టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ రంజీ ట్రోఫీ 2024లో ఇరగదీస్తున్నాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కైఫ్.. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కైఫ్.. బెంగాల్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు.
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కైఫ్ యూపీతో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కైఫ్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 45 పరుగులు చేసి, తన జట్టుకు అతి మూల్యమైన పరుగులను అందించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. కైఫ్ (4/14), సూరజ్ సింధు (3/20), ఇషాన్ పోరెల్ (2/24) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ (8/41) విజృంభించడంతో బెంగాల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (188) పరిమితమైంది. ఆఖర్లో కైఫ్ (45 నాటౌట్) రాణించకపోయి ఉంటే, యూపీకి పట్టిన గతే బెంగాల్‌కు కూడా పట్టి ఉండేది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో కైఫ్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
అనంతరం కైఫ్ యూపీ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతితో (3/72) చెలరేగాడు. కైఫ్‌తో పాటు సూరజ్ సింధు ఓ వికెట్ తీయడంతో యూపీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment