బాబర్ ఆజం
Asia Cup 2023 India Vs Pakistan: ‘మహ్మద్ షమీ అద్భుతమైన బౌలర్. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా గైర్హాజరీలో జట్టుకు ప్రధాన బలంగా నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడి రికార్డు గొప్పగా ఉంది. అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లలో షమీ కూడా ఒకడు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో షమీ ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు.
ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం (సెప్టెంబరు 2) మ్యాచ్ జరుగనుంది. శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె ఇందుకు వేదిక. దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే.
బాబర్‌కు షమీ చుక్కలు చూపిస్తాడు
ఈ నేపథ్యంలో గత రికార్డులననుసరించి ఈసారి కూడా టీమిండియాదే పైచేయి అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మహ్మద్ కైఫ్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఇబ్బంది పెట్టగల టీమిండియా బౌలర్‌పై తన అంచనా తెలియజేశాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో బాబర్‌కు చుక్కలు చూపించడం తథ్యమని పేర్కొన్నాడు.
మహ్మద్ షమీ
ప్రస్తుతం షమీ మంచి ఫామ్‌లో ఉన్నాడని.. కచ్చితంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రాణిస్తాడని జోస్యం చెప్పాడు. భారత జట్టుకు ప్రధాన బలం కాగలడని పేర్కొన్నాడు. ‘‘ఈసారి బాబర్ ఆజం.. మహ్మద్ షమీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం బాబర్‌కు ఓ సవాలు లాంటిదే’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
సూపర్ ఫామ్‌లో షమీ
కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 64 టెస్టులు, 90 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. వరుసగా ఆయా ఫార్మాట్లలో 229, 162, 24 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. తాజా సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఇక ఆస్ట్రేలియాతో జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత షమీకి పూర్తిగా విశ్రాంతినిచ్చారు. జస్‌ప్రీత్ బుమ్రా గాయం నేపథ్యంలో షమీని ప్రధాన అస్త్రంగా వాడేందుకు ఈ మేరకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే, ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఆసియా కప్-2023 రేసులోకి దూసుకువచ్చాడు.
పాక్ భారీ విజయంతో..
ఇదిలా ఉంటే.. తమ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడ్డ పాకిస్తాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 151 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: Asia Cup: ఆటగాళ్ల జెర్సీలపై పాక్ పేరు లేకపోవడానికి కారణమిదే! అనవసరంగా..
Comments
Please login to add a commentAdd a comment