాడు.

కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 81 పరుగుల తేడాతో ఓడింది. ఈ సీజన్‌లో తొలి పరాజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి 49 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చదవండి: గిల్‌, రాహుల్‌ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్‌ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌! ప్రతీసారి ఇంతే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement