టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న ఈ వెటరన్ పేసర్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
ఇదిలా ఉంటే.. షమీ వ్యక్తిగత జీవితంలో పడ్డ కష్టాల గురించి అతడి ప్రాణ స్నేహితుడు ఉమేశ్ కుమార్ తాజాగా వెల్లడించాడు. ఈ ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
ఆరోజు తనని అలా చూడగానే భయం వేసింది
‘‘షమీకి అది నిజంగా గడ్డుకాలం. ఆరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో నీళ్లు తాగేందుకు నేను నిద్రలేచాను. కిచెన్ వైపు వెళ్తూ.. బాల్కనీ వైపు చూశా. అప్పుడు షమీ వాళ్ల బాల్కనీ చివర నిల్చుని కిందకు చూస్తున్నాడు. మేము ఉండేది 19వ ఫ్లోర్. అతడి ఆలోచన ఏమిటో నేను పసిగట్టాను. నాకెంతోగానో భయం వేసింది’’ అని ఉమేశ్ కుమార్ చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
అయితే, అదృష్టవశాత్తూ షమీపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాయని.. తిరిగి టీమిండియాకు ఆడి తానేంటో నిరూపించుకున్నాడని ఉమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా షమీ మాజీ భార్య హసీన్ జహాన్ అప్పట్లో అతడిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
స్త్రీలోలుడైన మహ్మద్ షమీ పాకిస్తానీల నుంచి డబ్బు తీసుకుని మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని బాంబు పేల్చింది. అంతేకాదు తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. ఈ క్రమంలో షమీ కెరీర్ ప్రమాదంలో పడగా.. లోతుగా దర్యాప్తు జరిపిన బీసీసీఐ విచారణ కమిటి అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇక అనేక అవాంతరాల అనంతరం హసీన్ జహాన్ నుంచి షమీ పూర్తిగా విడిపోయాడు. అయితే, నాటి పరిస్థితుల్లో డిప్రెషన్‌కు లోనైన షమీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని ఉమేశ్ కుమార్ శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తాజాగా వెల్లడించాడు. అదే విధంగా.. షమీ డైట్ గురించి ఓ సీక్రెట్ కూడా పంచుకున్నాడు.
కేజీ మటన్ ఉండాల్సిందే
‘‘షమీ రోజుకు కిలో మటన్ తింటాడు. డైట్‌లో ఏమైనా తేడాలు వస్తే సహిస్తాడేమో గానీ.. మటన్ లేకుంటే మాత్రం అతడికి కోపం వస్తుంది. ఒక్కరోజైతే మటన్ లేకుండా ఉంటాడు.. కానీ రెండో రోజు అస్సలు ఊరుకోడు. మూడో రోజు కూడా మటన్ పెట్టలేదంటే పిచ్చోడైపోతాడు.
అంతేకాదు.. అతడి బౌలింగ్ స్పీడ్ గంటకు పదిహేను కిలోమీటర్ల మేర తగ్గినా తగ్గొచ్చు’’ అంటూ ఉమేశ్ కుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు. షమీకి అన్నింటికంటే మటన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. అదే విధంగా.. షమీకి షాపింగ్ చేయడం అంటే సరదా అని.. మ్యాచ్‌లు లేనపుడు తనను ఢిల్లీలో షాపింగ్‌కు తీసుకువెళ్తాడని ఉమేశ్ కుమార్ తమ స్నేహబంధం గురించి చెప్పాడు.
చదవండి: Paris Olympics 2024: పూర్తి షెడ్యూల్, ఆరంభ సమయం.. అథ్లెట్ల వివరాలు
Comments
Please login to add a commentAdd a comment