శిఖర్ ధావన్ (PC: IPL/BCCI)
IPL 2023- Shikhar Dhawan: ‘‘పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బాగుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బౌలర్లు జట్టులో ఉన్నారు. ఈసారి ఐపీఎల్‌లో పంజాబ్ టాప్-4లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గురించి మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ ఐపీఎల్‌కు ఖలీఫా లాంటివాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా నిలుస్తున్నాడు’’ అని కొనియాడాడు.
ఓవైపు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటం.. మరోవైపు సమర్థవంతమైన కెప్టెన్ ఉన్న కారణంగా పంజాబ్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం ఖాయమని కైఫ్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్-2023 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గబ్బర్ హిట్!
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో తొలి రెండు మ్యాచ్‌లలో ధావన్ సేన జయకేతనం ఎగురవేసింది. తమ ఆరంభ మ్యాచ్‌లో సొంతమైదానం మొహాలీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడ్డ పంజాబ్.. డీఎల్‌ఎస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ధావన్ 40 పరుగులు సాధించాడు. జట్టు 191 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమైన అర్ష్‌దీప్ సింగ్(3 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రాహుల్ చహర్, హర్‌ప్రీత్‌బ్రార్, సికందర్ రజా పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఒకడే ఒక్కడు మొనగాడు
ఇక రెండో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన పంజాబ్ విజయంలో ధావన్ (86 పరుగులు నాటౌట్) , పేసర్ నాథన్ ఎల్లిస్ (4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు) కీలక పాత్ర పోషించారు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
కెప్టెన్ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ గురువారం గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన మహ్మద్ కైఫ్.. ధావన్ బ్యాటింగ్ మెరుపులు, నాయకత్వ ప్రతిభను ప్రశంసించాడు. ఈసారి పంజాబ్ కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని జోస్యం చెప్పాడు. కాగా గాయం నుంచి కోలుకున్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ జట్టుతో చేరడంతో పంజాబ్‌కు బలం పెరిగినట్లయింది.
చదవండి: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..!
IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..!
Comments
Please login to add a commentAdd a comment